E-Paper
Advertisement

OTT Movie : మొగుడు పోతే మరిదితో… కూతురు ఎదురుగానే తల్లితో రోమాన్స్… ఇదేం సైకో సినిమా సామీ

OTT Movie : మొగుడు పోతే మరిదితో… కూతురు ఎదురుగానే తల్లితో రోమాన్స్… ఇదేం సైకో సినిమా సామీ
Advertisement

OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆత్రుతను పెంచుతాయి ఈ సినిమాలు. అందుకే చివరి వరకు ఈ సినిమాలను ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో తండ్రి కూతుర్ని చాలా స్ట్రాంగ్ గా పెంచుతాడు. అతను ఎందుకు అలా పెంచుతాడు అనేది స్టోరీ లోకి వెళ్తే తెలుస్తుంది. అయితే తన 18 వ ఏట తండ్రి చనిపోతాడు. ఆ తర్వాత స్టోరీ మలుపు తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

Advertisement

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘స్టోకర్’ (Stoker). 2013 లో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి పార్క్ చాన్-వూక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మియా వాసికోవ్స్కా, మాథ్యూ గూడె, నికోల్ కిడ్‌మాన్, డెర్మోట్ ముల్రోనీ, జాకీ వీవర్ నటించారు. స్టోకర్ 20 జనవరి 2013న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ఫాక్స్ సెర్చ్‌లైట్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో 1 మార్చి 2013న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హీరోయిన్ తన తండ్రితో కలిసి వేటకు వెళుతూ ఉండేది. ఒకరోజు ప్రమాదంలో హీరోయిన్ తండ్రి చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి బాబాయ్ వస్తాడు. అతని ప్రవర్తన చాలా తేడాగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు అతన్ని హీరోయిన్ చూసి ఉండదు. ఇప్పుడు అతడు హీరోయిన్ ఫ్యామిలీ చూసుకోవడానికి వచ్చాడు. వచ్చినవాడు హీరోయిన్ తో ఎక్కువగా సమయం గడపాలని ట్రై చేస్తుంటాడు. అతని గురించి తెలుసుకోవాలని హీరోయిన్ ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆమెకు నమ్మశక్యం కాని విషయాలు తెలుస్తాయి. తన తండ్రికి ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారని హీరోయిన్ తెలుసుకుంటుంది. అయితే చివరివాడు ఏమయ్యాడు అని బాబాయ్ ని అడుగుతుంది. అప్పుడు అతడు జరిగిన విషయం చెప్తాడు. నిజానికి హీరోయిన్ తండ్రికి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. మూడవవాడు హీరోయిన్ తండ్రితో ఎక్కువగా గడుపుతుండటంతో, అది చూసి తట్టుకోలేక రెండవ వాడు అతన్ని చంపేస్తాడు. ఆ చంపిన వ్యక్తి ఇప్పుడు ఇంటికి వచ్చిన వ్యక్తి ఒక్కడే.

అలా చేసినందుకు అతన్ని చిన్నప్పటినుంచి మానసిక హాస్పిటల్లో ఉంచుతారు. ఆ తర్వాత తన ఇంటికి తీసుకురావడానికి భయపడ్డ హీరోయిన్ తండ్రి, అతనికి వేరొక ఇంటిలో ఉండమని చెప్తాడు. ఇప్పుడు తండ్రి చనిపోవడంతో బాబాయ్ తన ఇంట్లోనే ఉంటాడు. హీరోయిన్ తల్లితో కూడా ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. ఇది కనులారా చూసిన హీరోయిన్ ఆలోచనలో పడుతుంది. తన తండ్రి వేటాడటం ఎందుకు నేర్పించాడో అర్ధం చేసుకుంటుంది. చివరికి హీరోయిన్ అతన్ని ఎలా ఎదుర్కుంటుంది? ఆ సైకో హీరోయిన్ ను ఏం చేస్తాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘స్టోకర్’ (Stoker) అనే ఈ మూవీని చూడండి.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×