OTT Movie : 70 ఏళ్ల బెన్ విట్టేకర్ ఒక ఊహించని సాహసంలో అడుగుపెడతాడు. ఒక హై-ఫ్లైయింగ్ ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టార్టప్‌లో, సీనియర్ ఇంటర్న్‌గా జాయిన్ అవుతాడు. సీఈఓ జూల్స్ ఆస్టిన్ నడిపే ఈ డైనమిక్ కంపెనీలో, బెన్ తన అనుభవాన్ని, తెలివిని ఉపయోగించి సంచలనం సృష్టిస్తాడు. బెన్ ఈ లేటు వయసులో ఎలాంటి సవాళ్లను ఎదుర్కుంటాడు ? అతని అనుభవం కంపెనీకి ఎలా ఉపయోగపడుతుంది ? ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం.
స్టోరీలోకి వెళితే
బెన్ విట్టేకర్ 70 ఏళ్ల వృద్ధుడు తన భార్య మరణం తర్వాత జీవితంలో ఒంటరి తనం అనుభవిస్తుంటాడు. ఫోన్ బుక్ కంపెనీలో 40 ఏళ్ల కెరీర్ తర్వాత, రిటైర్మెంట్ అతనికి ఏ మాత్రం ఆనందం ఇవ్వదు. అతను ఒక సీనియర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం ప్రకటనను చూసి, “About The Fit” అనే ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైల్ స్టార్టప్‌లో చేరతాడు. ఈ కంపెనీని 30 ఏళ్ల జూల్స్ ఆస్టిన్ నడిపిస్తోంది. జూల్స్ ఒక అత్యంత ఉత్సాహవంతమైన సీఈఓ. తన కంపెనీని 18 నెలల్లో ఒక గ్యారేజ్ స్టార్టప్ నుండి 220 మంది ఉద్యోగులతో కూడిన విజయవంతమైన వ్యాపారంగా మార్చింది. కానీ ఆమె వ్యాపారం విజయవంతమైనప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం ముఖ్యంగా తన భర్త మాట్ , తండ్రి, కుమార్తె పైజ్ తో సమతుల్యం సాధించడానికి కష్టంగా ఉంటుంది. ఇక జూల్స్ మొదట బెన్‌ను తన ఇంటర్న్‌గా స్వీకరించడానికి ఆలోచిస్తుంది. వయసులో ఉన్న అబ్బాయి అయితే బెట్టర్ అనుకుంటుంది. ఇప్పుడు బెన్ వయస్సు, సాంప్రదాయ శైలి తన టీం కు సరిపోదని భావిస్తుంది. అయినా కూడా ఒక అవకాశంగా ఉద్యోగంలో పెట్టుకుంటుంది.
బెన్ తన తెలివితేటలు, పని తీరుతో కంపెనీలోని ఉద్యోగులతో స్నేహం చేస్తాడు. వారికి డేటింగ్ సలహాలు, పని సలహాలు ఇస్తాడు. అతను జూల్స్‌కు ఒక విశ్వసనీయ సలహాదారుగా మారతాడు. కొద్ది రోజుల్లోనే బెన్ మంచి పేరు తెచ్చుకుంటాడు. ఒకసారి ఆమె తన కంపెనీని ఒక పెద్ద కార్పొరేషన్‌కు అమ్మాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు, ఆమె వైవాహిక జీవితంలో సమస్యలతో బాధపడుతున్నప్పుడు బెన్ సలహా ఆమెకు మార్గనిర్దేశం చేస్తుంది. ఆ తరువాత వారిద్దరి మధ్య ఒక మంచి స్నేహం ఏర్పడుతుంది. చివరికి బెన్ కంపెనీకి ఎలాంటి సలహాలు ఇస్తాడు ? జూల్స్ లైఫ్ ని ఎలా సేవ్ చేస్తాడు ? అతడు ఒంటరిగానే ఉండిపోతాడా ? జూల్స్ తో స్నేహం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఐలాండ్ లో ఒంటరి జంట… అప్పుడే అమ్మాయి శవం… బుర్రపాడు చేసే మర్డర్ మిస్టరీ
ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ది ఇంటర్న్’ (The Intern). 2015 లో వచ్చిన ఈ సినిమాకి నాన్సీ మేయర్స్ దర్శకత్వం వహించారు. ఇందులో రాబర్ట్ డి నీరో (బెన్ విట్టేకర్), అన్నే హాత్వే (జూల్స్ ఆస్టిన్), రెనే రస్సో (ఫియోనా), ఆండర్స్ హోమ్ (మాట్), జాక్ ఫెరిస్ (డేవిస్), ఆడమ్ డెవిన్ (జాసన్) వంటి నటులు నటించారు. 2 గంటలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDb లో 7.1/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.