Satyabhama Serial Today Episode October 1st : నిన్నటి ఎపిసోడ్ లో కోడలు తెలివికి షాక్ అయిన మహదేవయ్య మరో ప్లాన్ ఏం చేస్తుందా అని ఆలోచనలో పడతాడు. అసలు నిజం ఏంటో బయటకు వచ్చేంతవరకు నేను నిద్ర పోను అంటూ సత్య మహదేవయ్యతో ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడుతుంది. నేను ఎలాగైనా గెలుస్తాను నా గెలుపు కోసం నేను ఎదురు చూస్తాను అని సత్య, మహాదేవయ్యతో మాట్లాడుతుండటం క్రిష్ చూస్తాడు. ఏంటో బాపు తో గెలుస్తానని అంటున్నావ్ అని క్రిష్ సత్యను అడుగుతాడు. ఇక హర్ష నందిని మధ్య మైత్రి వల్ల మరోసారి గొడవ పెద్దది అవుతుంది. ఇక ఎపిసోడ్ లో కాసేపు వీరిద్దరి మధ్య రొమాంటిక్ ముచ్చట జరుగుతుంది. సత్య చెప్పిన యూనివర్సిటీ సీటు గురించి అడుగుతుంది. నందినిని ఇంటికొచ్చిన వాళ్లు ఘోరంగా అవమానిస్తారు. దానికి నందిని బాధపడుతూ ఉంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య, క్రిష్ ఇద్దరు ప్రేమగా అన్నం తినిపించుకుంటారు. సత్య క్రిష్ కు తన బాధను చెప్పే ప్రయత్నాలు చేస్తుంది. గొడవలకు పోవద్దని చెబుతూ గోరు ముద్దలు తినిపిస్తుంది. ఇద్దరు కలిసి అన్నాన్ని తినేస్తారు. ఒకప్పుడు నీకు నేను దూరం అవుతా అని భయపడ్డావు.. ఇప్పుడు నాకు నువ్వు దూరం అవుతావని బాధ పడుతున్నా అని చెబుతుంది. ఒకసారి కళ్ళు మూసుకో అని చెబుతుంది. ఏం కనిపిస్తుంది. చీకటి కదా ఆ చీకటి నువ్వు లేకుంటే మిగిలేది అని సత్య అంటుంది. దానికి క్రిష్ ఫీల్ అయిపోతాడు. ఇక నువ్వు కూర్చొ నేను వెళ్లి ప్లేట్ కడిగి వస్తాను అని చెబుతాడు క్రిష్. చేతికి తగిలిన గాయం చూసి అడుగుతుంది. సత్య.. ఏమైంది అంటే చిన్న గొడవ అని చెబుతాడు. నీకు ఏమైనా అయితే నేను బ్రతకలేను క్రిష్ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇక మైత్రి కూర్చొని ఉంటుంది. అప్పుడే హర్ష వస్తాడు. దీని గురించి ఆలోచిస్తున్నావు అని హర్ష అడుగుతాడు. దానికి నీ గురించి, నందిని గురించి అంటుంది. నేను ఉంటే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. నా వల్ల ఇద్దరు గొడవలు పడటం నాకు ఇష్టం లేదు అంటుంది. దానికి హర్ష నువ్వు ఆరోగ్యం బాగోలేక వచ్చావు. అంతేకాని కావాలని రాలేదు.. అది కూడా నేను బలవంతం చేస్తే వచ్చావు అంటాడు. ఇదంతా ఎందుకు నీకు పెళ్లి సంబంధం చూసాను. దాని గురించి మైత్రి మర్చిపొమ్మని చెబుతుంది. నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను ఇంకాస్త టైం పడుతుంది అని చెబుతుంది. అంతలోకే నందిని వస్తుంది. నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోవు అంటుంది. దానికి మైత్రి నన్ను క్షమించు నాదే తప్పు నీ చేతుల మీదుగానే ఆ పెళ్లి జరగాలి. నువ్వు నా పెళ్లి చెయ్యాలి . హర్ష పెళ్లి చూపులకు రమ్మని చెప్పు అని చెప్పి వెళ్ళిపోతుంది.
ఇక క్రిష్ కోసం కాఫీ తీసుకొస్తుంది. బయట వాతావరణం చల్లగా ఉంది కదా.. మొగుడుకు ఇవ్వాలల్సింది వేడి వేడి కాఫీ కాదు.. వేడి ముద్దు అంటాడు. సత్య పక్కన బామ్మ ఉంది అంటాడు. అప్పుడు బామ్మ ఇలాంటివి జరగాలంటే ముందుగా ముహూర్తం కావాలి అంటుంది. మొన్న పెట్టావుగా అని అంటాడు. కాసేపు వీరిద్దరి మధ్య లోల్లి జరుగుతుంది. ముహూర్తం లేదని చెప్పు లేకుంటే కాళ్లు విరుగుతాయి అని అంటాడు. చివరికి బామ్మను ఎలాగోలా ఒప్పిస్తాడు. ఇక సత్యతో సంపంజీ బామ్మ ఏమందో విన్నావా ఈరోజే మన శోభనం అంటాడు. నేను ఒక పని చెప్పినా అది కనిపెట్టాకే ఇది అంటుంది. నా పుట్టినరోజు కనుక్కోమన్నా మా తెలుగు సార్ ను అడిగి తెలుసుకో అని చెబుతుంది. వీరిద్దరూ మాట్లాడుకోవడం చూసిన కోపంతో మహాదేవయ్యను సత్యను లేపేద్దాం అని అడుగుతాడు. కుందేలు, నీ అయ్య పులి పోని ఆడుకొని అని అంటాడు. స్వాతంత్య్రం తెచ్చిన బాపు కాదు అని రుద్రకు చెబుతాడు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో చక్రవర్తి సత్యకు ఫోన్ చేస్తాడు. దెబ్బలు తగ్గాయా అని అడుగుతాడు. క్రిష్ గురించి నిజం తెలుసుకోవడానికి అతన్ని ఇంటికి రమ్మని అంటుంది. చక్రవర్తిని చూసి మహాదేవయ్య టెన్షన్ పడతాడు .. నిజం తెలిసిందా ఎం చెయ్యాలి అని ఆలోచిస్తాడు.. ఇక క్రిష్ చక్రవర్తి కొడుకు అని నిజం బయట పెడతారా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..