BigTV English
Advertisement

Unstoppable with NBK Ram Charan: ట్విస్ట్ లన్నీ పార్ట్ 2 లోనే.. ఆ ఫోన్ కాల్స్ గమనించారా..?

Unstoppable with NBK Ram Charan:  ట్విస్ట్ లన్నీ పార్ట్ 2 లోనే.. ఆ ఫోన్ కాల్స్ గమనించారా..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలకృష్ణ (Balakrishna). ఇటీవలే 50 వసంతాలు కూడా పూర్తి చేసుకున్నారు. ఒకవైపు నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. అంతేకాదు రాజకీయ నాయకుడిగా కూడా హ్యాట్రిక్ విజయాలు అందుకుంటూ ప్రజల మన్ననలు పొందారు. ఇక అలాగే ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే అంటూ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి, హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షో దేశంలో నెంబర్ వన్ షోగా నిలిచి.. మంచి టీఆర్పీ రేటింగ్ ను కూడా సొంతం చేసుకుంది. దీంతో బాలయ్య కూడా హోస్ట్ గా సక్సెస్ అయిపోయారు.అందులో భాగంగానే 4వ సీజన్ నడుస్తోంది. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్ హీరోలు, తమ సినిమా ప్రమోషన్స్ ను ఈ వేదికగా జరుపుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ (Ram Charan) ఈ సీజన్ 9వ ఎపిసోడ్ కి ఇచ్చేశారు.


అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న రామ్ చరణ్..

ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన తర్వాత నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు (Dilraju) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి(Anjali), కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు ఎస్.జె. సూర్య (SJ.Surya), శ్రీకాంత్ (Srikanth) తదితర భారీ తారాగణం కూడా భాగమైంది. ఇదిలా ఉండగా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, బాలయ్య అన్ స్టాపబుల్ షో కి హాజరయ్యారు. అందులో భాగంగానే అటు ఫ్యామిలీ , ఇటు సినిమా, అటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది.


అసలు ట్విస్ట్ లన్నీ పార్ట్2లోనే..

ఇక తొమ్మిదవ ఎపిసోడ్ మొదటి పార్ట్ నిన్న విడుదల చేయగా ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఇది శాంపుల్ మాత్రమే అని, అసలు ట్విస్ట్ లన్నీ రెండవ పార్ట్ లో ఉంటాయని బాలయ్య చెప్పడంతో ఇక రెండవ పార్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ముఖ్యంగా రామ్ చరణ్ సన్నిహితులైన శర్వానంద్ (Sharwanand) రావడం, ప్రభాస్(Prabhas )కు బాలయ్య ఫోన్ చేసి అసలు రహస్యాలు బయటకు లాగే ప్రయత్నం చేస్తారని.. రామ్ చరణ్ మొదటి పార్ట్ లో చెప్పని ఎన్నో విషయాలు, రహస్యాలను ఆ ఇద్దరి స్నేహితుల ద్వారా బయటకు లాగే ప్రయత్నం చేయబోతున్నారని సమాచారం.

షో లో పాల్గొన్న రామ్ చరణ్ ఫ్రెండ్స్..

అంతేకాదు రెండవ పార్ట్ లో రామ్ చరణ్ సన్నిహితుడైన శర్వానంద్ తో పాటు మరో మిగతా స్నేహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు, ఇటీవలే ఒక ప్రోమో కూడా విడుదల చేశారు. అంతేకాదు రామ్ చరణ్ కు అత్యంత ఇష్టమైన ఆయన పెట్ డాగ్ రైమ్ (Ryme) కూడా ఈ షోలో సందడి చేశారు. ఇప్పటికే టుస్సాడ్ మ్యూజియంలో రామ్ చరణ్ తో పాటు ఈ రైమ్ కూడా మైనపు విగ్రహాన్ని పొంది సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇలా ఈ విషయాలన్నీ కూడా మనకు పార్ట్ 2 లోనే తెలియబోతున్నాయని సమాచారం. మొత్తానికైతే రామ్ చరణ్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో విషయాలను అభిమానులకు తెలియజేయబోతున్నారని చెప్పవచ్చు.

Related News

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Big Stories

×