PSL – Hair Dryer: పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ 2025 ( Pakistan Super League Tournament 2025 ) నేపథ్యంలో… సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ను ( Indian Premier League 2025 tournament ) పోల్చుతూ పాకిస్తాన్ సూపర్ లీగ్ ను దారుణంగా ఆడుకుంటున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఇచ్చే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లను… ఉద్దేశించి సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్లో… మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లుగా కార్లు… ఇస్తుంటే పాకిస్తాన్లో మాత్రం… టు వీలర్ వెహికల్స్ మాత్రమే ఇస్తున్నారని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read: Sunil Gavaskar: మీకు అసలు బుద్ధి ఉందా.. దిగ్వేష్ ఇష్యూపై సునీల్ గవాస్కర్ ఫైర్
సెంచరీ చేస్తే.. అలాంటి గిఫ్టులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో సెంచరీ చేస్తే చాలు… ఖరీదైన గిఫ్టులు, లేదా బైకులు… అది కాకపోతే 50 లక్షల రూపాయల క్యాష్ ఇస్తూ ఉంటారు. అయితే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Pakistan Super League Tournament 2025 ) మాత్రం దారుణంగా… వ్యవహరిస్తున్నారు. సెంచరీ చేసిన ప్లేయర్లకు హేర్ డ్రాయర్లు… అందజేస్తున్నారు. తాజాగా.. సెంచరీ పూర్తిచేసిన ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ విన్స్ కు కూడా అదే పరిస్థితి నెలకొంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ( Pakistan Super League Tournament 2025 ) తాజాగా జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ తో రెచ్చిపోయాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ విన్స్. అయితే సెంచరీ చేయగానే మంచి కార్ గిఫ్టు లేదా బైక్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ చివరికి హెయిర్ డ్రాయర్లు అప్పగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. సెంచరీ చేసిన నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాడు జేమ్స్ విన్స్ కు హెయిర్ డ్రాయర్.. అందజేశారు. అయితే హెయిర్ డ్రాయర్ ఇవ్వడంతో… ఇంగ్లాండ్ ఆటగాడు జేమ్స్ విన్స్ కూడా…. ఒక్కసారిగా నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ట్రిమ్మర్లు కూడా ఇవ్వండి అంటూ ట్రోలింగ్
పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ 2025 నేపథ్యంలో… సర్జరీ చేసిన ప్లేయర్లకు హెయిర్ డ్రాయర్లు ఇవ్వడం పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. కొన్ని రోజులు పోతే… బడ్జెట్ లేదని ట్రిమ్మర్లు కూడా పాకిస్తాన్ వాళ్ళు ఇస్తారని… ఇండియన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. విదేశీ ప్లేయర్ లందరూ ఐపీఎల్ ( Indian Premier League 2025 tournament ) ఆడండి అని… పాకిస్తాన్లో క్రికెట్ ఆడితే లాభమేమి ఉండదని అంటున్నారు. ఇక అటు… పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా 2 వీలర్ వెహికల్స్ ఇస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీనిపై సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది మరువక ముందే ఇప్పుడు హెయిర్ డ్రాయర్లు.. గిఫ్టుగా ఇవ్వడంతో ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజెన్స్.
Also Read: Shikhar Dhawan Sophie Shire: ప్రియురాలితో ధావన్… పెళ్లికాకముందే ప్రెగ్నెంట్!
BIG NEWS 🚨 England Cricketer James Vince gets Hair Dryer for hitting Century in Pakistan Super League 😂🔥
He was handed over a hair dryer for being the most reliable player of the contest.
Even James Vince couldn’t stop laughing at the bizarre gift 🤣
Several People are… pic.twitter.com/h81P6rvoYu
— Times Algebra (@TimesAlgebraIND) April 14, 2025