Romantic Crime Thriller: ఒక సాధారణ అమ్మాయి, ఒక ప్రొఫెషనల్ మోసగాడి ప్లాన్స్ కి అట్రాక్ట్ అయ్యి క్రైమ్ వరల్డ్ లోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది? ఈ క్రేజీ అండ్ స్టైలిష్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన హాలీవుడ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘Carolina Caroline’. ప్రేమ, మోసం, బ్యాంకు దోపిడీలు, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలతో సాగే ఈ హాలీవుడ్ క్రైమ్ రొమాంటిక్ డ్రామా చివరి వరకు చూపు తిప్పుకొనివ్వదు. మగ్నోలియా పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం భారీ హైప్ మధ్య 2026 జూన్ 5న అమెరికాలో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ ఇంగ్లీష్ ఒరిజినల్ ఆడియోతో ఓటీటీలో లభ్యమవుతోంది.
కేరోలిన్ డేనియల్స్ టెక్సాస్ లోని ఒక చిన్న పల్లెటూరిలో బోర్ కొట్టే లైఫ్ ని లీడ్ చేస్తూ, ఎలాగైనా ఆ ఊరి నుండి ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. సరిగ్గా అదే టైమ్‌లో ఆ ఊరికి ఎంట్రీ ఇస్తాడు ఆలివర్ అనే ఒక స్మూత్-టాకింగ్ అండ్ చార్మింగ్ కాన్ మ్యాన్. అతని స్టైల్ కు, మాటలకు అట్రాక్ట్ అయిన కేరోలిన్, అతనితో ప్రేమలో పడి ఇల్లు వదిలి వచ్చేస్తుంది. ఆతరువాత ఆలివర్ ఆమెకు చిన్న చిన్న గ్యాస్ స్టేషన్లని, షాపులని ఎలా దోపిడీ చేయాలో నేర్పిస్తాడు. అలా వారిద్దరి కిరాక్ క్రైమ్ జర్నీ అమెరికాలోని సౌత్ ఈస్ట్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది.
కానీ, కథలో అసలైన కిక్ ఎప్పుడు వస్తుందంటే.. ఈ చిన్న చిన్న దొంగతనాలు కాస్తా పెద్దగా మారి, ఒక భారీ గ్రాండ్ బ్యాంక్ రాబరీ ప్లాన్ గా మారుతాయి. ఆలివర్ వేసిన ఆ బిగ్గెస్ట్ దోపిడీ ప్లాన్ పోలీసుల ఎంట్రీతో ఒక్కసారిగా బెడిసికొడుతుంది. అక్కడి నుండి ఈ క్రేజీ కపుల్ పోలీసుల నుండి తప్పించుకోవడానికి చేసిన చేజింగ్స్, మైండ్ గేమ్స్ ఊపిరి సలపనివ్వకుండా సాగుతాయి. ప్రేమ కోసం మొదలైన ఈ ప్రయాణం చివరకు ఆమెను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆలివర్‌తో కలిసి సాగించిన నేరాల ప్రపంచం ఆమె జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? ఈ కథ క్లైమాక్స్ ఏంటి ? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. క్రైమ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇదొక పర్ఫెక్ట్ వీకెండ్ ఛాయిస్.
‘కరోలినా కరోలిన్’లో సమారా వీవింగ్ కరోలిన్ డేనియల్స్ పాత్రలో, కైల్ గాల్నర్ ఆలివర్ ఆండర్సన్ పాత్రలో నటించారు. ఈ మూవీకి ఆడమ్ కార్టర్ రేమియర్ దర్శకత్వం వహించగా, టామ్ డీన్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రం 2026 జూన్ 5న అమెరికాలో థియేటర్లలో విడుదలైంది. నవంబర్ 6 నుంచి ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: గోవా డ్రీమ్ జాబ్… ఊహించని లవ్‌స్టోరీలో అపార్థం తెచ్చిన పెను తుఫాన్… ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా