E-Paper
Advertisement

BRS party: బీఆర్ఎస్‌ పార్టీలో కనబడని కీలక మాజీ మంత్రులు..?

BRS party: బీఆర్ఎస్‌ పార్టీలో కనబడని కీలక మాజీ మంత్రులు..?
Advertisement

BRS party: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రుల వ్యవహార శైలి విమర్శలకు దారి తీస్తుంది. ఒకనాడు అన్ని తానై పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన వారు ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉంటుండడం.. ఎప్పుడో ఒకసారి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం.. అధీను వారికి కలిసివచ్చే ప్రోగ్రామ్స్ మాత్రమే నిర్వహిస్తుండడం చర్చకు దారి తీసింది. ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మాజీ మంత్రులంతా మౌనం..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేవారు. జిల్లాలో వారే సుప్రీంగా వ్యవహరించేవారు. అయితే టిఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మాజీ మంత్రులంతా మౌనం పాటిస్తున్నారు. ఒకరిద్దరు మినహా మిగతా మంత్రులు అంతా అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు సైతం లేవు. ఇక ఉమ్మడి జిల్లాల్లో వారి ఆచూకీ కనబడడం లేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. నాడు అన్ని తానై వ్యవహరించిన నేతలు ఎప్పుడూ ఇలా ఉండడం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

భవన్ కు సైతం అడపదడప

Advertisement

భవన్ కు సైతం అడపాదడప నే మాజీ మంత్రులు వస్తున్నారు. పార్టీ అధికారంలో లేదని రావడంలేదని విమర్శలు వివరిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం భావనకు వచ్చే నేతలు ఎప్పుడూ రాకపోవడం ఏంటి అనే ప్రచారం జరుగుతుంది. గ్రేటర్ లోని మాజీ మంత్రి మల్లారెడ్డి, పద్మారావు సైతం భవన్ కు ఎప్పుడో ఒకసారి వచ్చి పోతున్నారని ప్రచారం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు సైతం ఎప్పుడో ఒకసారి నిర్వహిస్తున్నారని విమర్శలు వెళ్లిపోతున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి మాత్రమే భవన్ కు రావడంతో పాటుగాను యాక్టివ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇక మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన నిరంజన్ రెడ్డి సైతం దూరంగా ఉంటున్నారని.. శ్రీనివాస్ గౌడ్ మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారని నేతలు పేర్కొంటున్నారు. లక్ష్మారెడ్డి సైతం యాక్టివ్ గా లేరని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదని.. సొంత నియోజకవర్గ ఖమ్మంలోనూ పర్యటించడం లేదని ప్రచారం ఊపందుకుంది. దీంతో పార్టీ కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాలో స్తంభించాయని పార్టీ నేతలలే అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ యాక్టివ్గా కార్యక్రమాలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని.. అందుకే సైలెంట్ గా ఉంటే సరిపోతుందని భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: GHMC WhatsApp number: మీ వీధిలో చెత్త ఉందా? ఫొటో తీసి వాట్సాప్ చేయండి: జీహెచ్‌ఎంసీ కొత్త సేవలు

మాజీ మంత్రులు..

Advertisement

అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగు రామన్న సైతం ఇనాక్యువయ్యారు. ఆ జిల్లాలో పూర్తిగా పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. తెలంగాణ భవన్ కు సైతం దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ కు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం ప్రజా సమస్యలపై స్పందించడంలో వెనుకబడ్డారని ప్రచారం జరుగుతుంది. వారి సొంత నియోజకవర్గంలోనూ దూరంగా ఉంటున్నారని ఉన్నారని పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానై వ్యవహరించాడు. కానీ ఈ మధ్య పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ నిర్వహించడం లేదని దూరంగా ఉంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం ఆ జిల్లాలో పర్యటనలు చేయడం లేదని పార్టీ క్యాడర్ సైతం అందుబాటులో ఉండడం లేదని ప్రచారం జరుగుతుంది. ఈ మాజీల వ్యవహార శైలి సర్వత్ర ఆసక్తికరంగా మారింది.

ఆ ఇద్దరు నియోజకవర్గాలకే..

ఆ ఇద్దరు మాజీ మంత్రులు కీలకంగా వ్యవహరించారు. ఆ జిల్లాలో వారే చెప్పిందే వేదం అన్నట్టు నడిపించారు. అందులో ఒకరు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో ఆయన మాట చలామణి అయ్యేది. ఏది చెబితే అదే పార్టీ అధిష్టానం సైతం సిగ్నల్ ఇచ్చేది. కానీ ప్రస్తుతం రివర్స్ అయింది. ఆయన నియోజకవర్గంలోనే గడ్డు పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీని ఓడిపోయాడు. దీంతో ఉమ్మడి జిల్లా వదిలి నియోజకవర్గానికి పరిమితం కావలసిన పరిస్థితి నెలకొంది. ఇంకో మాజీ మంత్రి గంగుల కమలాకర్.. ఉమ్మడి జిల్లాలో పర్యటించకుండా సొంత నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఈయన కరీంనగర్ మున్సిపాలిటీ ని సైతం గెలిపించుకోలేకపోయారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక మేడ్చల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.. నియోజకవర్గ కేడర్ కు సైతం అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వెలుగుతున్నాయి. ఒకప్పుడు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో విస్తృత పర్యటనలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో సైతం యాక్టివ్గా ఉన్నారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు.

ఇలాగే రాజకీయాలు ఉంటాయా..

ఏది ఏమైనప్పటికీ మాజీ మంత్రుల తీరు మాత్రం గులాబి కేడర్లో విస్తృత చర్చ జరుగుతుంది. పార్టీ అధికారంలో లేకపోతే ఇలాగే రాజకీయాలు ఉంటాయా.. ప్రజా సమస్యలపై స్పందించరా.. కేవలం అధికారం కోసమే పాపులాడుతారా అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. ప్రజా సమస్యలపై స్పందిస్తాము.. వారి పక్షాన పోరాటం నిర్వహిస్తామని చెబుతున్న గులాబీ పార్టీ.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని ప్రచారం జరుగుతుంది.

Also Read: Dharman Rao: ధర్మాన కోసం జగన్ వేసిన మాస్టర్ ప్లాన్.. సీనియర్ నేత మౌనం వెనుకున్న రహస్యం ఇదే!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×