Sister Midnight OTT: రాధిక ఆప్టే Radhika Apte) .. బాలయ్య బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె.. మునుపెన్నడూ చేయని విధంగా, సరికొత్తగా ఒక ఊహించని క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఒక డిఫరెంట్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ చిత్రంగా నిలిచింది ‘సిస్టర్ మిడ్ నైట్’. అయితే రెండు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందులో రాధిక ఆప్టే తో పాటు అశోక్ పాఠక్ , ఛాయా కదం, స్మితా తాంబే తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఈ చిత్రానికి కరణ్ కాందారి (Karan Kandhari) దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రానికి అమెరికన్స్ అలిస్టర్ క్లార్క్, అన్నా గ్రిఫ్ నిర్మాతలుగా వ్యవహరించగా.. ఇక అన్ని విభాగాలలో కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయడం గమనార్హం. మే 30వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ సరైన పబ్లిసిటీ లేక ఒక వర్గం ఆడియన్స్ కి మాత్రమే ఈ సినిమా పరిమితమైంది.
సడన్గా ఓటీటీలోకి వచ్చి, షాక్ ఇచ్చిన రాధిక బోల్డ్ మూవీ.
మరి కొంతమందికి ఈ సినిమా విడుదల అయ్యిందో లేదో కూడా తెలియదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి సడన్గా షాక్ ఇచ్చింది. 1:50 గంటల నిడివి ఉన్న ఈ సినిమా అంతా కేవలం ఇద్దరి ముగ్గురు మధ్య ఒకే తరహాలో స్క్రీన్ ప్లే సాగుతుంది. ముఖ్యంగా దర్శకుడు కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏం జరగబోతోంది? అనే ఫీల్ కలిగించారు. ఈ బో*ల్డ్ పాత్రలో.. బస్తీ మహిళ గా సింగిల్ హ్యాండ్ తో మూవీని నడిపించింది రాధిక ఆప్టే. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా యూకే లో ఆపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్, గూగుల్ ప్లే, VOD లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మన ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికపై అందుబాటులో లేదు. ఇతర అన్ని దేశాలలో రెంట్ పద్ధతిలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే ఇక్కడ అభిమానులకు శుభవార్త ఏమిటంటే.. మన దేశంలో కూడా ఫ్రీ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంది.. ఇది చాలా బో*ల్డ్ కంటెంట్ వీడియో కావడంతో కేవలం చూసేవారు ఒంటరిగా, హెడ్ ఫోన్స్ తో మాత్రమే చూడాలి అని చూసిన ఆడియన్స్ సలహా ఇస్తున్నారు.
అత్యుత్తమ బ్రిటిష్ డెబ్యూ గా సిస్టర్ మిడ్ నైట్..
ఇదిలా ఉండగా ఈ సినిమా.. ఈ సంవత్సరం BAFTA అవార్డులలో అత్యుత్తమ బ్రిటిష్ డెబ్యూ గా నామినేట్ చేయబడింది. అంతేకాదు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. గోల్డెన్ కెమెరా నామినేషన్ తో పాటు డైరెక్టర్ ఫోర్ట్ నైట్ విభాగంలో నామినేట్ చేయబడ్డారు.
సిస్టర్ మిడ్ నైట్ సినిమా స్టోరీ..
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఉమా (రాధిక ఆప్టే) గోపాల్ అనే వ్యక్తిని పెద్దలు కుదిరిచిన పెళ్లిగా చేసుకుంటుంది. ముంబైలోని ఒక స్లమ్ లో ఇద్దరు కొత్తగా కాపురం పెడతారు. అయితే వివాహం ఇష్టం లేని ఉమా తన భర్తతో అంతగా మింగిల్ కాలేక పోతుంది. అదే సమయంలో ఇంట్రోవర్ట్ అయినా భర్త గోపాల్ కూడా భయపడుతూ.. భార్యను చూడడానికి , తాకడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక పైగా భర్త కూడా అంటి ముట్టనట్టు ఉండడంతో ఏం చేయాలో తెలియక ఒక ఆఫీసులో ఫ్లోర్ క్లీనింగ్ పనిలో చేరుతుంది. తనకు ఉన్న ఆ విపరీతమైన కోరికను తీర్చుకోలేక దాని గురించి బయటకు చెప్పుకోలేక లోలోపలే మదన పడుతూ అనారోగ్యం పాలవుతుంది ఉమా. అయితే ఒకరోజు ఎలాగోలా ధైర్యం చేసి భర్తతో ఆ సమయాన్ని కాస్త గడిపేస్తుంది.ఇక పక్కనే పడుకున్న భర్త తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి ఉంటాడు. దీంతో ఉమా ఏం చేసింది? ఆ తర్వాత ఒంటరి ప్రయాణం ఎలా సాగింది? ఆమె జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? అనేది ఈ సినిమా కథ. ఇందులో రాధిక ఆప్టే చాలా అద్భుతంగా నటించింది.
also read:Mega 157 : చివరికి డ్రిల్ మాస్టర్‌గా మారిపోయాడు… అనిల్ అసలేం చేస్తున్నావయ్యా ?