Shimla News: హిమాచల్ ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువకుడు 65 ఏళ్ల బామ్మపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సిమ్లాలోని రోహ్రు పట్టణంలో 65 ఏళ్ల వృద్ధురాలు భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది. అయితే వారం రోజుల క్రితం తన మనవడు ఆమె దగ్గరకు వచ్చాడని పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది. అనంతరం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తన మనవడు బెదరించాడని ఫిర్యాదులో తెలిపింది.
దీంతో పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ల కింద 64(2), 332(బీ), 351(3) కింద యువకుడిపై కేసు నమోదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ప్రణవ్ చౌహాన్ తెలిపారు.
మహారాష్ట్రలో మరో దారుణ ఘటన జరిగింది. పెళ్లి సాకుతో మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేశాడు. 26 ఏళ్ల యువకుడు పెళ్లి పేరుతో మహిళపై పలు సార్లు అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. థానేలోని బీవండిలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అష్రప్ ఆఫ్సర్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు దుబాయ్ కి పారిపోవాలని ప్రయత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు. 25 ఏళ్ల యువతి వారం రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
నిందితుడు, మహిళతో ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్నాడని.. అనంతరం వాళ్ల మధ్య స్నేహం.. పెళ్లి వరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి.. పలు మార్లు అత్యాచారం చేశాడని చెప్పారు. 2024 జూన్, జులై నెలల్లో వివిధ ప్రదేశాల్లోకి తీసుకెళ్లి నిందితుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో దేశంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. వీటిపై ప్రభుత్వాలు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలు రావాలని కోరుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.
ALSO READ: NHPC Recruitment: గుడ్ న్యూస్.. ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగం.. జస్ట్ ఈ అర్హత ఉంటే చాలు