Siddharth Kaul: భారత మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ {Siddharth Kaul} మీకు గుర్తుండే ఉంటాడు. ఇతడు ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో 55 మ్యాచ్ లు ఆడిన సిద్ధార్ధ్ కౌల్ 29.98 సగటుతో 58 వికెట్లు పడగొట్టారు. అతని అత్యుత్తమ ప్రదర్శన 4/29. అలాగే 88 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 26.77 సగటు, 3.10 ఎకానమీతో 297 వికెట్లు తీశాడు.
Also Read: Najmul Hassan Shanto: బంగ్లాదేశ్ కెప్టెన్ పై హ**త్యాయత్నం.. ఏకంగా గ్రౌండ్ లోనే ఇంత దారుణమా
అలాగే టి-20 మ్యాచ్ లలో 22.04 సగటుతో 182 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు సిద్ధార్ధ్. మూడు వన్డేలు, మూడు టి-20 ల్లో భారత్ కి ప్రతినిథ్యం వహించిన 34 ఏళ్ల సిద్ధార్థ్.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అనంతరం 2024 నవంబర్ లో రిటైర్మెంట్ ప్రకటించాడు. తన చివరి వన్డే మ్యాచ్ ని 2018లో అప్ఘనిస్తాన్ పై, చివరి t-20 మ్యాచ్ 2019లో ఆస్ట్రేలియా పై ఆడాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2008 అండర్ – 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సిద్ధార్థ్ కౌల్ సభ్యుడు.
అనంతరం పదేళ్ల తర్వాత 2018 లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వన్డే, t-20 ఫార్మాట్లలో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. ఇక చివరిగా ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసిన వెంటనే సిద్ధార్థ్ తన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 40 లక్షల కనీస ధరతో మెగా వేలంలోకి వచ్చిన అతడిని ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టులో అవకాశాలు రాక, ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపించకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే తాజాగా సిద్ధార్థ్ కౌల్ బిగ్ బాష్ {BBL} లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా {CA} నిర్వహించే బిబిఎల్ లో ఆడేందుకు సిద్ధార్థ్ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ సహా 600 మందికి పైగా క్రికెటర్లు ఈ బిబిఎల్ లో ఆడేందుకు పేర్లు నమోదు చేసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా వెల్లడించింది. భారత్ తరపున పురుషుల్లో సిద్ధార్థ్ కౌల్, మహిళల్లో 15 మంది క్రికెటర్లు బిబిఎల్ లో ఆడేందుకు ఆసక్తి చూపించారు.
Also Read: Riyan Parag: ఆ అందాల తారను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పరాగ్.. !
జమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, శిఖ పాండే, యాస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, కనిక అహుజా, ఎస్ మేఘన, ప్రతిక రావల్, నికి ప్రసాద్, ప్రియా మిశ్రా, ఉమా చత్రి, కాశ్వి గౌతమ్ తో పాటు మరికొందరు ఈ జాబితాలో ఉన్నారు. ఇక సిద్ధార్థ్ విషయానికి వస్తే.. బౌలింగ్ కి దిగగానే వెంటనే వికెట్ తీసి ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ ను ఒత్తిడిలోకి నెట్టి వేయడంలో కౌల్ దిట్ట. అలాంటి సిద్ధార్థ్ కౌల్ బిబిఎల్ లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.