BigTV English

OTT Movie : కన్న తండ్రిని చంపే కొడుకు… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : కన్న తండ్రిని చంపే కొడుకు… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :  క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తాయో తెలిసిందే. థ్రిల్లర్ మూవీస్ అంటే చెవి కోసుకునే వీక్షకులు చాలామంది ఉన్నారు. థియేటర్లలో విజయం సాధించి ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక క్రైమ్ థ్రిల్లర్ ఈరోజు మన మూవీ సజెషన్. ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ ఏమిటో ఏమిటో తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్

ఇది ఒక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో ప్రతి సీన్ ట్విస్ట్ లతో నడుస్తుంది. ఇదివరకే ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసి వుంటారు. కానీ ఈ మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు మరేమిటో కాదు “ది సోల్” (The Soul). ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

హీరో, హీరోయిన్ ఇద్దరూ డిటెక్టివ్స్. హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉండటంతో హీరో ఆమెను ఆసుపత్రికి చెకప్ కోసం తీసుకువెళ్తాడు. అక్కడ ఆమె ఆరోగ్యం బాగుంది అని తెలుసుకుని హ్యాపీ గా ఉంటాడు. అయితే అనుకోకుండా హీరోకి క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. డాక్టర్ అతనితో నీ జబ్బుకి మందు ఇంకా రాలేదు, దానిమీద ప్రయోగాలు జరుగుతున్నాయి. తొందరగానే దీనికి మందు కనుక్కుంటారని హీరోతో చెప్తాడు. తన అనారోగ్యం గురించి ఆలోచనలో పడ్డ హీరో, ఒకవేళ మందు కనుక్కున్నా చికిత్స కోసం తన దగ్గర అంత డబ్బులు లేవని బాధపడతాడు. ఇంతలో భార్యాభర్తల దగ్గరికి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కి వస్తుంది. ఈ కేసు లో చాలా ట్విస్ట్ లు ఉంటాయి. ఈ కేసులో ఒక వ్యక్తిని రాడ్ తీసుకొని కొట్టి చంపేసి ఉంటారు. అక్కడికి వెళ్లి విచారించగా, అక్కడ ఉన్న పని మనిషి అతని కొడుకే చంపేసి పారిపోయాడని చెప్తుంది.

చనిపోయిన వ్యక్తికి రెండో భార్య కూడా ఉంటుంది. అతనికి మొదటి భార్య చనిపోవడంతో ఈమెను వివాహం చేసుకున్నాడు ఆ చనిపోయిన వ్యక్తి. ఆస్తిని మాత్రం తన కొడుకుకి కాకుండా రెండో భార్యకు మాత్రమే రాసి, దానికి గార్డియన్ గా వేరొక వ్యక్తిని నియమించి ఉంటాడు. అతనిని విచారించగా కొన్ని నమ్మలేని విషయాలు బయటికి వస్తాయి. అసలు ఆ వ్యక్తిని చంపింది ఎవరు? ఈ కేసులో హీరో వెలుగులోకి తెచ్చిన విషయాలు ఏమిటి? చివరికి క్యాన్సర్ నుంచి హీరో బయటపడతాడా?, అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Net flix) లో స్ట్రీమింగ్ అవుతున్న”ది సోల్” (The Soul) క్రైమ్ థ్రిల్లర్ మూవీ ని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీని చూసే ప్రేక్షకులకు ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మొదటి నుంచి అనుకోని ట్విస్ట్ లతో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్  మూవీపై ఓ లుక్ వేయండి.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×