OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సినిమాలలో ఉండే ట్విస్టులు ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తాయి. అపరిచిత వ్యక్తులతో వచ్చే ప్రమాదాలు ఎక్కువగానే ఉంటాయి. అందులోనూ అమ్మాయిల వల్ల అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. తన అందాన్ని, ఒక డబ్బున్న వ్యక్తికి ఎరగావేసి, చివరికి అతన్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
2022లో రిలీజ్ అయిన ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘శాటర్డ్‘ (Shattered). ఈ మూవీకి లూయిస్ ప్రిటో దర్శకత్వం వహించారు. ఇందులో కామెరాన్ మోనాఘన్, ఫ్రాంక్ గ్రిల్లో, లిల్లీ క్రుగ్, జాన్ మల్కోవిచ్ నటించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
క్రిష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉంటూ, తన భార్యతో విడాకులు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే స్కై అనే అమ్మాయి క్రిష్ ని ప్లాన్ ప్రకారం తన వలలో వేసుకోవాలని చూస్తుంది. క్రిష్ ఉండే ఇంటికి కొద్ది దూరంలోనే, తన ఫ్రెండ్ తో కలిసి ఒక రూమ్ లో ఉంటుంది. ఒకరోజు క్రిష్ షాపింగ్ కి రావడంతో తను కూడా ఏమీతెలీనట్లు వెళ్తుంది. మాటలు కలిపి టాక్సీ బుకింగ్ క్యాన్సిల్ అయిందని అతనితో చెప్తుంది. అతడు లిఫ్ట్ ఇస్తానంటూ ఆమెను తనకారులో తీసుకెళ్తాడు. అయితే ప్లాన్ ప్రకారం తన ఫ్రెండ్ కి నాకు గొడవ జరిగిందంటూ చెప్తుంది. తనతో ఈరోజు ఉండొచ్చని చెప్పి స్కై ని తీసుకువెళ్తాడు. ఈ క్రమంలో అతన్ని రెచ్చగొడుతూ ఏకాంతంగా గడుపుతుంది. ఆ తర్వాత అతని సీక్రెట్ లాక్స్ అన్నీ తెలుసుకుంటుంది. ఒకసారి చిన్న ప్రమాదంలో క్రిస్ కి గాయం అవుతుంది. నిన్ను నేను చూసుకుంటాను అంటూ స్కై అతని దగ్గరే ఉంటుంది. ఒకరోజు స్కై రూమ్ మేట్ చనిపోయి ఉంటుంది. టీవీలో చూపిస్తున్న అమ్మాయి ఫోటో స్కై పర్సులో ఉంటుంది. తను నీ ఫ్రెండే కదా అని, ఆమె గురించి తెలిసిన విషయాలు పోలీసులకు చెప్పాలని అంటాడు.
అందుకు స్కై ఆమెను చంపింది నేనే అని చెప్తుంది. ఇది వింటూనే షాక్ అవుతాడు క్రిష్. డబ్బు కోసం నిన్ను ట్రాప్ చేశానని, నన్ను విసిగించడంతో తనని చంపేశానని చెప్తుంది. ఆ తర్వాత క్రిష్ ని తాడుతో కట్టేసి అతని దగ్గర ఉన్న బ్యాంక్ పాస్వర్డ్ ని తెలుసుకుంటుంది. అకౌంట్ లో ఉన్న డబ్బులను, తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. అక్కడికి స్కై స్టెప్ ఫాదర్ కూడా వస్తాడు. ఆమెకు సపోర్ట్ గా ఉంటూ మిగతా ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. చివరికి కాలికి దెబ్బ తగిలింది అన్న విషయం భార్యకు తెలుస్తుంది. ఆ ఇంటికి వచ్చిన క్రిష్ భార్య, అక్కడున్న పరిస్థితిని చూసి భయపడుతుంది. చివరికి స్కై చేతిలో ఈ కుటుంబం ఏమవుతుంది? పోలీసులు స్కై ని పట్టుకుంటారా? క్రిష్ భార్య, కూతురిని స్కై ఏం చేస్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.