E-Paper
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi OTT : రవితేజ సినిమాకు షాకింగ్ ఓటీటీ ధర… మరీ ఇంత తక్కువకా ?

Bhartha Mahasayulaku Wignyapthi OTT : రవితేజ సినిమాకు షాకింగ్ ఓటీటీ ధర… మరీ ఇంత తక్కువకా ?
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi OTT : గత కొంతకాలంగా మాస్ మహారాజాకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. అయినా సరే ఏమాత్రం వరుస పరాజయాలను పట్టించుకోకుండా రవితేజ ఏడాదికి ఒక్క సినిమాతో అయినా సరే ఆడియన్స్ ను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగా 2025లో ‘మాస్ జాతర’ అనే రవితేజ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. గత ఏడాది చేదు జ్ఞాపకాన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు కొత్త ఏడాది తనకు సెంటిమెంట్ గా భావించే సంక్రాంతికి కొత్త సినిమాతో వచ్చి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. కానీ ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో మాత్రం రవితేజ వెనకడుగు వేయక తప్పలేదు.

సంక్రాంతి సెంటిమెంటు రిపీట్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2026 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది ఈ మూవీ. దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌ తో, రవితేజ మళ్ళీ ఫుల్ ఎనర్జీతో కన్పించారు. ఈసారి కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని, మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే ఆలోచనలో ఉన్నారు రవితేజ అభిమానులు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించగా, సునీల్, వెన్నెల కిషోర్, సత్య వంటి స్టార్ కమెడియన్లు సినిమాలో నటిస్తున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి భార్య పాత్రలో, ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్ గా కనిపిస్తారు. కేతికా శర్మ గెస్ట్ రోల్‌ పోషిస్తోందని టాక్. డైరెక్టర్ కిషోర్ తిరుమల – రవితేజ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విక్రమ్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ తమన్ ఎస్ కంపోజ్ చేశాడు.

Advertisement

Read Also : తీరని కోరికలను తీర్చుకోవడానికి తిరిగి జన్మించే ఆత్మ… చిన్న పిల్లాడిగా పునర్జన్మ… సీను సీనుకో ట్విస్ట్

రవితేజ కెరీర్లోనే చీప్ డీల్

రవితేజ సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతుండడంతో ప్రస్తుతం ఆయన మార్కెట్ డౌన్ లో ఉంది. ఆయన పారితోషికం విషయంలో ఇప్పటికే ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీకి మాస్ మహారాజా రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని టాక్ నడుస్తోంది. నిజానికి కేవలం 35 కోట్ల అతి తక్కువ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇక రవితేజ ఈ సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రవితేజ వరుస డిజాస్టర్ల ఎఫెక్ట్, ఆయన రాబోయే సినిమాల ఓటీటీ డీల్స్ పై కూడా పడింది. అందులో భాగంగానే జీ5 (ZEE5) ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఊ నామమాత్ర ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే మూవీ రైట్స్ ఎంతకూ అమ్ముడయ్యాయి అన్న విషయం ఇంకా బయటకు రాలేదు. కానీ సమాచారం ప్రకారం రవితేజ కెరీర్‌లో అతి తక్కువ ధరకు అమ్ముడైన ఓటీటీ డీల్ ఇదే అని ట్రేడ్ టాక్. మూవీ శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీకి విక్రయించారు మేకర్స్. గత సినిమాలు ‘మాస్ జతార’ లాంటివి ఫ్లాప్ అవ్వడంతో అభిమానులు రవితేజను ఇప్పటికే ట్రోల్ చేస్తున్నారు. సరైన కథలను ఎన్నుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే తనకు అచ్చొచ్చిన ఫ్యామిలీ డ్రామాతో, సెంటిమెంట్ అయిన సంక్రాంతికి వస్తున్నాడు రవితేజ. కాబట్టి ఈసారి మాస్ మహరాజ్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీతో హిట్ కొట్టడం గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు ఆయన ఫ్యాన్స్. సంక్రాంతి సీజన్‌లో కంపీటీషన్ ఉంది. కానీ కంటెంట్ బాగుంటే వర్కౌట్ అవుతుంది. ఈ మూవీ రవితేజ కంబ్యాక్ అవుతుందా ? అనేది వెయిట్ అండ్ సీ.

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×