OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న కొరియన్ సినిమాలకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. కరోనా సమయంలో టైం పాస్ కోసం చూసిన ఈ కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఈ సినిమాలను చూసే వ్యూవర్స్ ఎక్కువయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ మూవీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో వచ్చింది. ఈ మూవీ ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది? ఈ మూవీ పేరేమిటి? వివరాల్లోకి వెళితే…
హెచ్ బి ఓ మ్యాక్స్ (HBO Max) లో
ఈ కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫాలోయింగ్‘ (Following). ఈ మూవీలో హీరో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. అయితే ఆ అమ్మాయి అనుకోకుండా ఒక రోజు రక్తపుమడుగులో చనిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి మర్డర్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ హెచ్ బి ఓ మ్యాక్స్ (HBO Max) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఇతడి పని ఖాళీగా ఉన్న ఫ్లాట్స్ అమ్మి పెట్టడం. అయితే హీరోకి ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంటుంది. ఫ్లాట్స్ అమ్మి పెడతామంటూ చెప్పి ఆ ఇంటి కీ తీసుకుంటాడు. అందులో తనకు నచ్చిన వస్తువును తీసుకొని, తన రూమ్లో భద్రపరుచుకుంటాడు. ఈ హ్యాబిట్ వల్ల హీరో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఇతనికి సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ప్రొఫైల్ బాగా నచ్చుతుంది. ఆమె ఎవరో తెలుసుకొని, ఫాలో అవుతూ ఉంటాడు హీరో. ఒకరోజు ఆ అమ్మాయి హీరోని వెతుక్కుంటూ అతని ఆఫీసుకు వస్తుంది. ఆమెని ఫాలో చేస్తున్నానని తెలిసి తిట్టడానికి వస్తుందని అనుకుంటాడు హీరో. అయితే ఆమె ఫ్లాట్ ని వేరొకరికి విక్రయించాలని అతని ఆఫీసుకి వస్తుంది. అయితే ఆమె గురించి తెలుసుకోవాలని, ఆమె ఉండే ఇంటికి ఒకరోజు వెళ్ళి షాక్ అవుతాడు హీరో.
అప్పుడే అక్కడ ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటాడు హీరో. ఈ కేసును ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అయితే చివరిగా హీరోతో ఆమె మాట్లాడి ఉండటంతో, అతని మీద అనుమానం పెంచుకుంటాడు పోలీస్ ఆఫీసర్. అక్కడ జరిగిన విషయం ఫోటోల రూపంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి హీరోకి పంపిస్తాడు. అప్పుడు హీరోకి అర్థమవుతుంది చంపింది ఈ ఫోటోలు పంపించిన వ్యక్తి అని. చివరికి హీరో ఆ మర్డర్ చేసిన వ్యక్తిని కనిపడతాడా? పోలీసులు హీరోని అరెస్ట్ చేస్తారా? హీరోయిన్ ఎలా చనిపోయి ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే హెచ్ బి ఓ మ్యాక్స్ (HBO Max) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కొరియన్ ‘ఫాలోయింగ్’ (Following) అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.