BigTV English

Diabetes and Onion: డయాబెటిస్ ఉన్నవారు పచ్చి ఉల్లిపాయల్ని తినొచ్చా? తింటే ఏమవుతుంది?

Diabetes and Onion: డయాబెటిస్ ఉన్నవారు పచ్చి ఉల్లిపాయల్ని తినొచ్చా? తింటే ఏమవుతుంది?

డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది ఒక జీవన శైలి వ్యాధిగా చెప్పుకుంటారు. ప్రతి ఇంట్లో ఒక డయాబెటిస్ ఉండడం సర్వసాదారణంగా మారిపోయింది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపుతప్పి అధికంగా పెరిగినప్పుడు డయాబెటిస్ వ్యాధి వస్తుంది. జీవనశైలి మార్పుల ద్వారా దాన్ని కొంతవరకు అదుపులో ఉంచుకోవచ్చు. అలాంటి వాటిలో ఉల్లిపాయ ఒకటి. ఇది సహజ నివారణిగా పనిచేస్తుంది. మధుమేహ రోగులకు ఉల్లిపాయ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకోండి.


ఉల్లిపాయ ఎందుకు తినాలి?
ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిులు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది. శరీరం గ్లూకోజ్ ను బాగా ఉపయోగించుకునేలా చేస్తుంది. కాబట్టి టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయలు తినాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ఒక వచ్చి ఉల్లిపాయ తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు కచ్చితంగా అదుపులో ఉంటాయి.

ఉల్లిపాయ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తిన్నా కూడా ఆరోగ్యకరమే. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా అడ్డుకుంటుంది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. కాబట్టి ఉల్లిపాయలను సలాడ్ రూపంలో ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి.


శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగినా కూడా డయాబెటిస్ పెరిగిపోతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు తరచూ ఉల్లిపాయలు తినాల్సిన అవసరం ఉంది. శరీరంలో ఎక్కువగా ఇన్ప్లమేషన్ పెరిగితే ఇది దీర్ఘకాలిక వ్యాధులని మరింత పెంచేస్తుంది. కాబట్టి పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ చాలా వరకు తగ్గుతుంది. ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలు, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు, పచ్చి ఉల్లిపాయ తినడం ద్వారా ఇన్ఫ్లమేషన్ కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది
ఉల్లిపాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ రోగులకు బరువు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉల్లిపాయ తక్కువ క్యాలరీల కలిగి ఉంటాయి. కాబట్టి ఇది మధుమేహరోగులకు ఎంతో సహాయపడుతుంది.

కూరల్లో వేసుకుని ఉల్లిపాయలు తినడం వేరు, పచ్చి ఉల్లిపాయను తినడం వేరు. మీరు కూరలో ఉల్లిపాయలు తిన్నా కూడా ప్రతిరోజు ఒక పచ్చి ఉల్లిపాయలు తినేందుకు ప్రయత్నించండి. ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది. అదుపులో ఉంచుకోవడానికి సులభమైన, అత్యంత ప్రభావంతమైన మార్గం కూడా ఇదే. కాబట్టి రోజుకు ఒక పచ్చి ఉల్లిపాయలు తినడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.

Also Read: పచ్చి ఉల్లితో ఆరోగ్యం.. కానీ, రోజుకు ఇన్నే తినాలి.. అతిగా తింటే జరిగేది ఇదే!

ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకుంటాయి. ఉల్లిపాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా కూడా అడ్డుకుంటుంది. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో ఉండే ఖనిజాలు, విటమిన్లు చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

Tags

Related News

Lucky life partner: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీరు లక్కీ! ఎందుకంటే..

Custard Apple: సీతాఫలం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే.. షాక్ అవుతారు

Fruits: ఎక్కువ ఫైబర్ ఉండే ఫ్రూట్స్ ఏవో తెలుసా ?

Health Tips: డైలీ ఈ 3 కలిపి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?

Banana leaf food: డాక్టర్లు కూడా షాక్‌ అయ్యే నిజం! ఈ ఆకుపై భోజనం చేస్తే జరిగేది ఇదే!

Heart Attack: గుండెపోటు లక్షణాలను ‘గ్యాస్’ సమస్యగా పొరబడుతున్నారా ? జాగ్రత్త !

Period leave Men: కర్ణాటకలో మహిళలకు పీరియడ్ లీవ్.. మరి పురుషులకు?

Tollywood: జూబ్లీహిల్స్ లో సందడి చేసిన సింగర్ సునీత.. వాటికే అందం తెస్తూ!

Big Stories

×