E-Paper
Advertisement

తెలంగాణకు అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!

తెలంగాణకు అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!
Advertisement

Aqwan Cyclone: ఆక్వాన్ తుఫాను పూర్తిగా ఖమ్మం జిల్లా పై కేంద్రీకృతమైందని సమాచారం ఉన్నప్పటికీ, ప్రస్తుత సమాచారం ప్రకారం బుధవారం మ. 2.00 గంటలకు అట్టి తుఫాన్ ఒరిస్సా, ఛత్తీస్ గడ్ వైపు దారిమళ్లిందని తాజాగా తెలుస్తోందనిజిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్ అన్నారు. బుధవారం జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 20, 21 తేదీల్లో..

కలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ, ఆక్వాన్ తుఫాన్ ఒరిస్సా , ఛత్తీస్ గడ్ లవైపు దారి మళ్లినందున జిల్లాపై తుఫాన్ ప్రభావం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఈ నెల 20, 21 తేదీల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు ఉన్నాయ న్నారు. పరిస్థితిని బట్టి అవసరమైన చోట సహాయక చర్యల కోసం ఈ నెల 21, 22 తేదీల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అన్నారు. జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.పరిస్థితి తీవ్రతను బట్టి, స్థానిక పరిస్థితుల ఆధారంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే పూర్తి అధికారం జిల్లా విద్యా శాఖ అధికారి, సంక్షేమ విద్యా సంస్థల అధికారులకు ఇస్తున్నట్లు కలెక్టర్ అన్నారు.

Advertisement

Also read: రామోజీ జయంతి జీవో వివాదం.. సీఎం చంద్రబాబుకు అంబటి చురకలు!

సెలవులు రద్దు..

అధికారులు, సిబ్బంది ఎవరూ కూడా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే మంజూరైన ఏవైనా సెలవులు ఉంటే వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని అన్నారు. వరద నియంత్రణ ప్రొటోకాల్స్ అందరూ విధిగా పాటించాలని స్పష్టం చేశారు. రోడ్లపై ఎక్కడైనా నీరు పొర్లుతున్నా, లోతైన వంతెనలు లేదా కల్వర్టులు నీట మునిగినా వెంటనే ఆయా మార్గాలను బ్లాక్ చేసి ట్రాఫిక్ నిలిపివేయాలని కలెక్టర్ అన్నారు. స్థానిక తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

అధికారులు నిఘా..

Advertisement

గాలి వానలకు చెట్లు లేదా కొమ్మలు విద్యుత్ తీగలపై పడిపోతే వాటిని వెంటనే తొలగించడానికి ఉడ్ కట్టర్స్, ట్రీ కట్టర్స్ వంటి పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లైన్ల పునరుద్ధరణకు పూర్తి సన్నద్ధతతో సిద్ధంగా ఉండాలన్నారు. మత్స్యకారులు ఎవరు కూడా చెరువులు, కుంటలు, వాగుల వైపు చేపల వేటకుగాని, ఈత కొట్టడానికి గానీ వెళ్లకూడదని మత్య్సశాఖ ద్వారా గట్టిగా హెచ్చరించాలని, సోషల్ మీడియాలో ఇన్స్ట్రాగ్రామ్ , రీల్స్ మొదలైన వాటిలో రీల్స్ చేయడం కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లరాదని, దీనిపై అధికారులు నిఘా పెట్టాలని ఆదేశించారు.

Also read: రోజూ తినే ఎగ్ కర్రీ బోర్ కొట్టిందా?అయితే ఈ మెంతి కోడిగుడ్డు కూర ట్రై చేయండి!

Tags

Related News

‘షీ టీమ్స్’ పేరుతో నకిలీ నోటీసు.. మాజీ ప్రియుడిపై యువతి రివేంజ్.. పోలీసులు సైతం షాక్!

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీతో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

సాగర్ జలాల దోపిడీపై మౌనమెందుకు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? కాంగ్రెస్‌పై కవిత ఫైర్!

పనిచేయడం చేతకాక బీజేపీపై విమర్శలా? కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రాంచందర్ రావు ఫైర్

స్నానం చేసి రాలేదని.. పిల్లలను బడి నుంచి గెంటేసిన హెచ్ఎం!

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం బిగ్ అప్డేట్.. కీలక ఉత్తర్వులు జారీ!

నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి.. రూ. 21 లక్షలు కాజేసిన అప్రైజర్!

Big Stories

Advertisement
×