OTT Movie : ప్రస్తుతం ఓటిటిలో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు అనగానే గుర్తొచ్చేది మలయాళ సినిమాలు. మంజుమ్మెల్ బాయ్స్ క్రియేట్ చేసిన సంచలనం అంతా కాదు. ఈ మూవీ ఏ ముహూర్తన రిలీజ్ అయ్యిందో గానీ మలయాళ సినిమాల ఫేట్ మార్చేసింది. నిజానికి అంతకంటే ముందు నుంచే మలయాళ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక పాన్ ఇండియా వైడ్ మలయాళ సినిమాలను తెగ ఇష్టపడుతున్నారు. ఎలాగూ మలయాళ సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి మూవీ లవర్స్ కూడా వాటికి అడిక్ట్ అయిపోతున్నారు. తాజాగా మనం చెప్పుకొనే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా మలయాళ మూవీనే. ఇందులో ఏకంగా ఒక దయ్యం లాయర్ కి లవ్ లెటర్స్ పంపుతూ ఉంటుంది. మరి ఈ మూవీ కథ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఏ ఓటిటిలో ఉందంటే…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రొమాంటిక్ అండ్ హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో చందునాథ్, అజు వర్గీస్, అనూప్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విష్ణు భరతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ‘ఫీనిక్స్’. గత ఏడాది థియేటర్లలో కి వచ్చిన ‘ఫీనిక్స్’ మూవీ పాజిటివ్ టాక్ తో అదర గొట్టింది. ఈ హారర్ మూవీ లో ఉండే ట్విస్ట్ లు, కాన్సెప్ట్ ప్రేక్షకులను మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇక ఈ మూవీ త్వరలోనే మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. నిజానికి ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా కొనుగోలు చేసింది. కానీ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రెంటల్ బేసిస్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు అక్టోబర్ 4 నుంచి మనోరమ మ్యాక్స్ లో అవైలబుల్ గా ఉండబోతుందని సమాచారం.
కథలోకి వెళ్తే…
లవ్ అండ్ హారర్ అంశాలను మిక్స్ చేసి ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఈ రెండు అంశాలకు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ ని ఇచ్చారు డైరెక్టర్. అంతేకాకుండా ఈ సినిమా రెండు టైమ్ పీరియడ్స్ లో నడుస్తుంది. 1970, 1990 బ్యాక్ గ్రౌండ్ లో ‘ఫీనిక్స్ ‘ మూవీ నడుస్తుంది. సినిమాలో హీరో పేరు జాన్. పెద్దగా ఎవరితోనూ కలవకుండా ఉండే ఇతను ఒక లాయర్. ప్రశాంతంగా ఉంటుందని ఊరికి దూరంగా సముద్రం దగ్గర ఉన్న ఒక పాత కాలం ఇంట్లోకి భార్య, పిల్లలతో కలిసి రెంట్ కి దిగుతాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడికి రెగ్యులర్ గా ఫ్రెడ్డీ అనే వ్యక్తి ఫ్రమ్ అడ్రస్ లేకుండానే జాన్ కు ఉత్తరాలు పంపిస్తాడు. అసలు ఈ ఫ్రెడ్డీ ఎవరు? ఎందుకు జాన్ కి ప్రేమలేఖలు పంపుతున్నాడు? అన్నా రోజ్ అనే అమ్మాయి ఎలా చనిపోయింది? ఆ ఇంట్లో ఉన్న మిస్టరీ ఏంటి? అనే విషయం తెలియాలంటే ఈ మూవీని వీక్షించాల్సిందే.