E-Paper
Advertisement

పదేళ్ల భర్త చిత్రహింసలకు ఎండ్ కార్డ్… ఫస్ట్ లవ్‌తో సెకండ్ ఇన్నింగ్స్… హృదయాన్ని కదిలించే సినిమా

పదేళ్ల భర్త చిత్రహింసలకు ఎండ్ కార్డ్… ఫస్ట్ లవ్‌తో సెకండ్ ఇన్నింగ్స్… హృదయాన్ని కదిలించే సినిమా
Advertisement

Hindi Romantic Drama on OTT: పెళ్లి తర్వాత జీవితం అందంగా ఉంటుందని ఎన్నో కలలు కంటారు. అయితే అదే పెళ్లి కొందరి జీవితాల్లో నరకాన్ని కూడా చూపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా జీవితానికి దగ్గరగా ఉంటుంది. భర్త వేధింపులు భరించలేక, ఎవరికీ తన బాధ చెప్పుకోలేక ఓ మహిళ జీవితం మీదే ఆశలు వదులుకుంటుంది. అలాంటి సమయంలో పదేళ్ల క్రితం మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి మళ్లీ ఎదురైతే ఆమె జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందనే హృదయాన్ని కదిలించే కథతో రూపొందిన హిందీ రొమాంటిక్ డ్రామా ‘కరేజ్’ (Courage) ఈ రోజు (నవంబర్ 18) నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. షరీబ్ హష్మీ, సంస్కృతి బాల్గుడే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు ? దీని కథ ఏంటి ? అనే వివరాను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ముంబైలో నివసించే రాణి జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోతుంది. భర్త పెట్టే వేధింపులు భరిస్తూ, తన బాధను ఎవరికీ చెప్పుకోలేక నరకం అనుభవిస్తుంటుంది. ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండే ఆమె జీవితం ఇలా ఎందుకు మారిపోయిందో అర్థం కాని పరిస్థితి. అలాంటి సమయంలో పదేళ్ల క్రితం కాలేజీ రోజుల్లో ప్రాణంగా ప్రేమించిన జయదీప్ అనుకోకుండా మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. పాత జ్ఞాపకాలు ఇద్దరినీ దగ్గర చేస్తాయి. కొంతకాలానికి వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుంది. జయదీప్ తోడుగా నిలవడంతో రాణి కూడా తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. అయితే వీరిద్దరి సంతోషం ఎంతోకాలం నిలవదు. జయదీప్ తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, అతడి ప్రాణాలు కాపాడాలంటే కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు చెబుతారు.

Advertisement

దీంతో రాణి ఒక్కసారిగా కుంగిపోతుంది. తనకు కొత్త జీవితంపై ఆశలు కల్పించిన వ్యక్తినే కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయం ఆమెను వెంటాడుతుంది. ఎలాగైనా జయదీప్‌ను బతికించుకోవాలని కిడ్నీ దాత కోసం వెతకడం మొదలుపెడుతుంది. కానీ ఈ ప్రయాణంలో ఆమెకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటన్నింటినీ దాటుకుని తన ప్రేమను కాపాడుకోవడానికి రాణి ఏం చేసింది? జయదీప్‌కు కిడ్నీ దొరికిందా? చివరకు వీరిద్దరి ప్రేమకథ ఎలాంటి ముగింపుకు చేరింది? అనేదే మిగతా కథ.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ సినిమాలో జయదీప్ పాత్రలో షరీబ్ హష్మీ, రాణిగా సంస్కృతి బాల్గుడే నటించారు. నికితా ఘాగ్, భరత్ దభోల్కర్, అతుల్ కాలే, సంజయ్ గుర్బక్సాని, అపర్ణ శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. అంకుర్ అరుణ్ కకట్కర్ దర్శకత్వం వహించగా, బల్బ్ చమ్కా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు గంటా 50 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా తొలుత పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. 2026నవంబర్ 18 నుంచి Amazon Prime Videoలో డిజిటల్ ప్రీమియర్ అయింది. ప్రస్తుతం హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.

Advertisement

Read Also: పల్లెటూరి మట్టి వాసనతో స్వచ్ఛమైన ప్రేమకథ… ఓటీటీలోకి రూ.150 కోట్ల కన్నడ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు

Related News

ఆఫీసులో భార్యాభర్తల సీక్రెట్ ఆట… దొరికితే ఉద్యోగాలు ఫసక్… హాట్‌స్టార్‌లో నవ్వుల జాతర

అత్యంత సంపన్నుల చీకటి కోణం.. హైస్కూల్ నుంచే మొదలైన నేర చరిత్ర.. ఈ సిరీస్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

కత్తి దూస్తే శవాల దిబ్బలే.. గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో

సూపర్ పవర్స్ ఉన్న పిల్లలపై సీక్రెట్ ఎక్స్‌పెరిమెంట్స్… భూగర్భ జైలు బద్దలుకొట్టి తిరుగుబాటు… గూస్‌బంప్స్ తెప్పించే సిరీస్

కెరీర్ క్లోజ్ అయిందని అందరూ నవ్వారు… 17 ఏళ్ల కుర్రాడితో ప్రపంచానికే సవాల్ విసిరిన మాజీ ఛాంపియన్…

పల్లెటూరి మట్టి వాసనతో స్వచ్ఛమైన ప్రేమకథ… ఓటీటీలోకి రూ.150 కోట్ల కన్నడ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు

క్రైమ్ నవల రాయమని పిలిస్తే… ఎడిటర్‌నే కిల్లర్‌గా మార్చే రచయిత్రి… ఈ థ్రిల్లర్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు భయ్యా

Big Stories

Advertisement
×