BigTV English

Pradeep Machiraju : ఆ స్టార్ హీరో, ప్రదీప్ స్కూల్ మేట్స్.. నిజంగానే నమ్మలేరు..

Pradeep Machiraju : ఆ స్టార్ హీరో, ప్రదీప్ స్కూల్ మేట్స్.. నిజంగానే నమ్మలేరు..

Pradeep Machiraju : తెలుగు బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు వరుసగా టీవీ షో లలో బిజీగా ఉన్న ఈయన ఇప్పుడు సినిమాల్లో హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో నటిస్తున్న ప్రదీప్ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ సందర్భంలో ఆయనకు స్టార్ హీరోకు మధ్య ఉన్న సంబందాన్ని బయట పెట్టాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..


ప్రదీప్ స్కూల్ మేట్స్ స్టార్ హీరో..

తెలుగు టీవీ ఇండస్ట్రీలో మేల్ యాంకర్స్ పేర్లు వెతికితే టక్కున వినిపించే పేర్లు రవి, ప్రదీప్. అయితే ఇందులో ప్రదీప్ పేరు కాస్త ఎక్కువగానే వినిపిస్తుంది. ఒకవైపు బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూనే మరోవైపు వెండి ధరపై సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రదీప్ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా అందరిని ఇంటర్వ్యూ చేసే ప్రదీప్ ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న వారిలో ఇండస్ట్రీ కి వచ్చాక ఫ్రెండ్స్ అయిన వారు కొందరైతే ఇండస్ట్రీ బయటే కొంతమంది ఫ్రెండ్స్ గా ఉంటారు. ఈ యాంకర్ కం హీరోకు నాచురల్ స్టార్ నాని స్కూల్ మెట్ అని బయట పెట్టారు. అవును అక్షరాల మీరు విన్నది నిజం.


నాని అలాగే యాంకర్ ప్రదీప్ ఇద్దరూ ఒకే స్కూల్ లో చదివారట. సెక్షన్స్ వేరు కానీ మేమిద్దరం ఒకే క్లాస్ అంటూ చెప్పాడు ప్రదీప్. అయితే పెద్దగా పరిచయం లేదు ఇద్దరం టెన్త్ క్లాస్ వరకు ఒకే స్కూల్ చదివినట్లు చెప్పాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకుని షాక్ అయ్యానని ప్రదీప్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. నాని అష్టాచమ్మా బొమ్మ పడినప్పుడు అందరికన్నా ఎక్కువగా మేమే సంతోషించామని ప్రదీప్ అన్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read :నటి సంగీత కూతురును చూశారా? అమ్మ నోట్లోంచి ఊడిపడింది..

ప్రదీప్ సినిమాల విషయానికొస్తే.. 

ప్రదీప్ మాచిరాజు గతంలో నటుడుగా అనేక సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అ మూవీ అంతగా ఆకట్టుకోకపోయినా కూడా ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ప్రదీప్ నటించిన సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ప్రదీప్. ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కానుంది.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి ఇక రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ను సొంతం చేసుకుంటున్నా చూడాలి.. ఈ సినిమాపై ప్రదీప్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సక్సెస్ అయితే మాత్రం హీరోగా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×