BigTV English

Rc16 : చరణ్, బుచ్చిబాబు సినిమా క్లైమాక్స్ లో ఇన్ని ట్విస్ట్ లా.. ఆ సినిమాను కాపీ కొట్టారా..?

Rc16 : చరణ్, బుచ్చిబాబు సినిమా క్లైమాక్స్ లో ఇన్ని ట్విస్ట్ లా.. ఆ సినిమాను కాపీ కొట్టారా..?

Rc16 : మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను పలకరించాడు.. భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాలతో వచ్చిన ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో రామ్ చరణ్ ఖాతాలో యావరేజ్ మూవీ పడింది.. త్రిబుల్ ఆర్ తర్వాత సోలో హీరోగా వచ్చిన ఈ మూవీ ఫాన్స్ ని నిరాశపరిచింది. కానీ ఈ మూవీలో చరణ్ నటించిన అప్పన్న పాత్రకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..


సినిమాకు బడ్జెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఆ సినిమా సూపర్ హిట్ టాక్ని అందుకుంటుంది. ఇటీవల అలాంటి సినిమాలే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామిని సృష్టిస్తున్నాయి. అయితే సినిమా కథ ఎలా ఉన్నా క్లైమాక్స్ మాత్రం అదిరిపోతే ఆ కిక్కే వేరు అంటున్నారు మేకర్స్. ఆకట్టుకోవాలంటే క్లైమాక్స్ తోనే ముడిపడి ఉంటుందని కొందరు ఓపెన్ గా తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ ఒక ఎత్తు అనేలా దర్శకులు కూడా సినిమాను ప్లాన్ చేస్తారు. అంతేకాదు.. క్లైమాక్స్ బాగుంటే సినిమాలు ఆడియన్స్ మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. ఇటీవల వచ్చిన రంగస్థలం, ఉప్పెన మూవీ క్లైమాక్స్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి..

అదే విధంగా డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ తో తీస్తున్న సినిమాలో క్లైమాక్స్ ను డైరెక్టర్ బుచ్చిబాబు క్రియేట్ చేయనున్నాడు. డిఫరెంట్ క్లైమాక్స్ ని చాలా కాలం పాటు గుర్తుండిపోయే విధంగా బుచ్చిబాబు డిజైన్ చేస్తున్నాడంటూ ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉండబోతుందని ఉప్పెన సినిమాలో లాగా సన్నివేశాలు ఉంటాయాని ఓ వార్త వినిపిస్తుంది.. ఈ వార్త విన్న రామ్ చరణ్ ఫాన్స్ ఉప్పెన సినిమాని కాపీ కొడుతున్నావా ఏంటి బుచ్చిబాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.


ఇక ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని డైరెక్టర్ బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో వింటేజ్‌ చరణ్ ని కూడా చూసేలా పాత తరం కెమెరాలతో సినిమా షూట్ చేయబోతున్నారట. శివరాత్రికి ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×