BigTV English

OTT Movie : మేధావులు కూడా చేయలేని పని చేసే కూలోడు… ఇంత టాలెంట్ గా ఉన్నాడేంటి భయ్యా ….

OTT Movie : మేధావులు కూడా చేయలేని పని చేసే కూలోడు… ఇంత టాలెంట్ గా ఉన్నాడేంటి భయ్యా ….

OTT Movie : హాలీవుడ్ సినిమాలంటే గుర్తుకు వచ్చేది, మొదటగా యాక్షన్ సినిమాలు మాత్రమే. అయితే హాలీవుడ్ నుంచి వచ్చే కొన్ని ఫీల్ గుడ్ సినిమాలు మనసుని ఎంతో కొంత ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరో సైకలాజికల్ గా వీక్ గా ఉంటాడు. అయితే అతని టాలెంట్ మాత్రం మరో లెవల్ ల్లో ఉంటుంది. ఈ రెండిటి మధ్య మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘గుడ్ విల్ హంటింగ్’ (Goodwill hunting). ఈ మూవీకి గుస్ వాన్ సాంట్ దర్శకత్వం వహించారు. ఇందులో రాబిన్ విలియమ్స్, డామన్, అఫ్లెక్, స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్, మిన్నీ డ్రైవర్ నటించారు. ఈ మూవీ విల్ హంటింగ్ అనే గణిత మేధావి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుని, $10 మిలియన్ల బడ్జెట్‌తో థియేటర్లలో ప్రదర్శించగా $225 మిలియన్లకు పైగా వసూలు చేసింది. 70వ అకాడెమీ అవార్డ్స్‌లో, ఇది ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడుతో సహా తొమ్మిది విభాగాల్లో నామినేషన్లు అందుకుంది. రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డ్ లను గెలుచుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా విలియమ్స్‌కు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో డామన్‌లకు లభించింది. ది హాలీవుడ్ రిపోర్టర్ “100 ఇష్టమైన చిత్రాల” జాబితాలో 53వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

విల్ హంటింగ్ ఒక కాలేజ్ లో ఫోర్ క్లీనర్ గా పనిచేస్తుంటాడు. అదే కాలేజ్ లో జెరాల్డ్ అనే వ్యక్తి ప్రొఫెసర్ గా టీచింగ్ చేస్తుంటాడు. ఒకసారి చాలా కష్టమైన మ్యాథ్స్ ఫార్ములా చేయమని పిల్లలకు చెప్తాడు. నిజానికి దానిని సాల్వ్ చేయాలంటే మేధావులకి కూడా సంవత్సరం పాటుపడుతుంది. కాలేజ్ బయట కూడా ఒక బోర్డులో ఆ మ్యాథ్స్ ఫార్ములా ఉంటుంది. దానిని హీరో అవలీలగా సాల్వ్ చేస్తాడు. బోర్డు మీద ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసిన వ్యక్తి ఎవరని ఆశ్చర్యపోతాడు జెరాల్డ్. దానిని అక్కడ పనిచేసే విల్ అనే వ్యక్తి సాల్వ్ చేశాడని తెలుసుకుంటాడు. అతనితో మాట్లాడేలోగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విల్. ఒక వ్యక్తితో రోడ్డు మీద గొడవ పడటంతో విల్ ని పోలీసుల అరెస్టు చేస్తారు. పోలీస్ స్టేషన్లో ఉన్న విల్ ని జెరాల్డ్ విడిపిస్తాడు. అతని టాలెంట్ ని గుర్తిస్తాడు కాని ముందుగా అతనికి, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటాడు. కొంతమంది డాక్టర్ల దగ్గరికి విల్ ని తీసుకువెళ్తాడు. వాళ్లందరికీ కోపం తెప్పిస్తూ ఉంటాడు విల్. ఆ డాక్టర్లు ఇతనికి ట్రీట్మెంట్ చేయమని చెప్పి వెళ్ళిపోతుంటారు. చివరికి షాన్ అనే వ్యక్తి దగ్గరికి, సైకలాజికల్ ట్రీట్మెంట్ కి తీసుకువస్తాడు జెరాల్డ్.

అతనితో కూడా కోపం తెప్పించే విధంగా మాట్లాడుతాడు విల్. కోపాన్ని కంట్రోల్ చేసుకుని షాన్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అలా షాన్ విల్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. నిజానికి విల్ కి చిన్నప్పటినుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ. చిన్నప్పుడు అతనిపై స్టెప్ ఫాదర్ క్రూరంగా ప్రవర్తించి ఉంటాడు. ఆ ఎఫెక్ట్ విల్ కి పెద్దయ్యాక కూడా ఉంటుంది. ఎవరైనా క్లోజ్ గా ఉంటే, దూరమైపోతారేమోనని భయపడుతూ ఉంటాడు. అలాగే ప్రేమలో పడ్డ అమ్మాయిని కూడా దూరం చేసుకుంటాడు. ఈ మూవీలో డాక్టర్, పేషంట్ సన్నివేశాలు మరో లెవల్ ల్లో ఉంటాయి. హీరోకి ఉన్న టాలెంట్ ని చూసి కొంతమంది, వీడి జీవితం ఇలా ముగిసిపోకూడదని అనుకుంటారు. చివరికి డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ హీరోకి ఉపయోగపడుతుందా? ప్రేమించిన అమ్మాయిని మళ్లీ కలుస్తాడా ? విల్ తన లైఫ్ని ఎలా సాగించాలనుకుంటాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : భర్తను వదిలేసి ఆటగాడితో ఆంటీ అరాచకం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఏం సినిమారా బాబూ… 50 కోట్లు పెడితే 550 కోట్లకుపైగా కలెక్షన్స్… ఓటీటీలోకి థియేటర్లలో దుమ్మురేపిన రొమాంటిక్ మూవీ

OTT Movie : పేరుకే 118 ఏళ్ల వృద్ధుడు… ముగ్గురమ్మాయిలతో లవ్ స్టోరీ… మైండ్ బెండయ్యే సై-ఫై మూవీ

OTT Movie : సైకో నుంచి మనుషుల్ని తినే మనిషి వరకు… ఒకే సినిమాలో 6 స్టోరీలు… గుండె గుభేల్మన్పించే హర్రర్ మూవీ

Friday OTT Movies : ఇవాళ ఓటీటీలోకి 17 చిత్రాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..!

Paradha OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movie : ఓనర్స్ ను చంపి అదే ఇంట్లో తిష్ఠ వేసే సైకో… పోలీసులను పరుగులు పెట్టించే కిల్లర్… క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్… చూసిన వాళ్ళను వదలకుండా ముక్కలు ముక్కలుగా నరికి… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

Big Stories

×