E-Paper
Advertisement

భర్త ఉండగానే మరొకరితో… కెమెరా ముందే బట్టబయలైన నిజాలు… క్రేజీ కొరియన్ రిలేషన్‌షిప్ డ్రామా

భర్త ఉండగానే మరొకరితో… కెమెరా ముందే బట్టబయలైన నిజాలు… క్రేజీ కొరియన్ రిలేషన్‌షిప్ డ్రామా
Advertisement

Korean Relationship Drama: కొరియన్ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ప్యూర్ లవ్ స్టోరీస్ లేదా వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్స్. కానీ హ్యూమన్ రిలేషన్స్ లో ఉండే డార్క్ సైడ్ ని, నమ్మకద్రోహాన్ని అత్యంత సహజంగా చూపెట్టడంలో కూడా వాళ్ళు మాస్టర్స్. ప్రముఖ కొరియన్ మేకర్ లీ చాంగ్-డాంగ్ దర్శకత్వంలో ఈ ఏడాది ఆస్కార్ రేసులోకి అఫీషియల్ ఎంట్రీగా వెళ్ళిన మైండ్ బెండింగ్ డ్రామా మూవీ ‘Possible Love’. ఇంటర్నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. దీని కథ ఏమిటి ? తెలుగులో చూడొచ్చా ? అనే వివరాల్లోకి వెళ్తే..

స్టోరీ ఏమిటంటే ?

మియోక్‌ అనే మహిళ తన భర్త హో-సియోక్‌, చిన్న కొడుకుతో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతుంటుంది. ఒకప్పుడు ఉద్యోగం చేసిన హో-సియోక్‌ ప్రస్తుతం నిరుద్యోగిగా ఉండటంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. మరోవైపు యే-జీ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌ ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల జీవితాలపై ఒక డాక్యుమెంటరీ రూపొందించాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో మియోక్‌ కుటుంబంతో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. యే-జీ భర్త సాంగ్-వూ కూడా ఈ పరిచయంలో భాగమవుతాడు.

Advertisement

ఒకవైపు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కుటుంబం.. మరోవైపు సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్న జంట. ఈ రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా కొత్త భావోద్వేగాలకు దారితీస్తుంది. కెమెరా ముందు తమ జీవితాలను ఆవిష్కరించే క్రమంలో మియోక్‌ మనసులోని సంఘర్షణలు బయటపడతాయి. ముఖ్యంగా సాంగ్-వూతో ఆమెకు ఏర్పడే ఆకర్షణ, యే-జీతో పెరిగే అనుబంధం కథను మరో మలుపు తిప్పుతాయి. ఈ పరిచయాల వల్ల ఆ నాలుగు జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? ప్రేమ, ఆకర్షణ, బాధ్యతల మధ్య వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అనేదే అసలు కథ.

ఇది వేగంగా సాగే థ్రిల్లర్‌ కంటే, పాత్రల మనస్తత్వాలను నెమ్మదిగా ఆవిష్కరించే ఎమోషనల్ రిలేషన్‌షిప్ డ్రామా. మనుషుల మధ్య ఉండే కనిపించని దూరాలను, వారి మనసుల్లో దాగి ఉన్న కోరికలను దర్శకుడు లీ చాంగ్-డాంగ్ తనదైన శైలిలో చూపించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, విజువల్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. బోల్డ్ అండ్ మైండ్ బెండింగ్ డ్రామాలను ఇష్టపడే వారు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని అస్సలు మిస్ అవ్వకండి.

తెలుగులోనూ చూడవచ్చు

Advertisement

‘Possible Love’ లో జియోన్ దో-యోన్, సుల్ క్యుంగ్-గు, యో-జియాంగ్, జో ఇన్-సంగ్ నటించారు. ఈ సినిమా నిడివి సుమారు 164 నిమిషాలు. 2026న సెప్టెంబర్ 23న దక్షిణ కొరియాలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, నవంబర్ 6 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. మన ఇండియన్ ఆడియన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ దీనిని కొరియన్ ఆడియోతో పాటు తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో ప్రాపర్ డబ్బింగ్ తో అందుబాటులోకి తెచ్చింది.

Read Also: గోవా డ్రీమ్ జాబ్… ఊహించని లవ్‌స్టోరీలో అపార్థం తెచ్చిన పెను తుఫాన్… ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా

Tags

Related News

గ్యాస్ స్టేషన్ నుంచి గ్రాండ్ బ్యాంక్ రాబరీ దాకా… అందమైన మోసగాడితో యువతి కిరాక్ క్రైమ్ జర్నీ

విమాన ప్రమాదం… మంచు అరణ్యంలో ఒంటరి పోరాటం… కదిలించే సర్వైవల్ థ్రిల్లర్

ఒక్క జూదంతో మొత్తం సామ్రాజ్యం బూడిద… చేతికి వేరే ప్రాణం… ఓటీటీలో దుల్కర్ సల్మాన్ గేమ్ స్టార్ట్

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్… కాలేజీ అందగాడితో ఒకే ఇంట్లో… యూత్ మస్ట్ వాచ్

ముగిసిన ‘ది ట్రైటర్స్’ తెలుగు సీజన్ 1.. విజేతలు ఎవరంటే?

గోవా డ్రీమ్ జాబ్… ఊహించని లవ్‌స్టోరీలో అపార్థం తెచ్చిన పెను తుఫాన్… ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా

గల్లీ నుంచి గ్లోబల్ స్టేజ్ వరకు మనవడి మ్యూజికల్ బాక్సాఫీస్ సునామీ… గానా రికార్డుల మోత

Big Stories

Advertisement
×