BigTV English

OTT Movie : నచ్చిన అమ్మాయి కోసం కాలాన్నే జయించే హీరో…. క్రేజీ కొరియన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా

OTT Movie : నచ్చిన అమ్మాయి కోసం కాలాన్నే జయించే హీరో…. క్రేజీ కొరియన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా

OTT Movie : ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో ప్రస్తుతం కొరియన్ మూవీస్ చూసే ప్రేక్షకులు రోజురోజుకీ పెరుగుతున్నారు. ఈ మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మనం ఇప్పుడు ఒక టైం ట్రావెల్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇదివరకే  ఈ జానర్లో తెలుగులో వచ్చిన ఆదిత్య 369 వంటి మూవీస్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి ఒక టైం ట్రావెల్ కొరియన్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇది ఒక కొరియన్ సినిమా. హీరో టైమ్ ట్రావెల్ చేసి తన ప్రేయసిని కలుసుకోవడానికి చేసే ప్రయత్నం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్. ఈ మూవీ పేరు “విల్ యు బి దేర్“( will you be there) ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది. కొత్తగా ఏదైనా సైన్స్ ఫిక్షన్ మూవీ చూడాలనుకునేవారు తప్పకుండా చూడండి.


స్టోరీలోకి వెళ్తే

కాంబోడియాలో వరదలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ అనారోగ్యం బారిన పడతారు. వారిని కాపాడటానికి ఒక డాక్టర్ బృందం అక్కడికి వెళుతుంది. అందులో హీరో ఒక డాక్టర్. అతను అక్కడ ఉన్నవారికి వైద్యం చేసి తిరిగి హెలికాప్టర్ లో వెళ్లడానికి సిద్ధమవుతుండగా, ఒక ముసలివాడు అతని దగ్గరికి ఒక బాలుడిని తీసుకొని వస్తాడు. ఈ పిల్లవాడికి వైద్యం చేయమని అడుగుతాడు. అంతలో హీరో హెలికాప్టర్ ప్రయాణం మానుకొని ఆ బాలుడి కి చికిత్స చేస్తాడు. ఆ ముసలివాడు అందుకు అతనికి టైం ట్రావెల్ మాత్రలు ఇచ్చి వీటిని వాడి నీకు ఏం కావాలో నువ్వు సాధించుకోవచ్చు అని చెప్తాడు. దీనికి హీరో నాకు ఏ కోరికలు లేవు ఉన్నది ఒకే ఒకటి చనిపోయిన నా ప్రేయసిని ఒకసారి చూడాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి స్టొరీ వెళ్తుంది. హీరోయిన్ డాల్ఫిన్ ట్రైనర్. ఒకసారి ఒక షో చేస్తూ ఉండగా హీరో అక్కడికి వచ్చి ఆ షో అయిపోయిన తరువాత వీళ్ళు బయటకి వెళ్లి మాట్లాడుకుంటూ ఉండగా, హీరోయిన్ హీరోతో నాకు నీ ద్వారా పిల్లలు కావాలని అడుగుతుంది. దానికి హీరో సరేనని చెప్పి ఒక పని మీద బయటకి వెళతాడు. దారి మధ్యలో ఒకచోట ఆగి హీరోయిన్ కి ఫోన్ చేస్తూ వుండగా మరో వైపు టైమ్ ట్రావెల్ చేసిన హీరో ఫ్లాష్ బ్యాక్ లోకి వస్తాడు. అక్కడ యుక్త వయసులో ఉన్న హీరోని ఓల్డ్ ఏజ్ లో ఉన్న హీరో చూసి ఆశ్చర్యపోతాడు. చివరికి ప్రేయసి కోసం టైం ట్రావెల్ చేసిన హీరో తన కలని నెరవేర్చుకుంటాడా? హీరోయిన్ ఎందుకు చనిపోతుంది? హీరో టైం ట్రావెల్ నుంచి బయటపడతాడా అనే విషయాలు తెలియాలంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న “విల్ యు బి దేర్” అనే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×