trinayani serial today Episode: పాయసం అత్తయ్య తినేలా ఉందని వల్లభ భయపడుతూ వద్దని ఆపేద్దామా అని తిలొత్తమ్మను అడుగుతాడు. ఏమీ వద్దని వల్లభను ఆపేస్తుంది తిలొత్తమ్మ. ఇంతలో పావణమూర్తి ప్రేమగా దురందరకు పాయసం తినిపిస్తాడు. దురందర స్పృహ కోల్పోతుంది. అందరూ కంగారు పడుతుంటారు. విక్రాంత్ కారు తీసుకురావడానికి వెళ్తాడు. విశాల్, నేత్రి దురందరను హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి బయటకు ఎత్తుకెళ్తారు.
తర్వాత దురందర హాల్ లో కూర్చుని ఉండగా నేత్రి వాటర్ తీసుకుని వచ్చి ఇస్తుంది. నాకేమీ వద్దని ఇంట్లో ఎం తినాలన్నా భయంగా ఉంది అంటుంది. ఇంతలో సుమన వచ్చి అంతా బాగానే ఉంది కానీ మా అక్క ఎలా ఉంది అని అడుగుతుంది. అదేంటి ప్రాబ్లమ్ అత్తయ్యకు కదా..? వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో ప్రాణాలతో భయపడ్డారు అంటాడు విశాల్. దీంతో నేను అడిగింది. మా అక్క ఎలా ఉంది అంటే ఇప్పుడు నయనిలా ఉందా..? నేత్రిలా ఉందా..? అని అడిగాను అంటుంది. దీంతో విక్రాంత్ కోపంగా సుమనను తిట్టగానే.. తను అడిగింది కరెక్టే కదా.. పాయసంలో విషం ఉంటే నయని అయితే ముందే పసిగట్టేది కదా..? అలా పసిగట్టలేదు అంటే తను నయని కాదు అనే కదా అర్థం అంటుంది తిలొత్తమ్మ.
దీంతో విక్రాంత్ అమ్మా ఇంకా ఎందుకు మీకు అనుమానాలు అని అడుగుతాడు. దీంతో ఒక్క నిమిషం ఆగండి మీరు అంటున్నట్టు నేను నయని కాదు. ఈ చేతులు నయనివి కాదు. ఈ ఇంట్లో తిరగాడుతూ ఉండే కాళ్లు నయనివి కాదు. అలాంటప్పుడు నేను నయనినే అని బలవంతంగా ఒప్పించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు అంటుంది నేత్రి. దీంతో ఇదేంటి ఇలా చెప్పిందని దురందర భయపడుతుంది. నువ్వు నయనివి కానప్పుడు ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉంటావే అంటూ బయటకు గెంటి వేయడానికి తిలొత్తమ్మ వెళ్తుంటే.. ఆగు మీరు దురందర పిన్ని ప్రాణాలు ఎందుకు తీయాలనుకున్నారు. కడుపులో పసిప్రాణం పెరుగుతుందన్న జాలి కూడా లేకుండా ఇలాంటి దుర్మార్గానికి ఎందుకు ఓడిగట్టారు అని నేత్రి అడగ్గానే అందరూ షాక్ అవుతారు.
తిలొత్తమ్మ భయపడుతూనే ఏయ్ నేను నిన్ను అనుమానిస్తుంటే.. నువ్వు మా మీద అబాండాలు వేస్తావా..? అని అడుగుతుంది. ఇంతలో విక్రాంత్ బ్రో వదిన మనసులో ఏముందో నాకు తెలియదు కానీ మా అమ్మ మనసులో మాత్రం విషం ఉంది అంటాడు. దీంతో పావణమూర్తి బాధతో ఏంటి అక్కాయ్ మమ్మల్ని తల్లిదండ్రులుగా చూడాలని లేదా..? మీకు అని అడగ్గానే పావణమూర్తి ఆధారం లేకుండా నిందలు వేయేద్దు అంటుంది. ఇదే కాదు దేవీపురం వెళ్లిన నయని కారుకు యాక్సిడెంట్ అయింది. కానీ కారు నడిపిన డ్రైవర్ చేయి విరిగిందన్న విషయం మీకు తెలుసా.? ఆ విషయాలన్నీ మీ పెంపుడు తల్లి తిలొత్తమ్మ అత్తయ్యను అడగండి అని చెప్తుంది నేత్రి.
దీంతో విశాల్ కోపంగా మా దాకా రాకుండా ఇంత కాలం ఎందుకు దాచిపెట్టారు అని అడుగుతాడు. నయనికి యాక్సిడెంట్ అయిన కంగారులో మీరు ఉన్నారు. అందుకే చెప్పలేదు అని తిలొత్తమ్మ, వల్లభను తీసుకుని వెళ్లిపోతుంది. నయని, గాయత్రి పాపను ఎత్తుకుని ఫోన్ మాట్లాడుతూ వస్తుంది. కంపెనీతో డీల్ గురించి వార్నింగ్ ఇస్తుంది. దీంతో విక్రాంత్ చాలా మంచి పని చేశారు వదిన అని చెప్తాడు. లాభాల కోసం పాకులాడే వాళ్లతో బిజినెస్ చేయలేం విక్రాంత్ బాబు అంటుంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుంటుంది అని దురందర అనగానే నేనేప్పుడూ ఇలాగే ఉంటాను పిన్ని అంటుంది నయని.
నయని వదిన ప్రాసెస్ ఇలా ఉంటుందని చెప్తున్నారు అని వల్లభ అనగానే నయనిలో ఈ తెగింపు చూడటమే నాకు ఇష్టం.. పాపను ఎత్తుకుని ఉన్న నిన్ను చూస్తుంటే.. ఝాన్సీలక్ష్మీ బాయి, రుద్రమదేవి గుర్తుకు వస్తున్నారు అంటాడు. ఇంతలో నయని ఆడిటర్ సత్యమూర్తి గారికి ఫోన్ చేసి రేపు వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందని చెప్పండి అని విక్రాంత్‌కు చెప్తుంది. దీంతో తిలొత్తమ్మ ఆఫీసులో ఉన్న మిగతా డిపార్ట్‌మెంట్స్ హెడ్స్ గురించి అడిగితే వాళ్ల పేర్లు కూడా చెప్తుంది నయని. ఇంతటితో త్రినయని సీరియల్ నేటి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?