Women Scheme: వివిధ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరి దాదాపు ఏడాది కావస్తోంది. మహిళలను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెడుతున్నారు. దేశంలో బాగానే పాపులరయిన పథకాల్లో ‘లాడ్లీ బహనా యోజన’ ఒకటి. ఈ స్కీమ్ కింద ప్రతీ నెల మహిళలకు రూ. 1500 వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం గడిచిన రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండటానికి కారణం రకరకాల పథకాలు. వాటిలో మహిళలను ఆకట్టుకునే పథకాలు కీలకమైనవి. వాటిలో ఒకటి లాడ్లీ బహనా యోజన. ఈ స్కీమ్‌కు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పథకం కింద ప్రస్తుతం అందుతున్న మొత్తానికి పెంచుతున్నట్లు ఎంపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు.
రక్షా బంధన్ రోజు నుంచి ఆడపడుచులకు ఇప్పుడు ఇస్తున్న వెయ్యికి అదనంగా రూ.250 కలిపి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీపావళి నుండి ప్రతి నెలా రూ.1500 మహిళల ఖాతాలో జమ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం మోహన్ వెల్లడించారు. దీంతో ఆ రాష్ట్రంలో మహిళలకు పండగే పండగ.
మధ్యప్రదేశ్‌లో ఈ పథకం కింద 1.27 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వారందరికీ ఇదొక తీపి కబురు. గత ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో కీలకమైంది. తాము అధికారంలోకి వస్తే ప్రతీ నెల మహిళల బ్యాంకు అకౌంట్‌లో ప్రతీనెల మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రామిస్ చేసింది.
ALSO READ: ఓటర్ ఐడీ కార్డు ఇక 15 రోజుల్లో డెలివరీ.. ఆన్ లైన్ అప్లై చేసుకోంది
ఏపీలో చంద్రబాబు సర్కార్ మాదిరిగా కాకుండా వైసీపీ మాదిరిగా ఏడాదికి కొంత కొంత పెంచుకుంటూ రానుంది మోహన్ సర్కార్. లాడ్లీ బహనా యోజన కింద ప్రస్తుతం మహిళలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. మహిళలకు అత్యంత ఇష్టమైన శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు 9న రూ.1250 ఇవ్వనుంది. దీపావళి నుంచి రూ. 1500 పెంచనుంది మోహన్ సర్కార్.
వచ్చే ఏడాది నుంచి 500 చొప్పున పెంచుకుంటూ 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి మూడు వేలు చేయనుంది. లాడ్లీ బహనా యోజన పథకాన్ని 2023 మార్చిలో ప్రారంభించారు అప్పటి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్. బీజేపీ విజయంలో ఈ స్కీమ్ కీలకపాత్ర పోషించింది.
ఈ పథకం కింద వివాహితులు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, ఒంటరి మహిళలు అర్హులు. ఆదాయపు పన్ను చెల్లించేవారు అర్హులు కారు. అంతేకాదు కుటుంబ వార్షిక ఆదాయం రెండున్నర లక్షల కంటే తక్కువ ఉండాలి.