OTT Movie : ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న హారర్ సినిమాలను చూసి మూవీ లవర్స్ బాగా థ్రిల్ అవుతూ ఉంటారు. వెన్నులో వణుకు పుట్టించే ఈ సినిమాలు చూడటానికి ధైర్యం కాస్త ఎక్కువే కావాలి. అందులోనూ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగానే భయపెడతాయి. ఈ సినిమాలను ఒంటరిగా చూసే ధైర్యం చేస్తే పై ప్రాణాలు పైకి పోతాయి. అటువంటి గూస్ బంప్స్ తెప్పించే ఒక ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సాతాన్స్ స్లేవ్‘ (Satan’s Slaves 2). 2022 లో వచ్చిన ఈ ఇండోనేషియా అతీంద్రియ మూవీకి జోకో అన్వర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 1980 లో వచ్చిన సాతాన్ స్లేవ్ కు సీక్వెల్ గా, 2017లో పార్ట్ 2 వచ్చింది. IMAX ఫార్మాట్‌లో విడుదలైన మొదటి ఇండోనేషియా మూవీగా బాక్సాఫీస్ హిట్ గా మొదటి స్థానంలో నిలిచింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ తన ఫ్యామిలీ తో కలసి ఊరికి దూరంగా ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఉంటుంది. అయితే అపార్ట్మెంట్లో ఇదివరకే చాలా ఘోరాలు జరిగి ఉంటాయి. ఒకప్పుడు అందులో చాలామంది చనిపోయి ఉంటారు. అక్కడ కొన్ని ఆత్మలు కూడా తిరుగుతూ ఉంటాయి. అయితే హీరోయిన్ చదువుకోవడానికి స్కూల్ లో స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది. కుటుంబ ఆర్టిక పరిస్థితి కారణంగా చదువు కొనసాగించాలా, లేదా అనే ఆలోచనలో పడుతుంది హీరోయిన్. ఈ క్రమంలో ఆ అపార్ట్మెంట్లో విష్ణు అనే పిల్లాడికి ఆత్మలు కనపడుతూ ఉంటాయి. ఒకరోజు లిఫ్ట్ లో వెళ్తుండగా విష్ణు మినహా, మిగతా వ్యక్తులు చనిపోతారు. విష్ణు ఒంటరి అవ్వడంతో, ఆ పిల్లాడిని హీరోయిన్ తనతోనే ఉండమంటుంది. అయితే ఈ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆత్మలతో, ఒక మంత్రగత్తెకి సంబంధం ఉంటుంది.
ఈ విషయం హీరోయిన్ కి కొద్దిరోజుల తరువాత అర్థమవుతుంది. ఆ అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేయాలని అనుకుంటున్నా, తుఫాన్ రావడంతో విరమించుకుంటుంది హీరోయిన్. మరి కొద్ది రోజుల్లో ఆ అపార్ట్మెంట్ లో, పెద్ద ఘోరం జరగబోతుందని తెలుసుకున్న హీరోయిన్ చివరికి ఏమి చేస్తుంది? అపార్ట్మెంట్ నుంచి బయట పడుతుందా? అపార్ట్మెంట్ కి, మంత్రగత్తెకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సాతాన్స్ స్లేవ్’ (Satan’s Slaves 2) అనే ఈ హారర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి. వెన్నులో వణుకు పుట్టించే ఈ మూవీని ఒంటరిగా మాత్రం చూసే ధైర్యం చేయకండి.