OTT Movies : ప్రతి నెల ఏవోక సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం థియేటర్లలోకి తక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీపావళి ఉంది. అందుకు తగ్గట్లే ‘లక్కీ భాస్కర్’, ‘క’ లాంటి తెలుగు సినిమాలతో పాటు అమరన్, బఘీరా లాంటి డబ్బింగ్ బొమ్మలు. అలాగే వీటితోపాటు భూల్ భులయ్యా 3, సింగం ఎగైన్ లాంటి హిందీ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇక డిసెంబర్ లో చెప్పనక్కర్లేదు. పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత తండేల్ తో పాటుగా మరో నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక దీపావళికి ఓటీటీలోకి అంత బజ్ ఉన్న సినిమాలు రావడం లేదు. కానీ ఒకటి రెండు బ్లాక్ బాస్టర్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి..
ప్రతి వారం థియేటర్లలో కన్నా ఓటీటీ లో సందడి చేసే సినిమాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 15 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో లబ్బర్ పందు, కిష్కిందా కాండం, తంగలాన్ లాంటి డబ్బింగ్ మూవీస్ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు ‘ద సబ్‌స్టాన్స్’ అనే ఇంగ్లీష్ సినిమా కూడా కచ్చితంగా చూడాల్సిన సినిమా.. ఇక ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
హాట్‌స్టార్..
విజర్డ్స్ బియాండ్ వేవర్లీ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 30
లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 31
కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 01
నెట్‌ఫ్లిక్స్..
ద మ్యాన్‌హట్టన్ ఏలియన్ అబ్డక్షన్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 30
టైమ్ కట్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 30
మర్డర్ మైండ్ ఫుల్లీ (జర్మన్ సిరీస్) – అక్టోబర్ 31
తంగలాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబర్ 31
బార్బీ మిస్టరీస్: ద గ్రేట్ హార్స్ ఛేజ్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 01
అమెజాన్ ప్రైమ్..
జోకర్: ఫోలి ఏ డాక్స్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 29
ఆహా..
అంజామై (తమిళ సినిమా) – అక్టోబర్ 29
అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – అక్టోబర్ 31
జీ5..
మిథ్య: ద డార్క్ చాప్టర్ (హిందీ సిరీస్) – నవంబరు 01
జియో సినిమా..
సమ్‌బడి సమ్‌వేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 28
ముబి..
ద సబ్‌స్టాన్స్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 31
బీసీ నీట్..
సివిల్ ఇంజినీర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 30 న స్ట్రీమింగ్ కాబోతుంది..
సినీ లవర్స్ ఇక పండగే.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా కొత్త సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఇక డిసెంబర్ లో మాత్రం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. అస్సలు మిస్ అవ్వకండి..