Thaman: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. కిక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి మ్యూజిక్ తో మంచి కిక్ ఇచ్చాడు. ఆ తర్వాత తర్వాత వరుసగా అవకాశాలు పట్టుకొని బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అతి త్వరగా 50 సినిమాలను కంప్లీట్ చేశాడు. చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని పొందుకున్నాడు. అయితే ఒక టైం లో తమన్ మ్యూజిక్ చాలామంది ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది అనడం వాస్తవం. తమన్ వరుసగా మ్యూజిక్ చేస్తున్న టైంలో తమన్ పేరును కూడా మార్చేశారు. అనూహ్యంగా ఈ విషయాన్ని కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అయ్యాడు తమన్. వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని సినిమాలకు ఎస్ఎస్ తమన్ అని టైటిల్ కార్డులో వేశారు. అయితే ఏమవుతుందో చూద్దామని తమన్ కూడా పెద్దగా దాని గురించి ఆలోచించలేదు.
పేరు మార్చేశారు
తమన్ పేరుకు ముందు ఎస్ ఎస్ అని చేర్చినప్పుడు ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఒక 10 15 సినిమాలకు అదే టైటిల్ ఉంచుకున్నాడు. కానీ ఆ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న తరుణంలో తమన్ పేరును కొంచెం డిఫరెంట్ గా మార్చుకున్నాడు. తనే స్వయంగా తమన్ ఎస్ అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ముందు వెనుక ఉన్న వాటిని పక్కన పెడితే తమన్ అనేది ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఒక సినిమాను ఎలివేట్ చేయడానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకు తమను అందించే సంగీతం వేరే లెవెల్. అందుకే కొంతమంది తమన్ ను నందమూరి తమన్ అని పిలుస్తూ ఉంటారు. రీసెంట్ టెన్స్ లో బాలకృష్ణ చేసిన ప్రతి సినిమాకి సంగీతం అందించాడు.
అరవింద సమేత తర్వాత
వరుసగా సినిమాలకు సంగీతం అందిస్తున్న తమన్ సంగీతం చాలామందికి ఒక టైం లో బోర్ కొట్టడంతో, కావాలనే తమన్ కొంచెం గ్యాప్ తీసుకొని, హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటూ ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తొలిప్రేమ సినిమా తర్వాత తమన్ ఒక ఫ్రెష్ మ్యూజిక్ మళ్లీ అందించడం మొదలు పెట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాతో తమన్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాడు. ఆ సినిమా తమన్ కెరియర్ లో వచ్చిన 100వ సినిమా, ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేవలం తమన్ కి మాత్రమే కాకుండా త్రివిక్రమ్ కెరియర్ కి కూడా మంచి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చింది.
Also Read : Sandeep Reddy Vanga: అల్లు అర్జున్ తో అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టేనా.?