BigTV English

OTT Movie : హాస్పిటల్ అనుకుని శవాల దిబ్బకు వెళ్ళే ప్రెగ్నెంట్ లేడీ

OTT Movie : హాస్పిటల్ అనుకుని శవాల దిబ్బకు వెళ్ళే ప్రెగ్నెంట్ లేడీ

OTT Movie : దయ్యాల సినిమాలు భయ పెట్టడానికే తీస్తుంటారు. ఈ సినిమాలలో చేతబడులు కీలకపాత్రను పోషిస్తాయి. ఎక్కువ భాగం ఈ సినిమాలలో, చేతబడితోనే కథ ముందుకు నడుస్తుంది. ఇటువంటి కంటెంట్ ను చూపించడంలో, ఇండోనేషియన్ మేకర్స్ ఒక అడుగు ముందే ఉన్నారు. ఈ సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా, చేతబడి ప్రభావంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ప్లెక్స్ (plex) లో

ఈ ఇండోనేషియన్ హారర్ మూవీ పేరు ‘సతు సురో’ (Satu Suro). 2019 లో విడుదలైన ఈ హారర్ సినిమాకు ఆంగీ ఉమ్బారా దర్శకత్వం వహించారు.
ఒక కొత్త ఇంటిలోకి వచ్చిన ఒక జంట చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీలో కాస్త హింస ఎక్కువగానే ఉంటుంది. ఈ హారర్ సినిమా అతీంద్రియ శక్తుల చుట్టూ తిరుగుతుంది. చిన్న పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉంటేనే మంచిది. ఈ మూవీ ప్లెక్స్ (plex) ,బింగేడ్ (Binged) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

సినిమా మొదట్లో అరిస్ట్రా అనే మహిళ హాస్పిటల్ లో వింతగా ప్రవర్తిస్తుంది. అక్కడ డెలివరీ అయిన చిన్నపిల్లలు ఉంటారు. అందులో ఒక పిల్లాడిని తీసుకుని ఇతడే నాయబిడ్డ అని అంటుంది. అంతలోనే ఒక నర్స్ వచ్చి, అతను నీ పిల్లాడు కాదని చెప్తాడు. ఇది విని ఆ మహిళ అక్కడ ఉన్న చిన్నపిల్లల్ని చంపుకుంటూ పోతుంది. ఆమె చేసిన రచ్చ కి హాస్పిటల్ కూడా పేలిపోతుంది. ఆ తరువాత అదిందా అనే గర్భిణీ స్త్రీ తన భర్త బాయుతో కలిసి ఒక పట్టణం సమీపంలోని కొత్త ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు, అదిందా అనేక వింత అనుభవాలను ఎదుర్కొంటుంది. ఆమెకు ఆత్మలు కనిపించడం, పిచ్చి కలలు రావడం వంటివి జరుగుతుంటాయి. ఒక రోజు అదిందాకు తీవ్రమైన నొప్పులు రావడంతో, బాయు ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకెళ్తాడు. వైద్యుడు ఆమెకు ఇంకా ప్రసవ సమయం రాలేదని చెప్పడంతో, బాయు ఇంటికి తిరిగి వచ్చి ఆమె కోసం కొన్ని సామాన్లు తీసుకురావడానికి వెళ్తాడు.

కానీ తిరిగి ఆసుపత్రికి వచ్చేసరికి అక్కడ ఖాళీగా, పాడుబడిన పాత భవనం మాత్రమే కనిపిస్తుంది. బాయు అక్కడ ఉన్న స్థానికులను సహాయం కోరతాడు. అయితే వాళ్ళు చెప్పినదాని ప్రకారం, ఆ ఆసుపత్రి 15 సంవత్సరాలుగా పనిచేయడం లేదని, అది ఒకప్పుడు అగ్నిప్రమాదంలో నాశనమైందని తెలుస్తుంది. ఆ ఆసుపత్రి అరిస్ట్రా వల్ల ఒకప్పుడు  క్లోస్ అవుతుంది. ఇప్పుడు అదిందా ఎక్కడ ఉందో , తన బిడ్డ ఏమైంది అని బాయు వెతకడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో వింత శబ్దాలు, భయానక వాతావరణం అతనికి ఎదురుపడుతాయి. చివరికి బాయు తన భార్యని కనిపెడతాడా ? అరిస్ట్రాపిల్లల్ని చంపడానికి కారణం ఏంటి ? అసలు ఆ ఊరిలో ఏం జరుగుతుంది ?ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఇండోనేషియన్ హారర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

OTT Movie : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్

OTT Movie : అయ్యబాబోయ్ అన్నీ అవే సీన్లు… కన్పించిన ప్రతీ అబ్బాయిని రెచ్చగొట్టే అమ్మాయి… సింగిల్స్ కు పండగే

OTT Movie : మూడేళ్ళ తర్వాత ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ‘కాంతారా’ మూవీ… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్

OTT Movie : అర్ధరాత్రి ఇంటికొచ్చే మాస్క్ మ్యాన్… క్షణక్షణం భయపెట్టే సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్

Kurukshetra on OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘కురుక్షేత్ర’… ‘మహావతార్ నరసింహా’లాంటి విజువల్ వండర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTT Movie : రూరల్ టౌన్ లో బ్రూటల్ మర్డర్స్… వేరే లెవెల్ ట్విస్టులు, టర్నులు… చిప్పులు ఎగిరిపోవడం ఖాయం

OTT Movie : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా

Big Stories

×