Rajiv Gandhi Assassination : ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన వెబ్ సిరీస్ ఇది..ఎక్కడా..స్కిప్ చేయకుండా..ఫార్వార్డ్ చేయకుండా చూసిన వెబ్ సిరీస్ ఇది. కథలో ట్విస్టులు ఏమీ ఉండవ్..అందరికీ తెలిసిన విషయాలే.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అనంతరం…హంతకుల కోసం సాగిన విచారణ మీద తీసిన సిరీస్ ఇది.. ఎక్కడా..హడావిడి, హంగామా..ఏమీ ఉండవు.. అలా ఇన్వెస్టిగేషన్ సాగిపోతుంటే..మనం అలా లీనమైపోయి కన్నార్పకుండా చూస్తూనే ఉంటాం..
1991మే21న పెరంబదూర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్లిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ..బాంబు పేలుడులో చనిపోయారు..బాంబు పేలుడుకు రాజీవ్ గాంధీ శరీరం పూర్తిగా చిద్రమైపోయింది..ఆయన కాలికున్న బూటు ఆధారంగా ఆయన శరీర భాగాలను గుర్తించాల్సి వచ్చింది..హత్యపై విచారణకు కేంద్ర ప్రభుత్వం *స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)*ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి సీనియర్ ఐపీఎస్ అధికారి.అప్పుడు హైదరాబాద్ సీఆర్పీఎఫ్ ఐజీగా పని చేస్తున్న డి.ఆర్. కార్తికేయన్ నేతృత్వం వహించారు.విచారణ ప్రక్రియఆధారాల సేకరణ: హత్య జరిగిన స్థలంలో దొరికిన ఫోటోలు (హరిబాబు అనే LTTE సభ్యుడు తీసినవి) కీలకమైన సాక్ష్యంగా మారాయి. ఈ ఫోటోలు హత్యలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించడంలో సహాయపడ్డాయి.
హత్యకు ప్రధాన సూత్రధారిగా తెన్మోజి రాజరత్నం (ధను) గుర్తించబడింది, ఆమె ఆత్మాహుతి బాంబర్‌గా పనిచేసింది. ఆమెతో పాటు శివరాసన్ (ఒక కన్ను సివన్), నళిని, మరియు ఇతర LTTE సభ్యులు కుట్రలో భాగస్వాములుగా గుర్తించబడ్డారు..
విచారణలో ఈ హత్య వెనుక శ్రీలంకలోని LTTE సంస్థ ఉన్నట్లు నిర్ధారణ అయింది. రాజీవ్ గాంధీ శ్రీలంకలో భారత శాంతి సే ना (IPKF)ని పంపినందుకు LTTE ఆగ్రహంతో ఈ హత్యను ప్లాన్ చేసినట్లు తేలింది.
ఈ కేసు టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (TADA) కింద విచారణ జరిగింది. 1998లో, చెన్నైలోని టాడా కోర్టు 26 మంది నిందితులకు మరణశిక్ష విధించింది.
సుప్రీం కోర్టు తీర్పు: 1999లో, సుప్రీం కోర్టు ఈ తీర్పును సమీక్షించి, నలుగురికి (మురుగన్, సంతన్, పేరరివాళన్, నళిని) మరణశిక్షను ధృవీకరించింది, మిగిలిన వారి శిక్షలను జీవిత ఖైదుగా మార్చింది. నళిని గర్భవతిగా ఉండటం వల్ల ఆమె శిక్షను సోనియా గాంధీ జోక్యంతో జీవిత ఖైదుగా మార్చారు.
సుప్రీం కోర్టు మిగిలిన నిందితులను (పేరరివాళన్, నళిని, మరియు ఇతరులు) విడుదల చేయాలని ఆదేశించింది, వారు దాదాపు 30 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించినందున…
ఇదంతా అందరికీ తెలిసిన విషయమే..మరి వెబ్ సిరీస్ ఇంత ఆసక్తికరంగా ఎలా తీశారు..అందరికీ తెలిసిన విషయాన్ని మళ్లీ జనం చూసేలా ఎలా తీయగలిగారు అనేది ఇక్కడ ఆసక్తి కర అంశం.. వెబ్ సిరీస్ లో తీసిన అంశాలన్నీ ఎలా సేకరించారు అనేది దానికున్న అధెంటికేషన్ ఏంటనేది కూడా డిస్కషన్ పాయింట్..సాధారంగా మనకు తెలిసిన విషయాలకంటే కొత్తగా కొన్ని విషయాలను చూపించారు వెబ్ సిరీస్ లో…
1.మానవబాంబుతో రాజీవ్ గాంధీని హతమార్చాలనుకున్నపుడు బెల్ట్ బాంబ్ ను తయారు చేయించిన ఒంటికన్ను శివరాసన్.. ముందుగా ఆ బాంబును మరో మాజీ ప్రధాని వీపీసింగ్ తమిళనాడు పర్యటనలో..ఉండగా టెస్ట్ ట్రయల్ చేశారు.బాంబు పేల్చలేదు గానీ..వీవీఐపీ పర్యటనలో మెటల్ డిటెక్టర్లకు దొరకకుండా.. బెల్ట్ బాంబు ధరించిన ధాను..సెక్యూరిటీ వలయం దాటుకుని మాజీ ప్రధాని వీపీ సింగ్ వరకూ వెళ్లగలిగింది… ఆయన మెడలో గంధపు మాల వేయగలిగింది.. దండ ఆయన మెడలో వేసి వంగి ఆయనకు పాదాభివందనం చేసినపుడు నడుముకున్న బెల్ట్ బాంబ్ లో మొదటి స్టెప్ అయిన స్విచ్ ను సక్సెస్ ఫుల్ గా ఆపరేట్ చేసింది..వీపీసింగ్ పైనే ఈ బెల్ట్ బాంబ్ టెస్ట్ ట్రయల్ చేసిన సంగతి బహుసా చాలామందికి తెలియకపోవచ్చు
2.రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత ఎల్టీటీటీఈ అధినేత టైగర్ ప్రభాకరన్ ఆదేశాల మేరకు ఒంటికన్ను శివరాసన్ బృందం తిరిగి జాఫ్నా(శ్రీలంక)వెళ్లిపోవాలి.. ఆయన్ను తీసుకెళ్లడానికి ప్రభాకరన్ రైట్ హ్యాండ్ అయిన శాంతను కూడా చెన్నైవచ్చారు..కానీ శివరాసన్ అధినేత ఆదేశాలను ధిక్కరించి చెన్నైలోనే ఉండిపోయారు.. ఒక విధంగా ఎల్టీటీటీఈ కి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు..శాంతనుకు, శివరాసన్ కు మధ్య అనేకసార్లు ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది..ఈ సంగతి కూడా చాలామందికి తెలీదు
3.రాజీవ్ గాంధీ హత్య తర్వాత శివరాసన్ మరికొన్ని హత్యలు చేయాలనుకున్నాడు.అందులో ఒకటి అప్పటి ముఖ్యమంత్రి జయలలిత.. ఆమెను కూడా రాజీవ్ గాంధీ మాదిరిగా హత్యచేయాలనుకున్నాడు..ఇది ఎల్టీటీటీఈ నిర్ణయానికి వ్యతిరేకం..కేవలం శివరాసన్ తీసుకున్న నిర్ణయం మాత్రమే.. దీనికి అధినేత అనుమతి కూడా లేదు.. అందుకు శుభతో కలిసి స్కెచ్ కూడా వేస్తాడు శివరాసన్…జయలలిత హత్యకు ఫ్లాన్ అనేది కూడా కొత్తవిషయం కావొచ్చు
4.రాజీవ్ గాంధీ ని హత్యచేయడం పెరంబదూర్ లో విఫలమైతే..సెకండ్ స్కెచ్ ఢిల్లీలో వేశారు..ఇక్కడ హ్యూమన్ బాంబర్ గా మారడానికి ధాను ముందుకు వస్తే..ఢిల్లీలో హ్యూమన్ బాంబర్ అవడానికి మరో యువతి పదేహేడేళ్ల అధిరైను సిద్దం చేశారు.. ఆమె కూడా చావుకు సిద్ధమై ఉంది.. పెరంబదూర్ లో ప్లాన్ సక్సెస్ కావడంతో ఆమె బతికిపోయింది..ఇది కూడా ఇంట్రెస్టింగ్ విషయమే
5.రాజీవ్ గాంధీ హత్యపై విచారణకు కేంద్రం నియమించిన కార్తీకేయన్ నేతృత్వంలోని సెట్ బృందం మొత్తాన్ని కూడా శివరాసన్ హత్య చేయాలనుకున్నాడు..ఇందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేశాడు.. సిట్ టీమ్ కు బస చేసిన మల్లిగై గెస్ట్ హౌస్ కు మధ్యహ్నం వెళ్లే భోజనం సాంబార్ గిన్నెలో బాంబును పంపాడు.. సాంబార్ ఉన్నా కూడా బాంబ్ దెబ్బ తినకుండా ఉండేలా వాటర్ ప్రూఫ్ బాంబ్ తయారు చేశాడు.. భోజనం, బాంబుతో నిండి ఉన్న సాంబార్ గిన్నెతో ఉన్న ఆటో..మల్లిగై గెస్ట్ హౌస్ కు వచ్చాక..పోలీసులను చూసి అనుమానంతో వెనక్కి వెళ్లిపోవడంతో కార్తికేయన్ బృందం ప్రాణాలతో బయటపడింది.ఇది కూడా ఆసక్తికర అంశం
6.ఇక రాజీవ్ గాంధీ హత్య నిందితులను పట్టించింది ఒక కెమేరా.. అది కూడా న్యూస్ పేపర్ లో మరునాడు పబ్లిష్ అయిన ఫొటోలో ఒక మృతదేహం పక్కన పడి ఉన్న కెమేరాను చూసి అప్పటి ఫోరెన్సిక్ టీమ్ సభ్యుడు ఆ కెమేరా కోసం ఆరా తీయడం,దాన్ని రికవరీ చేసి అందులో ఉన్న 13 ఫొటోలను బయటకు తీశారు.. కేసుకు మూలం న్యూస్ పేపర్ లో వచ్చిన కావడం విశేషం..ఇక ఇది సాధారణ బాంబ్ కాదని..ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా హ్యూమన్ బాంబర్ ను అది కూడా నడుముకు బెల్ట్ బాంబ్ పెట్టి పేల్చారని.. అందుకు ఒక మహిళను వినియోగించారని ఆ ఫోరెన్సిక్ నిపుణుడు తేల్చారు.. ఘటనా స్థలంలో దొరికిన మహిళ డ్రస్ పీలికలు, దానికి అంటుకుని ఉన్న వైర్ ముక్కల ఆధారంగా ఇది హ్యూమన్ బాంబర్ అని తేల్చారు.ఇదే కేసుకు అసలైన లీడ్
7.ఘటనా స్థలంలో దొరికిన కెమేరాలో రాజీవ్ గాంధీకి ఒక మహిళ మెడలో దండ వేస్తున్నప్పుడు ఫొటోలు, బాంబ్ పేలుడు ఫొటో కూడా రికార్డ్ అయింది.అయితే ఆ ఫొటోలు తీసింది..స్థానిక ఫొటోగ్రాఫర్ హరిబాబు.. విషాదమేమంటే ఆయనకూడా ఆ పేలుళ్లలో చనిపోయారు.. కానీ కొత్త విషయమేమంటే.. ఆ హరిబాబు కూడా ఎల్టీటీటీఈ సభ్యుడు అని సిరీస్ లో చూపించారు..హరిబాబు తల్లిదండ్రులను విచారించాక అతని ఇంట్లో దొరికిన ఆధారాలతో కేసు ఇన్వెస్టిగేషన్ అంతా సాగుతుంది..కానీ ఇన్నాళ్లు ఈ ఫొటోగ్రాఫర్ ఎల్టీటీటీఈ సభ్యుడనే విషయం బయటి ప్రపంచానికి తెలీదు.అయితే తానే ఫొటోలు తీసి తానే ఎందుకు పేలుడులో చనిపోయాడు అనేది మాత్రం తెలియలేదు..అంటే ఫొటోలు తీసే అసైన్‌మెంట్ ఇచ్చిన శివరాసన్ బాంబు పేలుతుందనే విషయం హరిబాబుకు చెప్పి ఉండరని సిట్ బావిస్తుంది
8.ఎల్టీటీటీఈ మిలిటెంట్లు..సాధారణంగా పోలీసులకు పట్టుబడిపోతే… మెడలో ఉండే సైనైడ్ ను కొరికి చనిపోతారు.అందుకే సిట్ టీమ్.. యాంటీ సైనేడ్ ఇంజెక్షన్లు సిద్దం చేసుకుంటారు..అంటే తాము పట్టుకోవడానికి వెళ్లినపుడు నిందితులు సైనేడ్ ను కొరికితే వెంటనే ఆ ఇంజెక్షన్లు చేసి వారిని బతికించాలనేది ప్లాన్..ఇది కూడా కొత్త విషయం
9.నిందితుల నుంచి శివరాసన్ లొకేషన్ చెప్పించడానికి, హత్య ప్లాన్ తెలుసుకోవడానికి సిట్ టీమ్ లో సభ్యుడు పట్టుబడిన గర్భవతి అయిన నళినిని ఆమె భర్త ఎదురుగా ప్రవర్తించిన తీరు కూడా ఆశ్చర్యపరుస్తుంది.ఇలా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారా..అనిపించింది.. భారత్ నుంచి శ్రీలంక వెళ్లిన అప్పటి శాంతిదళం సభ్యుడైన ఆ అధికారి నిజాలు రాబట్టేందుకు ఇలా మానసికపరమైన గేమ్ కూడా ఆడాల్సి ఉంటుందని సిట్ చీఫ్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు..తాను శ్రీలంక లోఉన్నపుడు కూడా ఇదే రకమైన గేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశానంటాడు.ఇది కూడా కొత్త విషయమే
10.సిట్ పర్మిషన్ లేకుండానే ఇటు తమిళనాడు, అటు కర్నాటకలో స్థానిక పోలీసులు ఎల్టీటీటీఈ సభ్యుల ఇళ్లపై దాడులు చేయడం, అలా పోలీసులను చూడగానే వాళ్లు సైనైడ్ మింగి చనిపోవడం..దానిపై సిట్ సభ్యులు సీరియస్ అవ్వడం అన్నీ ఆసక్తికర అంశాలే.. ఇలా సైనైడ్ మింగి చనిపోతున్న ఎల్టీటీఈ సభ్యుల మరణాలపై అప్పటి ప్రధాని పీవీ నరశింహరావు ముందు సిట్ చీఫ్, సీబీఐ చీఫ్ ఇద్దరూ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది
11.రాజీవ్ హత్యకు మూలకారకుడైన ఒంటికన్ను శివరాసన్ బెంగళూరు సమీపంలో ఒక పల్లెటూరులో తలదాచుకున్న లొకేషన్ ను ట్రేస్ అవుట్ చేశాక సిట్ టీమ్ అతన్ని పట్టుకోవడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాదు.. అప్పటి వరకూ చాలా యాక్టివ్ గా అద్భుతంగా పని చేసిన సిట్ చీఫ్ కార్తికేయన్ ఎందుకు చివర్లో ఎదురుగా శత్రువు ఉన్నప్పటికీ పట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ తన టీమ్ కు రైడ్ కు అనుమతి ఇవ్వరు..ఇలా ఎందుకు డిలే చేసారో కూడా కారణం తెలీదు.. సిట్ చీఫ్ వచ్చేవరకూ వేచి ఉండాలని ఒక రోజు,సీబీఐ చీఫ్ ఢిల్లీ నుంచి వచ్చే వరకూ వేచి ఉండాలని మరో రోజు ఇలా రైడ్ ను ఆలస్యం చేస్తూనే ఉంటారు
12..చివరికి రెండు రోజుల అనంతరం అయినా రైడ్ కు అనుమతి దొరుకుతుందా అంటే..సైనైడ్ రియాక్షన్ ఇంజెన్లు ఎక్స్ పైరీ అయిపోయాయి కాబట్టి వాటిని వాడడానికి వీల్లేదని..మళ్లీ కొత్త ఇంజెక్షన్లు గ్వాలియర్ నుంచి తెప్పించే వరకూ రైడ్ చేయకుండా శివరాసన్ బస చేసిన ఇంటిబయటే సిట్ టీమ్, ఎన్ఎస్ జీ బృందాలు వేచి చూస్తూనే ఉండాల్సి వస్తుంది..ఇది కూడా చాలా ఆసక్తికరం,అనుమానాస్పదం కూడా..ఇలా.. రెండురోజులకు పైగా ఇంట్లోంచి బయటకు రాకుండానే..శివరాసన్ చివరికి తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అదే రైడ్ చేసి ఉంటే.. ప్రాణాలతో బయటపడేవాడు..కానీ సిట్ టీమ్ ఎందుకు ఇలా చేసింది అనేది ఎవరికీ అర్థం కాదు..
ఇలా ఎన్నెన్నో అంశాలతో ఈ వెబ్ సిరీస్ ను అత్యద్భుతంగా ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారు.. గతంలో మద్రాస్ కేఫ్ అనే సినిమా కూడా ఇదే ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి వచ్చింది..కానీ అందులో కథాంశం వేరు..రాజీవ్ మరణాన్ని ముందుగానే రా..అధికారులు గుర్తించి రాజీవ్ ను అప్రమత్తం చేసినప్పటికీ ఆయన కచ్చితంగా మీటింగ్ కు వెళ్లాల్సిందేనని పట్టుబట్టినట్టుగా చూపిస్తారు..అలాగే రాజీవ్ ని హత్య చేయాలనేది కేవలం ఎల్టీటీటీఈ నిర్ణయం మాత్రమే గాక.. ఒక ఇంటర్నేషనల్ కార్పోరేట్ సంస్థ కుట్ర కూడా ఉందనేది ఆ సినిమా సారాంశం.. తమ కంపెనీ ఇండియాలో పెట్టుబడులపై రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు అనేక ఆంక్షలు విధించడం, ఆయన మళ్లీ జరగబోయే ఎన్నికల్లో ప్రదాని అయితే తమ మనుగడ కష్టమవుతుందనే కారణంతో ఆ కార్పోరేట్ సంస్థ ఎల్టీటీటీఈతో చేతులు కలిపి లండన్ లోని మద్రాస్ కేఫ్ లోసమావేశమై రా జీవ్ ను హత్యచేసే ప్లాన్ వేసిందనేది మద్రాస్ కేఫ్ సినిమా సారాంశం.. కానీఈ వెబ్ సిరీస్ లో అసలు మద్రాస్ కేఫ్ ప్రస్తావన గానీ, కార్పోరేట్ కంపెనీ ఇన్వాల్వ్ మెంట్ అస్సలు ఎక్కడా ఉండదు. శ్రీలంకలో తమిళ ఈలంకు, సింహళీయులకు మధ్య జరుగుతున్న పోరాటంలో…భాగంగా శాంతిదళం పేరుతో వేలాది మంది సైన్యాన్ని జాఫ్నాకు పంపి..ఎల్టీటీటీఈ సైన్యాన్ని రాజీవ్ గాంధీ చంపిచారనే ఆగ్రహం,అలాగే మళ్లీ ఆయన ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానమంత్రి అయ్యే అవకాశముందనే నేపథ్యంలోనే ఆయన్ను హత్య చేయాలని టైగర్ ప్రభాకరన్ భావించి శివరాసన్ ను తమిళనాడుకు పంపి హ్యూమన్ బాంబర్ ఆపరేషన్ చేయించినట్టుగా వెబ్ సిరీస్ లో చూ పెంచారు..
1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన నాటికి నా వయసు బహుసా.. 9ఏళ్లు ఉంటాయేమో.. నిజానికి అప్పటికి నాకు రాజీవ్ గాంధీ అంటే బహుశా పెద్దగా తెలీదు..అప్పటికి నేను ఆరోతరగతి చదువుతున్నాను..మరుసటి రోజు ఈనాడు పేపర్లో రాజీవ్ హత్యఘటనను చదువుతూ ఇద్దరు మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు..అప్పుడే వాళ్ల చేతుల్లో ఉన్న పేపర్ చూశాను.. అందులో రాజీవ్ గాంధీ కాలు, బూటు మాత్రం కనిపిస్తున్నాయి..నిజానికి నాకు అవేమీ పెద్దగా అర్థం కాలేదు.. ఎవరో చనిపోయారని మాత్రం అర్థం చేసుకున్నాను.. ఇన్నేళ్ల తర్వాత రాజీవ్ హత్యకు గల కారణాలపై ఈ వెబ్ సిరీస్ లో ఓపికగా అన్ని గంటల పాటు చూశాను.. నిజంగా చాలా బాగుంది.. సోనిలివ్ లో తెలుగులోనే ఉంది హంట్..సిరీస్…
– అశోక్ వేములపల్లి