BigTV English

Sankratnti ki Vathunam : ప్రొడ్యూసర్ కంటే డైరెక్టర్ కి వచ్చిందే ఎక్కువ… అనిల్ కి ఎన్ని కోట్లంటే..?

Sankratnti ki Vathunam : ప్రొడ్యూసర్ కంటే డైరెక్టర్ కి వచ్చిందే ఎక్కువ… అనిల్ కి ఎన్ని కోట్లంటే..?

Sankratnti ki Vathunam : ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో చివరగా వచ్చిన వెంకీ మామ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ ని అందుకోవడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయి. జనవరి 14న సంక్రాంతి కోస్తున్న మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్లు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ సక్సెస్ రన్ తో సాగుతుంది. అయితే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు డైరెక్టర్ తీసుకున్న రెమ్యూనరేషన్ చాలా ఎక్కువనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి డైరెక్టర్ ఎన్నికోట్లు తీసుకున్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. 

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది దాంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్లకు పైగా ఈ సినిమా వసూల్ చేసింది. హీరో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.. ఈ మూవీకి 42 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే అందరికన్నా ఎక్కువ చిత్ర డైరెక్టర్ రెమ్యూనరేషన్ అందుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.


డైరెక్టర్ కు ఎన్ని కోట్లంటే..? 

టాలీవుడ్ సక్సెస్ఫుల్ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. గతంలో ఆయన చేసిన సినిమాల కంటే ఈ మూవీ మంచి టాక్ ను అందుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ చేయక ఎలా కలెక్షన్స్ ని కూడా అందుకుంటుంది. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 200 కోట్లకు పైగా వసూలు చేయడం మామూలు విషయం కాదు. మూవీకి టోటల్ బడ్జెట్ గా 80 కోట్లను నిర్మాతలు పెట్టారు. పెట్టిన దానికంటే త్రిపుల్ కలెక్షన్స్ వచ్చాయి.. అయితే డైరెక్టర్ కు 25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారు. హీరో, ప్రొడ్యూసర్ కంటే ఎక్కువే.. అలాగే మూవీ లాభాల్లో కొంత షేర్ కూడా తీసుకున్నారని టాక్. మరి ఆయన ఎంత షేర్ ను అందుకున్నాడో తెలియదు. కానీ డైరెక్టర్ కు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చారు అని జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా మూవీ మాత్రం మంచి టాక్ ను అందుకోవడంతో వెంకీ మామా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ ఏ హీరోతో సినిమా చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×