BigTV English
Advertisement

OTT Movie : కలలు కన్న కొత్తింట్లో కలత పెట్టే సంఘటనలు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : కలలు కన్న కొత్తింట్లో కలత పెట్టే సంఘటనలు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : దెయ్యాల సినిమాలు ఎక్కువగా పాడుబడ్డ ఇళ్లల్లో తెరకెక్కిస్తుంటారు. ఈ సినిమాలు ఉహించని షాక్ లతో ఆడియన్స్ ని భయపెడుతుంటాయి. సౌండ్స్, విజువల్స్ ఆడియన్స్ లో వణుకు తెప్పిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక కొత్త ఇంట్లోకి వచ్చిన ఫ్యామిలీ కష్టాల్లో పడుతుంది. ఆ ఇంట్లో ఆత్మ వీళ్ళని కష్టాల్లో పడేస్తుంది. భయపెట్టే సీన్స్ కూడా ఇందులో బాగానే ఉన్నాయి. ఒక డిఫరెంట్ హారర్ సినిమాని చూడాలనుకుంటే ఈ సినిమా బెస్ట్ సజెషన్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ప్రెజెన్స్’ (Presence) అనేది స్టీవెన్ సోడర్‌బర్గ్ దర్శకత్వం వహించిన అమెరికన్ సూపర్‌ నేచురల్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో లూసీ లియు, క్రిస్ సుల్లివన్, కాలినా లియాంగ్, ఎడ్డీ మాడే, వెస్ట్ ముల్హోలాండ్, జూలియా ఫాక్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2024 జనవరి 19న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఈ సినిమా 2025 జనవరి 24న థియేటర్‌లలో విడుదలైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

సినిమా మొత్తం ఒక పాత పెద్ద ఇంట్లోనే జరుగుతుంది. ఆ ఇంట్లో ఒక ఆత్మ ఎప్పటినుంచో ఉంటుంది. అయితే ఇది భయంకరంగా కాకుండా, దుఃఖంలో ఉన్నట్లు ఉంటుంది. ఆ ఇల్లు గతంలో ఏదో బాధను భరించినట్టు అనిపిస్తుంది. ఒక రోజు రెబెకా, క్రిస్ అనే ఒక జంట అందులోకి దిగుతుంది. వీళ్ళకి టైలర్ అనే 17 ఏళ్ల కొడుకు, స్విమ్మింగ్ టీమ్‌లో చేరేందుకు ప్రయత్నిస్తుంటాడు. చిన్న కూతురు క్లోయ్ 14 ఏళ్లు ఉంటాయి. ఆమె డ్రాయింగ్స్ వేస్తుంటుంది. అయితే ఒక ఆత్మ, వాళ్లను రూమ్ నుండి రూమ్‌కు ఫాలో అవుతూ చూస్తూ ఉంటుంది.


అప్పుడప్పుడే ఫ్యామిలీ ఇంట్లో సెటిల్ అవుతుంటుంది. ఇంతలో రెబెకా ఆఫీస్ లో డబ్బు దొంగతనం గురించి భయపడుతుంటుంది. క్రిస్ ఇంటి పనులు చూసుకుంటూ, భార్య మీద ఆధారపడతాడు. టైలర్ కొత్త ఫ్రెండ్ రయాన్‌తో స్నేహం చేస్తూ, స్విమ్మింగ్ లో ప్రాక్టీస్ చేస్తాడు. క్లోయ్ తన రూమ్‌లో డ్రాయింగ్స్ చేస్తుంది. ఆత్మ ఉన్నట్టుడి ఆ డ్రాయింగ్‌లో కనిపిస్తుంది. రాత్రి రెబెకా లైట్స్ ఆఫ్ చేస్తుంటే ఏదో షేడ్ కదులుతుంది. టైలర్ స్విమ్మింగ్ పూల్‌లో డ్రౌనింగ్ లాగా ఫీల్ అవుతాడు. క్లోయ్ రూమ్‌లో ఒంటరిగా భయపడుతుంది.

Read Also : పాడుబడ్డ హవేలీలో దడ పుట్టించే సీన్లు… దెయ్యాలను పట్టుకోవడానికి వెళ్ళి దిక్కుమాలిన చావు

ఇప్పుడు ఫ్యామిలీలో గందరగోళం మొదలవుతుంది. రెబెకా దొంగతనం చేసినట్లు క్రిస్ కి చెప్తుంది. భార్యతో క్రిస్ ఆర్గ్యూమెంట్ చేస్తాడు. టైలర్ స్విమ్మింగ్ పోటీలో ఫెయిల్ అవుతాడు, తల్లి డిసప్పాయింట్ అవుతుంది. ఇక ఫ్యామిలీ కష్టాలు పీక్స్ కి వెళ్తాయి. రెబెకా దొంగతనం బయటపడుతుంది. కంపెనీ పోలీస్‌ లకు కంప్లైంట్ ఇస్తుంది. దీంతో క్రిస్ భార్యను వదిలేయాలనుకుంటాడు. టైలర్ స్విమ్మింగ్ టీమ్ నుండి డ్రాప్ అవుతాడు. ఆఇంట్లో ఎదో ఉందని వాళ్లకి అర్థం అవుతుంది. ఆ ఇంటికి ఎవరు వచ్చినా కష్టాల్లో మునుగుతుంటారని తెలుస్తుంది. చివరికి దీని నుంచి రెబెకా ఫ్యామిలీ బయట పడుతుందా ? ఆ ఆత్మ గతం ఏమిటి ? అనే విషయాలను, ఈ సూపర్‌ నేచురల్ థ్రిల్లర్ సీనియాను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : కాంట్రవర్సీ నుంచి క్రైమ్ దాకా… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తమిళ సినిమాలు ఇవే

OTT Movie : కొడుకులను మార్చుకుని ఇదేం పాడు పని… ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా ?

OTT Movie : ప్లే గ్రౌండ్ లో చెయ్యి లేకుండా అమ్మాయి శవం… చెస్ట్ నట్ బొమ్మతో క్లూ వదిలే సైకో కిల్లర్ కిరాతకం..

OTT Movie : దెయ్యాన్ని వదిలించడానికెళ్లి దానితోనే దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : మ్యూజిక్ తో దెయ్యాన్ని నిద్రలేపే మెంటల్ పిల్ల… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : మొదటి రాత్రి కాగానే చనిపోయే అమ్మాయిలు… పోలీస్ ఆఫీసర్ భార్యను కూడా వదలకుండా కిల్లర్ అరాచకం

OTT Movie : గోడ లోపల వింత శబ్దాలు… కట్ చేస్తే ఒళ్ళు జలదరించే ట్విస్ట్… ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా భయ్యా

Big Stories

×