OTT Movie : లవ్ స్టోరీ లతో సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటికి అడ్డుకట్టఎవ్వరూ వెయ్యలేరు. ఎందుకంటే లవ్ స్టోరీ లేని సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. అంతలా ప్రేక్షకులు వీటికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లవ్ స్టోరీ చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. స్కూల్ డేస్ లో ప్రేమించిన ఒక అమ్మాయిని, కొన్ని సంవత్సరాల తరువాత కలుస్తాడు. అయితే అప్పటికే ఆమెకు పెళ్లి జరిగిపోయి ఉటుంది. అసలు స్టోరీ ఇప్పుడే మొదలౌతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ?
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ జపనీస్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అండర్ యువర్ బెడ్’ (Under Your Bed). 2019 లో వచ్చిన దీనికి మరి ఆసటో దర్శకత్వం వహించారు. ఇందులో లీ జి-హూన్, లీ యూన్-వూ, సూ-హాంగ్ షిన్, కిమ్ సూ-ఓహ్ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ మూవీ స్టోరి నాటో మిత్సుయ్ అనే ఒంటరి యువకుడి చుట్టూ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
నాటో మిత్సుయ్ అనే యువకుడు ఎప్పుడూ ఒంటరి తనంతో బాధపడుతుంటాడు. అతన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అతను చిన్నతనంలో కూడా ఎవరినీ తనవైపు అట్రాక్ట్ చేసువలేకపోతాడు. కానీ స్కూల్లో చిహిరో అనే అమ్మాయి అతని పేరు పిలిచినప్పుడు, అది అతనికి పెద్ద విషయంగా అనిపిస్తుంది. తన లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చిందని సంతోష పడతాడు. అయితే ఇతని స్వభావం వల్ల ఆమెతో సరిగ్గా ఏ విషయం చెప్పలేక పోతాడు. అల స్కూల్ లైఫ్ కూడా గడిచిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, నాటో ఆమెను మళ్లీ కలవాలని కోరుకుంటాడు. 11 సంవత్సరాల తర్వాత ఆమె ఎక్కడుందో కనిపెడతాడు. కానీ చిహిరో ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె వివాహం చేసుకుని, ఒక శాడిస్ట్ భర్తతో సంసారం చేస్తూ ఉంటుంది. నాటో ఆమె పట్ల వ్యామోహంతో, ఆమె ఇంట్లోకి రహస్యంగా చొరబడి, ఆమె మంచం కింద దాక్కుంటాడు.
అక్కడి నుండి ఆమె జీవితాన్ని గమనిస్తూ, ఆమెపై తనకున్న ప్రేమను వ్యక్తపరచాలని చూస్తాడు. కానీ ఆమె భర్త తనని చాలా ఘోరంగా టార్చర్ చేస్తూఉంటాడు. ఆమెని లైంగికంగా కూడా వేధిస్తుంటాడు. ఆమెను ఎన్నిరకాలుగా చూడచ్చో, అన్నిరకాలుగా దాక్కోని చూస్తాడు. ఇది చూసిన తరువాత నాటో చర్యలు విచిత్రంగా, భయంకరంగా మారతాయి. చిహిరో భర్త నుండి ఎదుర్కొంటున్న హింసను చూసిన నాటో ఆమెను ఈ పరిస్తితి నుంచి రక్షించాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతని మనస్తత్వంతో తీసుకునే చర్యలు పరిస్తితిని మరింత సంక్లిష్టంగా మారుస్తాయి. ఈ స్టోరీ తరువాత వైలెంట్ గా మలుపు తీసుకుంటుంది. చివరికి చిహిరోని ఆమె భర్త నుంచి నాటో కాపాడతాడా ? వీళ్ళ లవ్ మళ్ళీ మొదలవుతుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే,ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : మర్రి చెట్టుతో పెళ్లి … ప్రెగ్నెంట్ అయ్యి ఊర్లో జనాలకి షాక్ ఇచ్చే అమ్మాయి