BigTV English
Advertisement

OTT Movie : 6 ముఖాలతో పుట్టిన అబ్బాయి… వరుసగా అమ్మాయిల మిస్సింగ్… లింక్ ఏంటి?

OTT Movie : 6 ముఖాలతో పుట్టిన అబ్బాయి… వరుసగా అమ్మాయిల మిస్సింగ్… లింక్ ఏంటి?

OTT Movie : సాయికుమార్ తనయుడు రీసెంట్ గా నటించిన ఒకసినిమా, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులను బాగానే భయపెడుతోంది. అమ్మాయిల మిస్సింగ్ కేసుతో మొదలయ్యే ఈ స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇందులో అవికా గోర్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. చివరివరకు ఈ స్టోరీ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


ఆహా (aha)

ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ పేరు ‘షణ్ముఖ’ (Shanmukha) . 2025 లో వచ్చిన ఈ సినిమాకి షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. ఇందులో ఆది సాయికుమార్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక పురాతన ఆలయ రహస్యాలు, దేవతా శక్తులు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌. దీనిని సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌పై తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని నిర్మించారు. ఆహా (aha) ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ ఒక గ్రామంలో ఉండే పురాతన ఆలయం చుట్టూ తిరుగుతుంది.  ఇక్కడ ఒక దేవత రహస్యాలు,నిధి దాగి ఉన్నాయని నమ్ముతారు. విగంద (చిరాగ్ జానీ) అనే వ్యక్తి తన కొడుకు షణ్ముఖ, ఆరు ముఖాలతో జన్మించిన వికృత రూపం కలిగిన బిడ్డను సాధారణ రూపంలోకి మార్చడానికి శక్తివంతమైన తాంత్రిక విధానాలను ఉపయోగిస్తాడు. ఒక మాంత్రికుడు అతనికి ఆరు వేర్వేరు నక్షత్రాలలో జన్మించిన అందమైన యువతులను బలి ఇవ్వాలని, అలాగే దేవత క్లిన్ క్లారా రక్తాన్ని సేకరించాలని సూచిస్తాడు. ఈ క్రమంలో విగంద అమ్మాయిలను అపహరించి, హత్య చేస్తూ నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తాడు.

ఈ మిస్సింగ్ హత్యలు జర్నలిస్ట్ సారా మహేశ్వర్ (అవికా గోర్) దృష్టిని ఆకర్షిస్తాయి. ఆమె ఈ కేసును దర్యాప్తు చేయడానికి సబ్-ఇన్‌స్పెక్టర్ కార్తి వల్లభన్ (ఆది సాయికుమార్) తో కలిసి పనిచేస్తుంది. కార్తి ఒక డ్రగ్ రాకెట్‌ను ఛేదించే సమయంలో తన పిస్టల్‌ను కోల్పోతాడు.అందువల్ల పై అధికారులు అతనికి వార్నింగ్ ఇస్తారు. ఇక ఈ కేసు ద్వారా అతను తన వృత్తిపరమైన గౌరవాన్ని తిరిగి పొందాలని కోరుకుంటాడు. సారా, కార్తి కలిసి ఈ కేసు రహస్యాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. చివరికి సారా, కార్తి కలసి ఆ కిల్లర్ ని పట్టుకుంటారా ? షణ్ముఖ రూపం మారుతుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను,  ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : అబ్బాయే అసిస్టెంట్ గా కావాలనే లేడీ బాస్… ముసలాడే కదాని పనిలో పెట్టుకుంటే

Related News

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

Big Stories

×