BigTV English

OTT Movie : పెళ్ళిరోజే పెళ్ళికొడుక్కి షాక్ … ప్రియుడితో పెళ్ళికూతురు జంప్ … ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్ తో ఫస్ట్ నైట్

OTT Movie : పెళ్ళిరోజే పెళ్ళికొడుక్కి షాక్ …  ప్రియుడితో పెళ్ళికూతురు జంప్ … ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్ తో ఫస్ట్ నైట్

OTT Movie : ఏదైనా సినిమా చూడాలనిపించినప్పుడు మలయాళం సినిమాలను సర్చ్ చేస్తున్నారు మూవీ లవర్స్. అంతలా ఇప్పుడు ఈ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఎంచుకునే కథలు, తీసే విధానం, నటించే పద్ధతి వీళ్ళు తీసే సినిమాలకు కొత్త ఊపిరి పోస్తోంది. జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఒక మూవీ నటనా పరంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ స్టోరీ 40 ఏళ్ల పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఒక కొండ ప్రాంతంలో ఉండే ఇతనికి, పెళ్లి పరంగా అడ్డంకులు వస్తూ ఉంటాయి. స్టోరీ చివరి వరకు సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ పేరు ‘పులిమడ’ (Pulimada).  2023 లో విడుదలైన ఈ మూవీకి  A. K. సజన్ దర్శకత్వం వహించారు.  ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, చెంబన్ వినోద్ జోస్, జాఫర్ ఇడుక్కి, జానీ ఆంటోనీ, లిజోమోల్ జోస్, జియో బేబీ, బాలచంద్ర మీనన్ ఇందులో నటించారు. ఇషాన్ దేవ్ పాటలు సమకూర్చగా, అనిల్ జాన్సన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

40 ఏళ్ల విన్సెంట్ ఒక కొండ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తుంటాడు. చిన్నప్పటినుంచి ఆమె తల్లి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో విన్సెంట్ పెద్దయ్యాక, అతనికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఆమె తల్లి పిచ్చితనం కారణంగా ఎన్నో సంబంధాలు చెడిపోతాయి. పోలీస్ ఆఫీసర్ గా డ్యూటీ చేస్తున్నా కూడా ఈ సమస్యనే ఎదుర్కొంటాడు. ఒకానొక టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్లి తనకి కూడా పిచ్చి ఉందేమోనని చెక్ చేసుకుంటాడు. ఈ క్రమంలో విన్సెంట్ కి ఒక సంబంధం వస్తుంది. పెళ్లి ఏర్పాట్లు కూడా జరిగిపోతాయి. పెళ్లికూతురు మాత్రం ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. పెళ్లికి ముందే తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోతుంది. ఇది విన్సెంట్ ను మరింత బాధ పెడుతుంది. పెళ్లి, పీటల వరకు వచ్చి ఆగిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్తాడు.

ఆ తరువాత మందు తాగుతూ అందరినీ ఇష్టం వచ్చినట్టు తిడుతుంటాడు. మరోవైపు అదే ఊరిలో పులి ఊరి మీద పడి భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇంతలో మహిష్మతి అనే అమ్మాయి ఆ ఊరిలో దారి తప్పి విన్సెంట్ కి ఎదురవుతుంది. పెళ్లి పెటాకులవడంతో, ఈ అమ్మాయిని అనుభవించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే తనని ఇంటికి కూడా తీసుకెళ్తాడు. రాత్రి రెస్ట్ తీసుకొని పొద్దున్నే వెళ్ళమని చెప్తాడు. ఇద్దరు కలిసి మందు కూడా తాగుతారు. చివరికి విన్సెంట్ ఆమెపై అఘాయిత్యం చేస్తాడా ? తనకి పెళ్లి అవుతుందా ? ఊరిలో పులి వల్ల వచ్చే సమస్యలు ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం మూవీని చూడండి.

Read Also : ప్రేయసికి తెలియకుండా బాయ్ ఫ్రెండ్ పాడు పనులు… బెడ్ కింద దూరి… ఆ అమ్మాయి చేసే పనికి ఫ్యూజులు అవుట్

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×