OTT Movie : ఎన్నో రకాల కథలతో సినిమాలు వచ్చాయి. ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు తగ్గట్టు సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ముద్దు సన్నివేశాలు కూడా ఉండేవి కావు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ 18వ శతాబ్దంలో జరుగుతుంది. ఒక బ్రాహ్మణ అమ్మాయికి మర్రిచెట్టు పెళ్లి చేస్తారు. సతీసహగమనం ఉన్న రోజుల్లో ఇది జరుగుతుంది. ఆనాటి ఆచారాలు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రిమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బెంగాలీ మూవీ పేరు ‘సతీ’ (Sati). 1989 లో వచ్చిన ఈ మూవీకి అపర్ణా సేన్ దర్శకత్వం వహించారు. కమల్ కుమార్ రచించిన మజుందార్ కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాలో షబానా అజ్మీ, అరుణ్ బెనర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 1828 లో బెంగాల్‌లోని ఒక గ్రామంలో ఉండే, ఒక మూగ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఉమా (షబానా అజ్మీ) అనే మూగ బ్రాహ్మణ అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోతారు. ఆతరువాత ఆమె తన మామగారి ఇంట్లో నివసిస్తుంది. వయసుకు రావడంతో పెళ్లి చేయాలని అనుకుంటారు. అయితే ఆమె జాతకం ప్రకారం, ఆమె వివాహం చేసుకున్న భర్త త్వరలో చనిపోతాడని, ఆమె సతీగా (భర్త చితిలో సజీవంగా దహనం చేయబడుతుంది)మారుతుందని తెలుస్తుంది. 1828లో సతీ సహగమనం ఉన్నందున, ఈ జాతకం ఆమెకు శాపంలా మారుతుంది. ఆమె మూగ అమ్మాయి కావడంతో, ఆమెను ఎవరూ వివాహం చేసుకోవడానికి ముందుకు రారు. అంతేకాక ఆమె చిన్న చెల్లెలి వివాహానికి అడ్డంకిగా మారుతుంది. ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం పెద్దవారి వివాహం ముందు చిన్నవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఈ సమస్యకు పరిష్కారంగా,గ్రామ పెద్దలు ఉమాను ఒక మర్రి చెట్టుతో వివాహం చేస్తారు. ఈ వివాహం ఆమె జాతక దోషాన్ని ఆ చెట్టు భరించేలా చేస్తుందని వాళ్ళు నమ్ముతారు. ఆ తరువాత ఉమా ఆ చెట్టు నీడలో ఓదార్పును వెతుక్కుంటుంది.
అయితే ఒక రాత్రి, స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు, ఆమెను బలాత్కారం చేస్తాడు. దాని ఫలితంగా ఉమా గర్భవతి అవుతుంది. గ్రామస్తులు ఈ గర్భానికి చెట్టు కారణమని నమ్మరు. ఉమా తన భర్త(చెట్టు)ను మోసం చేసిందని ఆరోపిస్తారు. ఆమెను ఒంటరిగా వదిలేస్తారు. ఆమెను ఇంటికి దూరంలో ఉండే ఒక గొర్రెల పాకలో ఉంచుతారు. ఒక రాత్రి భయంకరమైన తుఫానులో ఆ పాక ధ్వంసమవుతుంది. ఉమా తన ‘భర్త’అయిన చెట్టు వద్దకు పరిగెత్తి ఆశ్రయం పొందుతుంది. అయితే తుఫాను బలంగా వీచడంతో చెట్టు కూడా కూలిపోతుంది. ఉమా కూడా చనిపోతుంది. ఈ విధంగా, ఉమా తన ‘భర్త’తో (చెట్టు) సతీ సహగమనం చేస్తుంది. ఈ మూవీ స్త్రీలపై అప్పటి సమాజంలో జరిగిన అణచివేత, మూఢనమ్మకాలు, పితృస్వామ్య వ్యవస్థను విమర్శిస్తుంది.
Read Also : దెయ్యాల దేవతకు నరబలి ఇచ్చే మంత్రగత్తె … ఆచారం పేరుతో అమ్మాయిలని ఘోరంగా … వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్