E-Paper
Advertisement

Psychological thriller OTT: అత్తారింట్లో వణికిపోయే కొత్త కోడలు… ట్విస్టులతో మెంటలెక్కిస్తున్న సిరీస్

Psychological thriller OTT: అత్తారింట్లో వణికిపోయే కొత్త కోడలు… ట్విస్టులతో మెంటలెక్కిస్తున్న సిరీస్
Advertisement

Psychological thriller OTT : ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అందులో థ్రిల్లర్ సిరీస్ లను తెగ చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో థ్రిల్లర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఒక బెంగాలీ వెబ్ సిరీస్. కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన యువతికి, ఎదురయ్యే భయంకరమైన సంఘటనలు చుట్టూ ఈ స్టోరీ జరుగుతుంది. ఏడు ఎపిసోడ్ లు ఉన్న ఈ సిరీస్ ను చూస్తే, అస్సలు చూపు తిప్పుకోలేరు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సిరీస్ ని చూస్తే క్రేజీగా ఫీల్ అవుతారు.

ఎక్కడ చూడచ్చు అంటే

అబ్రజిత్ సేన్ దర్శకత్వం వహించిన ఈ బెంగాలీ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘రోంకిణి భవన్’ (Ronkini Bhavan). ఇందులో శ్యామౌప్తి మడ్లీ, గౌరబ్ రాయ్ చౌదరి, బిదీప్తా చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ZEE5 ఓటిటి ప్లాట్‌ ఫామ్‌లో 2025 డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్ తో ఐయండిబిలో 7.6 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1990ల కాలంలో జూతిక అనే ఒక పల్లెటూరి అమ్మాయికి, పురూలియాలోని పెద్ద జమీందారీ కుటుంబానికి చెందిన ఆదిత్యనాథ్‌తో పెళ్లవుతుంది. పెద్ద ఇల్లు, బోలెడంత ఆస్తి అని మురిసిపోతూ అత్తగారింట్లో అడుగుపెడుతుంది. కానీ అక్కడ అడుగుపెట్టినప్పటి నుంచే ఆమెకు అన్నీ వింత వింతగా కనిపిస్తుంటాయి. ఆ ఇంట్లో అంతకుముందు పెళ్లయి వచ్చిన కోడళ్లందరూ అనుమానాస్పదంగా చనిపోయారని తెలిసి జూతికకు అసలు భయం మొదలవుతుంది. అయితే ఆ చనిపోయిన కోడళ్లంతా ‘రోంకిణి దేవి’ శాపం వల్లనే చనిపోయారని, ఆ దేవికి కోపం వస్తే ఆ ఇంటి ఆడబిడ్డలు దక్కరని ఆ కుటుంబ సభ్యులంతా గుడ్డిగా నమ్ముతుంటారు.

కానీ జూతికకు మాత్రం ఇది దేవుడి శాపం కాదని, ఈ చావుల వెనుక ఎవరో మనుషుల కుట్ర ఉందనే అనుమానం గట్టిగా వస్తుంది. ఈ క్రమంలోనే ఆ ఇంట్లో జరిగే రహస్య పూజలు ఆమెను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చివరికి జూతిక ధైర్యం చేసి అసలు నిజం ఏంటో వెతకడం మొదలుపెడుతుంది. ఆ జమీందారీ ఇంటి వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలు, ఒక్కొక్కటిగా బయటపడతాయి. అది దేవుడి శాపమా ? లేక మనుషులు ఆడుతున్న నాటకమా ? అనేది మాత్రం క్లైమాక్స్‌లో చాలా థ్రిల్లింగ్‌గా చూపిస్తారు.

Advertisement

Read Also :  రక్తం తాగే జోంబీలు… ఊరంతా ఉక్కిరిబిక్కిరి… క్రాక్ ఎక్కించే క్లైమాక్స్

 

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×