OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి రకరకాల భాషలతో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. రీసెంట్ గా వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇది ఒక మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఈ మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సాపలా’ (Saapala). ఈ మూవీకి నిఖిల్ లంజేకర్ దర్శకత్వం వహించాడు. ఒక సినిమా దర్శకుడు తన భార్యను చంపడానికి సినిమా స్టైల్ లో ప్లాన్ వేస్తాడు. ఆ తరువాత జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఉదయ్ సినిమా ఇండస్ట్రీలో ఫిలిం డైరెక్టర్ గా ఉంటాడు. ఇతనికి చిత్రా అనే భార్య ఉంటుంది. వీళ్లను చూసుకోవడానికి కౌశల్య అనే పనిమనిషి కొత్తగా వస్తుంది. అయితే కౌశల్యకి పూనకం వచ్చినట్టు మాట్లాడి, ఇంట్లో ఏదో హత్య జరుగుతుంది అని చెప్తుంది. దానికి తోడు భర్త ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. ఇదంతా చూసి ఇతని భార్య చిత్ర భయపడుతూ ఉంటుంది. దానికి తోడు భర్త ఇంటి ముందు గొయ్యి కూడా తీసుకుంటాడు. అది చూసి ఇంకా భయపడుతుంది. ఇతడు కొత్త సినిమాకి స్టోరీ కూడా రాస్తుంటాడు. అందుకు సహాయంగా తన ఫ్రెండ్ దీపక్ ని ఇంటికి పిలిపిస్తాడు. స్టోరీ రియాల్టిక్ గా ఉండాలని దీపక్ ని కుర్చీకి కట్టేస్తాడు. ఆ తర్వాత అతన్ని మర్డర్ చేస్తాడు. ఇదివరకే తీసిన గొయ్యిలో ఆ శవాన్ని పూడ్చి పెడతాడు. ఇదంతా చూసి చిత్ర బిత్తరపోతుంది. ఆ తరువాత ఆమె టెన్షన్ తో గుండె పోటు వచ్చి చనిపోతుంది.
ఆ తర్వాత దీపక్ గొయ్యిలో నుంచి లేచి వస్తాడు. నిజానికి ఇదంతా భార్య చనిపోవడానికి ప్లాన్ చేసి ఉంటాడు ఉదయ్. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా, ఆమెను గుండెపోటు వచ్చేలా ప్రేరేపిస్తాడు. ఇంట్లో ఉన్న పనిమనిషి కూడా మరి ఎవరో కాదు ఉదయ్ ప్రియురాలు. ఆమెతో యవ్వారం సాగిస్తూ ఉంటాడు ఉదయ్. వీళ్ళంతా కలసి చిత్రను చంపడానికి ప్లాన్ వేస్తారు. ఆ తర్వాత ఉదయ్ దీపక్ ను కూడా చంపేస్తాడు. చివరికి ఉదయ్ పోలీసులకు దొరుకుతాడా? ప్రియురాలితో జండా ఎత్తేస్తాడా? మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సాపలా’ (Saapala) అనే ఈ మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.