Ramayana: ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో, అత్యంత భారీ బడ్జెట్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సినిమాని తెరకెక్కించడం కంటే సినిమాలో నటించే నటీనటులకు పారితోషికాలకే (Remuneration)అధిక బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా సినిమా అంటే ఇతర భాష నటీనటులందరూ కూడా భాగమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశాయి. అయితే త్వరలోనే రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం రామాయణ(Ramayan).
రామాయణం ఆధారంగా…
ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రాముడిగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor)నటించబోతున్నారు. ఇక సీత పాత్రలో నటి సాయి పల్లవి(Sai Pallavi) నటించగా రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యశ్ (Yash)నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో యష్ విలన్ పాత్రలో నటించడం విశేషం. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న యశ్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే రామాయణ సినిమాకు కూడా ఈయన భారీగానే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని సమాచారం.
15 నిమిషాల స్క్రీన్ స్పేస్..
ఇకపోతే తాజాగా ఈయన పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామాయణం మొదటి భాగంలో యశ్ కేవలం 15 నిమిషాలు మాత్రమే తెరపై కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలోకి ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. రామాయణం సినిమా రెండు భాగాలుగా రాబోతున్న నేపథ్యంలో మొదటి భాగంలో రాముడు వనవాసం వెళ్ళకముందు ఉండే సన్నివేశాలను చూపించబోతున్నారని, అందుకే మొదటి భాగంలో యశ్ కు సంబంధించిన సీన్లు ఎక్కువగా లేవని సమాచారం. ఇక రెండవ భాగంలో యశ్ కు పూర్తిస్థాయిలో స్క్రీన్ స్పేస్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ 15 నిమిషాల సమయానికే ఈయన భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్…
ఇకపోతే కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్న యష్ కేజీఎఫ్ సినిమా(KGF Movie) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత యశ్ టాక్సిక్ సినిమా షూటింగ్ షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా కూడా త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రామాయణ సినిమా పూర్తి అయిన తర్వాత ఈయన తిరిగి కేజిఎఫ్ 3 సినిమా పనులలో బిజీ కాబోతున్నట్టు సమాచారం. ఇక రామాయణ సినిమా మొదటి భాగం వచ్చేయడాది దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతుందని ఇటీవల చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు.
Also Read: విమాన ప్రమాదంలో వేణుస్వామి భార్య.. దేవుడిపైనే భారం అంటూ!