Pedicure At Home: చలికాలంలో మనం మన శరీరంతో పాటు ముఖ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము కాని మన పాదాలను మాత్రం అంతగా పట్టించుకోము. ఈ సీజన్‌లో మీ పాదాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. చలి కారణంగా పాదాలు చాలా పొడిగా, నిర్జీవంగా కనిపించడం మొదలవుతాయి. అంతే కాకుండా మడమల పగుళ్లు కూడా ప్రారంభమవుతాయి. అందుకే చలికాలంలో కూడా పాదాలకు జాగ్రత్త అవసరం.
ఈ సీజన్‌లో పాదాల సంరక్షణకు పెడిక్యూర్ మంచి మార్గం. కానీ పార్లర్‌లో పెడిక్యూర్ చేసుకుంటే ఎక్కవ ఖర్చు అవుతుంది. సమయం కూడా తీసుకుంటుంది. అయితే ఇంట్లోనే పెడిక్యూర్ చేయడం ద్వారా మీ పాదాలను మృదువుగా, అందంగా ఎలా మార్చుకోవచ్చు. 6 దశలలో ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెడిక్యూర్ అనేది పాదాలను అందంగా మార్చడానికి ఒక మార్గం. ఇందులో పాదాలను పూర్తిగా శుభ్రపరచడం జరుగుతుంది. దీని ద్వారా కాళ్లపై ఉన్న మృతకణాలు తొలగిపోయి గోళ్లకు చక్కని రూపాన్ని ఇచ్చి పాదాలు అందంగా తయారవుతాయి.
పెడిక్యూర్ కోసం కావలసినవి:
నెయిల్ క్లిప్పర్స్
నెయిల్ ఫైల్
నెయిల్ పాలిష్ రిమూవర్
క్యూటికల్ క్రీమ్
క్యూటికల్ పషర్
కాటన్
ఫుట్ సోక్ టబ్
ప్యూమిస్ స్టోన్
ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్
టవల్
స్టెప్-1 నెయిల్ పాలిష్ తొలగించండి:
పెడిక్యూర్ చేయడానికి ముందుగా మీ పాదాలకు ఉన్న నెయిల్ పాలిష్‌ని తొలగించండి. ఆరోగ్యకరమైన గోళ్ల కోసం మీరు ఆల్కహాల్ లేని నెయిల్ రిమూవర్‌లను ఉపయోగించవచ్చు. నెయిల్ రిమూవర్‌లు ముదురు రంగులపై ప్రభావవంతంగా ఉండవు.
స్టెప్-2 పాదాలను నానబెట్టడం:
నెయిల్ పాలిష్ తొలగించిన తర్వాత గోరువెచ్చని నీటితో ఒక టబ్ నింపి అందులో లిక్విడ్ సోప్ వేయండి. ఇప్పుడు మీ పాదాలను ఈ సబ్బులో 15 నిమిషాలు నానబెట్టండి. వేడి నీరు పాదాలపై చనిపోయిన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా దానిని తొలగించడం సులభం అవుతుంది. మీ పాదాలను ప్యూమిస్ స్టోన్‌తో రుద్దండి. ఫలితంగా చనిపోయిన చర్మాన్ని తొలగించండి.
స్టెప్-3 నెయిల్ ట్రిమ్మింగ్:
15 నిమిషాల తర్వాత నీటి నుండి పాదాలను తీసి వాటిని పూర్తిగా తుడవండి. ఇప్పుడు నెయిల్ ఫైలర్ , నెయిల్ క్లిప్పర్ సహాయంతో మీ గోళ్లకు చక్కని ఆకృతిని ఇవ్వండి.
స్టెప్-4 ఎక్స్‌ఫోలియేటింగ్:
మీ గోళ్లను షేప్ చేసిన తర్వాత గోళ్లపై క్యూటికల్ క్రీమ్‌ను రాసి మీ పాదాలను కాసేపు అలాగే ఉంచండి. క్యూటికల్ క్రీమ్ దాని ప్రభావాన్ని చూపే వరకు ప్యూమిస్ స్టోన్ సహాయంతో మీ పాదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయండి. దీని కోసం మంచి స్క్రబ్ ఉపయోగించండి. ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియలో పాదాల యొక్క అన్ని మృతకణాలు తొలగించబడతాయి. దీని కారణంగా పాదాలు శుభ్రంగా , అందంగా కనిపించడం ప్రారంభిస్తాయి.
స్టెప్-5 పుష్ క్యూటికల్:
ఎక్స్‌ఫోలియేషన్ తర్వాత క్యూటికల్ క్రీమ్‌ను తుడిచి క్యూటికల్ పషర్ సహాయంతో క్యూటికల్స్‌ను వెనక్కి నెట్టండి. ఇలా చేయడం వల్ల గోళ్లకు గుండ్రటి ఆకారం రావడంతోపాటు గోళ్లు అందంగా కనిపిస్తాయి.
Also Read: ఈ ఫేస్‌ప్యాక్ ఒక్కసారి వాడినా చాలు.. గ్లోయింగ్ స్కిన్
స్టెప్-6 మాయిశ్చరైజింగ్:
చివరి దశ మాయిశ్చరైజింగ్. మంచి ఫుట్ కేర్ క్రీమ్ సహాయంతో మీ పాదాలకు మసాజ్ చేయండి. మాయిశ్చరైజింగ్ క్రీమ్ పాదాలను కోమలంగా మారుస్తుంది. అంతే కాకుండా ఇప్పుడు మీ పాదాల అందాన్నిపెంచుకోవడానికి నెయిల్ పెయింట్ ఉపయోగించండి.