E-Paper
Advertisement

రూమ్ చిన్నదే.. కానీ లోపల జరిగే రచ్చ మామూలుగా ఉండదు

రూమ్ చిన్నదే.. కానీ లోపల జరిగే రచ్చ మామూలుగా ఉండదు
Advertisement

Psychological thriller OTT : మీ బుర్ర గిర్రున తిరిగే ఒక పక్కా సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటే, ఎంచక్కా ఇప్పుడే ఓటీటీలో చూసేయచ్చు. ఇందులో పెద్ద పెద్ద ఫైట్లు, పాటలు ఉండవు కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే మైండ్ గేమ్స్, మాటల యుద్ధం ఎక్కువగా ఉంటాయి. సినిమా అంతా ఒక చిన్న గదిలోనే జరుగుతూ, చూసేవాళ్లలో అసలు ఏం జరుగుతోంది? తప్పు ఎవరిది? అనే టెన్షన్ పుట్టిస్తుంది. మొదట్లో కిడ్నాపర్ విలన్ లాగా, కిడ్నాప్ అయిన అమ్మాయి అమాయకురాలి లాగా కనిపిస్తారు. కానీ కథ సాగే కొద్దీ వారిద్దరి అసలు రంగులు బయటపడి, ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో అర్థం కాని పరిస్థితి వస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు చూపు కూడా తిప్పుకోలేరు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్  

2018లో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు 10×10. నోయెల్ క్లార్క్ ఈ సినిమాకు కథను అందించడమే కాకుండా, ఇందులో ఒక ముఖ్య పాత్రలో నటించిన స్వయంగా నిర్మించారు. దర్శకురాలు సుజీ ఈవింగ్‌కు ఇది మొదటి సినిమా అయినప్పటికీ, తక్కువ బడ్జెట్‌తో కేవలం రెండు పాత్రలతోనే ఉత్కంఠభరితంగా సినిమాను నడిపించారు. ఈ సినిమాను కేవలం 20 రోజుల్లోనే షూట్ చేశారు. సినిమా అంతా ఒక చిన్న 10×10 గదిలోనే సాగుతుంది కాబట్టి, ఆ ఇరుకైన చోట కెమెరాలతో చిత్రీకరించడం చిత్ర యూనిట్‌కు పెద్ద సవాలుగా మారింది. నటీనటులు ల్యూక్ ఈవాన్స్, కెల్లీ రైల్లీ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి షూటింగ్ సమయంలో చాలా సమయం ఆ గదిలోనే గడిపేవారట. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రాబర్ట్ అనే ఒక వ్యక్తి కాథీ అనే అమ్మాయిని చాలా రోజులుగా వెంబడిస్తుంటాడు. ఒకరోజు పట్టపగలే అందరూ చూస్తుండగానే ఆమెను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేస్తాడు. తన ఇంట్లో ఎవరికీ తెలీకుండా ఒక పెద్ద సౌండ్ ప్రూఫ్ గదిని (10×10 సైజులో) కట్టించి, అందులో ఆమెను పడేసి బంధిస్తాడు. ఆమె ఎంత అరిచినా బయటకి అస్సలు వినిపించదు. రాబర్ట్ కి ఆమె మీద ఏదో కోపం ఉందని అర్థమవుతుంది కానీ, అది ఏంటో మొదట్లో తెలీదు. నీ పేరు ఏంటి? నీ గతం ఏంటి? నువ్వు చేసిన తప్పేంటో చెప్పు అని ఆమెను చిత్రహింసలు పెడుతూ అడుగుతుంటాడు రాబర్ట్.

ఆమె మాత్రం నేనేం తప్పు చేయలేదు, నన్ను వదిలేయ్ అని ఏడుస్తూ బ్రతిమాలుతుంది. కానీ రాబర్ట్ ఆమె మాటలు అస్సలు నమ్మడు, ఆమె ఒక పెద్ద నిజాన్ని దాస్తుందని వాదిస్తాడు. కథ ముదురుతున్న కొద్దీ అసలు విషయం బయటపడుతుంది. రాబర్ట్ భార్య ఒక ఆసుపత్రిలో చనిపోతుంది. దానికి కారణం అక్కడ నర్సుగా పని చేసిన ఈ కాథీనే అని రాబర్ట్ నమ్మకం. ఆమె తన పేరు మార్చుకుని తిరుగుతోందని కనిపెట్టి మరి పట్టుకొస్తాడు. చివరికి ఆ గదిలో ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. అక్కడ ఎవరు గెలిచారు? ఆ నిజాన్ని ఆమె ఒప్పుకుందా ? ఈ సినిమా ముగింపు ఏమిటి ? అనే విషయాలతో ఈ సినిమా ఉత్కంఠంగా సాగుతుంది.

Advertisement

Read Also :  అక్క మొగుడు చెల్లితో సంసారం… హత్యతో ఉలిక్కిపడే ఫ్యామిలీ… ఓటీటీలో దూసుకెళ్తున్న థ్రిల్లర్ సిరీస్

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×