E-Paper
Advertisement

ఒక్క జూదంతో మొత్తం సామ్రాజ్యం బూడిద… చేతికి వేరే ప్రాణం… ఓటీటీలో దుల్కర్ సల్మాన్ గేమ్ స్టార్ట్

ఒక్క జూదంతో మొత్తం సామ్రాజ్యం బూడిద… చేతికి వేరే ప్రాణం… ఓటీటీలో దుల్కర్ సల్మాన్ గేమ్ స్టార్ట్
Advertisement

I m Game OTT Release: ఒక్క తప్పు నిర్ణయం మనిషి జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో చూపించే కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అందులోనూ జూదం, క్రికెట్ బెట్టింగ్, ఊహించని ప్రమాదం, అతీంద్రియ శక్తులు తోడైతే ఆ ఎంటర్‌టైన్‌మెంట్ మరో స్థాయికి వెళ్తుంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ (I’m Game) కూడా అలాంటి విభిన్నమైన కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆర్డీఎక్స్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. రెండు నెలల తరువాత ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా పలకరిస్తోంది. మరి దీనిని ఎక్కడ చూడచ్చు ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

డాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) ఒక సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు. డబ్బు సంపాదించడం, విలాసవంతమైన జీవితం గడపడమే అతని ప్రపంచం. అయితే అతనికి ఉన్న జూదం అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతుంది. తన అదృష్టం, లెక్కలు, అల్గారిథమ్‌లపై నమ్మకంతో బెట్టింగ్‌లు వేస్తుంటాడు. మొదట్లో కొన్ని విజయాలు అందుకున్నా, ఆ తర్వాత అదే అలవాటు అతని జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. వారసత్వంగా వచ్చిన డబ్బును జూదంలో పోగొట్టుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతాడు.

Advertisement

చివరికి క్రికెట్ బెట్టింగ్‌లో భారీ మొత్తాన్ని పందెంగా పెట్టిన డాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగులుతుంది. అప్పులు తీర్చేందుకు, తన పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు అతను చేసే ప్రయత్నాలు మరింత గందరగోళానికి దారితీస్తాయి. బెట్టింగ్ వ్యవహారంలో చిక్కుకున్న అతను అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఆ ప్రమాదంలో అతని కుడి చేయి తీవ్రంగా దెబ్బతిని, చివరకు దానిని తొలగించాల్సి వస్తుంది.

అయితే డబ్బు, పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతో డాన్‌కు మరో వ్యక్తి చేయిని మార్పిడి చేస్తారు. అక్కడి నుంచే అతని జీవితంలో అసలు వింతలు మొదలవుతాయి. కొత్తగా వచ్చిన చేయి అతని మాట వినదు. తనకంటూ ఒక ఆలోచన ఉన్నట్లు ప్రవర్తిస్తూ డాన్‌ను ఇబ్బందులకు గురిచేస్తుంది. మొదట్లో ఈ పరిణామాలను అర్థం చేసుకోలేకపోయిన అతనికి, ఆ చేయి వెనుక ఏదో రహస్యం ఉందని క్రమంగా తెలుస్తుంది.

Advertisement

ఆ చేయి ఎవరిది? దాని అసలు యజమానికి ఏం జరిగింది? డాన్ శరీరంలోకి వచ్చిన తర్వాత అది ఎందుకు తనదైన దారిలో ప్రవర్తిస్తోంది? ఆ చేయి ద్వారా బయటపడుతున్న ప్రతీకార కథ ఏమిటి? అనేవి సినిమాలో ఆసక్తికరమైన మలుపులు. ఒకవైపు తన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవాలని డాన్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఆ చేయి అతన్ని వేరే దిశలో నడిపిస్తుంది. ఈ ఇద్దరి మధ్య జరిగే విచిత్రమైన పోరాటం, దాని వెనుక దాగున్న రహస్యం కథను ముందుకు నడిపిస్తాయి. దుల్కర్ సల్మాన్ యాక్షన్‌ను, కొత్త తరహా ఫాంటసీ కథలను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడొచ్చు.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ డాన్ జాన్ పాత్రలో నటించగా, కయాదు లోహర్, ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కథిర్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్, పార్త్ తివారీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ తమ వే ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. 2026 సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 6 నుంచి JioHotstarలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: ఫ్రెండ్ పెళ్లి చెడగొట్టేందుకు మాస్టర్ ప్లాన్… అదే టైమ్‌లో పోలీసుల రచ్చ… నవ్విస్తూనే ట్విస్ట్ ఇచ్చే కామెడీ క్రైమ్

Tags

Related News

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్… కాలేజీ అందగాడితో ఒకే ఇంట్లో… యూత్ మస్ట్ వాచ్

ముగిసిన ‘ది ట్రైటర్స్’ తెలుగు సీజన్ 1.. విజేతలు ఎవరంటే?

గోవా డ్రీమ్ జాబ్… ఊహించని లవ్‌స్టోరీలో అపార్థం తెచ్చిన పెను తుఫాన్… ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా

గల్లీ నుంచి గ్లోబల్ స్టేజ్ వరకు మనవడి మ్యూజికల్ బాక్సాఫీస్ సునామీ… గానా రికార్డుల మోత

Friday OTT Releases: శుక్రవారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఒక్కరోజే 14 సినిమాలు..!

ఇంట్లో చావుల పరంపర… వెళ్లిన వాళ్లను వదలకుండా వెంటాడే దెయ్యం… హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన హారర్‌

ప్రపంచమంతా జాంబీల రాజ్యమే… బతకడానికి ఓ గ్యాంగ్‌ చేసే పిచ్చి సాహసాలు… కిరాక్ అడ్వంచర్ కామెడీ

Big Stories

Advertisement
×