OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు, ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో సినిమాలు చూడకపోయినా, ఓటిటిలో మాత్రం చూసి ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. వీటిలో హాలీవుడ్, కొరియన్, మలయాళం సినిమాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. ఒక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ మలయాళం పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రామలీల’ (RamaLeela). దీనికి అరుణ్ గోపీ దర్శకత్వం వహించారు. ఇందులో దిలీప్, రాధిక, ప్రయాగ మార్టిన్, ముఖేష్, కళాభవన్ షాజోన్, విజయరాఘవన్, సిద్ధిక్ నటించారు. ములకుప్పాడం ఫిలింస్ పతాకంపై తోమిచన్ ములకుపాడు ఈ మూవీని నీమయించారు. ఈ మూవీ ఒక పొలిటికల్ మర్డర్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
రామముని అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అవుతాడు. కొన్ని కారణాలవల్ల ఆ పార్టీతో విభేదాలు రావడంతో రాజీనామా చేస్తాడు. ఆ తరువాత ప్రతిపక్ష పార్టీలో చేరుతాడు. రామముని తల్లి మాత్రం అధికార పార్టీలోనే ఉంటుంది. తండ్రి రాజకీయ గొడవల్లో చనిపోయి ఉంటాడు. ప్రతిపక్ష పార్టీలో చేరడం వలన రామమునిని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. వారిలో మోహనన్ అనే వ్యక్తి ఎక్కువగా రామమూర్తితో గొడవ పడుతుంటాడు. రామముని రాజీనామా చేయడంతో, అ ప్రాంతంలో బై ఎలక్షన్స్ వస్తాయి. అధికార పార్టీ రామముని తల్లిని పోటీగా దింపుతుంది. ప్రతిపక్ష పార్టీ రామమునిని పోటీలో నిలబడుతుంది. ఇలా వీళ్ళిద్దరూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. రామముని ఫుట్బాల్ గ్రౌండ్లో ప్రచారం చేయడానికి వస్తాడు. అదే సమయంలో గ్రౌండ్లో ఉన్న మోహన్ కింద పడిపోతాడు. అతనిని సైలెన్సర్ రివాల్వర్ తో కాల్చి ఉంటారు.
పోలీసులు ఎంక్వయిరీ చేయడం మొదలుపెడతారు. ఆ ఎంక్వయిరీ లో మోహన్ ని ఘాట్ చేసిన గన్ రామమునిదిగా తెలుసుకుంటారు. అతన్ని అరెస్టు చేయాలనుకున్న పోలీసులకు, రామముని పారిపోయి షాకిస్తాడు. ఆ తరువాత తనకు తెలిసిన వ్యక్తి ఎలీనా అనే రిపోర్టర్ దగ్గరికి వస్తాడు. ఆమె రామమూర్తిని ఒక బంగ్లాలో దాచిపెడుతుంది. వాళ్లు మాట్లాడే మాటలు సీక్రెట్ గా కెమెరాలు పెట్టి వింటూ ఉంటుంది. ఎందుకంటే ఎలీనా ఒక ఛానల్ ని పెట్టాలనుకుంటుంది. రామముని అసలు విషయాలు చెప్తే, వాటిని తన చానల్ లో పెట్టాలనుకుంటుంది. చివరికి మోహనన్ ని చంపింది ఎవరు? పార్టీ వాళ్లే నమ్మకద్రోహం చేశారా? రామముని నిర్దోషిగా బయటపడతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘రామలీల’ (RamaLeela) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.