E-Paper
Advertisement

Rana Naidu 2 Trailer : రానా నాయుడు 2 ట్రైలర్ అవుట్… మొత్తానికి అది మార్చేశారు

Rana Naidu 2 Trailer : రానా నాయుడు 2 ట్రైలర్ అవుట్… మొత్తానికి అది మార్చేశారు
Advertisement

Rana Naidu 2 Trailer :ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), పాన్ ఇండియా హీరో రానా(Rana ) ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ముఖ్యంగా ఈ సీరీస్ భారీ పాపులారిటీ అందుకున్నప్పటికీ.. ఒక వర్గం వారిచేత విమర్శలు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఇప్పుడు తొలి భాగానికి కొనసాగింపుగా రెండవ సీజన్ కూడా రాబోతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో జూన్ 13వ తేదీ నుంచి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సీజన్ 2 ట్రైలర్ ని నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ అధ్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తొలి సీజన్ కి మించిన వినోదంతో పాటు థ్రిల్ ని కూడా పంచడానికి ఈ సీజన్ 2 సిద్ధమైనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇకపోతే ఈ క్రేజీ సిరీస్ కి సుపర్ణ్ వర్మ, అన్షుమాన్, అభయ్ చోప్రా దర్శకత్వం వహించగా.. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ మీడియా నిర్మిస్తున్నారు. అర్జున్ రాంపాల్, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్ , కృతికర్బంధ, సుర్విన్ చావ్లా, డినో మోరియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా.. ఈ ట్రైలర్ చూస్తే మనకు స్పష్టంగా అర్థం అవుతున్న విషయం ఏమిటంటే.. ఫస్ట్ సీజన్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని తగ్గించి యాక్షన్ సీన్స్ ఎక్కువ పెట్టారు. మొత్తానికైతే సీజన్1 ప్రభావం తర్వాత సీజన్ 2 లో చాలా వరకు మార్పులు చేశారని తెలుస్తోంది.

ట్రైలర్ ఎలా ఉందంటే ?

Advertisement

మొదటి భాగంలో విమర్శలు బాగా ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా స్టోరీని మార్చేసినట్టు అనిపిస్తుంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో నిండిపోయింది. అటు మధ్యలో వెంకటేష్ కాస్త కామెడీ చేసినా.. ఇటు రానా చివర్లో వెంకటేష్ ఇద్దరూ కూడా ఎవరికి వారు తగ్గేదేలే అంటూ తమ యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. ఇకపోతే హిందీలో విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కూడా నిలిచింది.

వెంకటేష్ కెరియర్ లోనే తొలిసారి..

Advertisement

ఇకపోతే ఫ్యామిలీ హీరోగా పేరు సొంతం చేసుకున్న వెంకటేష్ తొలిసారి రానా నాయుడు వెబ్ సిరీస్ లో ఎవరు ఊహించని పాత్రలో నటించి బూతుల వర్షం కురిపించారు. ఇక ఈ వెబ్ సిరీస్ చూసిన వెంకటేష్ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంకీ మామేనా ఇలాంటి మాటలు మాట్లాడుతోంది అంటూ ఆశ్చర్యంతో పాటు విమర్శలు గుప్పించారు. ఇక ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ పెద్దగా హిట్ అవ్వదని చాలామంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా యువతకు భారీగా కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. దాంతో సీజన్ 2 కోసం ఎదురు చూడగా ఇప్పుడు మరికొన్ని రోజుల్లో సీజన్ 2 కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సీజన్ 2 కి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

ALSO READ:Kamal Haasan : హై కోర్టులో కమల్‌కు బిగ్ షాక్… నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా ఇక్కడ తగ్గాల్సిందే!

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×