E-Paper
Advertisement

Ind vs NZ 3rd ODI: నేడే చివ‌రి వ‌న్డే..జ‌డేజా రిటైర్మెంట్‌..కోహ్లీ, రోహిత్ పైనే క‌న్ను

Ind vs NZ 3rd ODI: నేడే చివ‌రి వ‌న్డే..జ‌డేజా రిటైర్మెంట్‌..కోహ్లీ, రోహిత్ పైనే క‌న్ను
Advertisement

Ind vs NZ 3rd ODI:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ చిట్టచివరి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు వన్డే మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ మూడవ వన్డే జరగనుంది. ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడవ వన్డే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇండోర్ చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి.

Also Read: Babar Azam-Steve Smith: బాబర్ ఆజాంకు స్ట్రైక్ ఇవ్వకుండా పరువు తీసిన స్మిత్..బ్యాట్ నెల‌కొట్టి రెచ్చిపోయిన పాక్ బ్యాట‌ర్‌

ఇండోర్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మూడవ వన్డే

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ తాడోపేడో అన్న రేంజ్ లో మ్యాచ్ జరగనుంది. ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు టైటిల్ గెల్చుకునుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ చేయనుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొదట బౌలింగ్ చేస్తే మంచిదని అంటున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో టాస్ చాలా కీలకం కానుంది. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే మూడవ వన్డే జియో హాట్ స్టార్ వేదికగా లేదా స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చు.

జడేజా రిటైర్మెంట్ ? రోహిత్ శర్మ, కోహ్లీ పైన ఆశలు

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ జరిగే మూడవ వన్డే పూర్తయిన తర్వాత రవీంద్ర జడేజా సంచలన ప్రకటన చేయబోతున్నాడట. తన ఆటకు రిటైర్మెంట్ ఇచ్చేందుకు రవీంద్ర జడేజా సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే t20 లకు దూరమైన రవీంద్ర జడేజా.. వన్డేలలో సరిగ్గా ఆడడం లేదు. గతంలో దూకుడుగా ఆడే రవీంద్ర జడేజా వన్డేలలో తేలిపోతున్నాడు. అందుకే రిటైర్మెంట్ ఇచ్చి.. కేవలం టెస్టుల్లో కొనసాగాలని అనుకుంటున్నాడట.

Advertisement

ఇక ఇవాల్టి మూడవ వన్డేలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు రాణిస్తేనే టీమిండియా గెలవనుంది. మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ ఒక్కడే క్లిక్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు విఫలమయ్యారు. ఇవాళ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఆడితేనే టీమ్ ఇండియా గెలవను ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

ఇరు జ‌ట్ల అంచ‌నా

ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్) రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్ ప్రాబబుల్ ఎలెవన్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, జేడెన్ లెన్నాక్స్.

Also Read: Rohit-Gambhir: రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయేలా చేసింది గంభీరే..వాడు పెద్ద‌ దుర్మార్గుడు..మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×