Congress VS BRS: జూబ్లీహిల్స్.. తెలంగాణలో ఇప్పుడు హాటెస్ట్ సెగ్మెంట్. ఓ పక్క సిట్టింగ్ బీఆర్ఎస్. మరోవైపు.. అధికార కాంగ్రెస్! మొత్తానికి.. జూబ్లీహిల్స్ రాజకీయం వేడెక్కింది. అయితే.. సిట్టింగ్ సీటుని నిలబెట్టుకునే విషయంలో.. బీఆర్ఎస్‌లో కొంత టెన్షన్ కనిపిస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల్లో.. ఈ విషయం క్లియర్‌గా తెలుస్తోంది. హైదరాబాద్‌లో బలంగా ఉన్నామని చెప్పుకునే బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్ విషయంలో మాత్రం ఎందుకిలా ఆందోళనకు గురవుతోంది?
జూబ్లీహిల్స్ బైపోల్ బీఆర్ఎస్‌ని టెన్షన్ పెడుతోందా?
జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్ పరిస్థితి గురించి కేటీఆరే ఇలా చెప్పేశాక.. ఇక మిగతా వాళ్లు అనడానికి ఏముంటుంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తల మీటింగులో.. కేటీఆర్ ఇలా ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు. ఇది చూశాక.. ఒక విషయం మాత్రం క్లియర్ అయిపోయింది. జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో.. బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. సిట్టింగ్ సీటు.. ఇజ్జత్ కా సవాల్ అయినప్పటికీ.. గ్రౌండ్‌లో ఉన్న సిచ్యువేషన్ తలచుకొని ఆందోళన చెందుతున్నారు ఆ పార్టీ నాయకులు. దాంతో.. వీలైనంత త్వరగా జూబ్లీహిల్స్ ప్రజల్ని మరోసారి తమవైపు తిప్పుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది.
ఒక్కసారిగా హీటెక్కిన జూబ్లీహిల్స్ రాజకీయం
బేసిగ్గా.. బైపోల్.. ఎప్పుడొచ్చినా, ఎక్కడొచ్చినా.. పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదు. ఆ ఎన్నిక జరిగే దాకా రాష్ట్ర రాజకీయం మొత్తం ఆ ఒక్క నియోజకవర్గం చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు.. జూబ్లీహిల్స్ విషయంలోనూ అదే కనిపిస్తోంది. ఎన్నిక ఎప్పుడొస్తుందో తెలియకపోయినా.. జూబ్లీహిల్స్ రాజకీయం మాత్రం హీటెక్కింది. అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలెట్టేశాయ్. ఈ సీటు అధికార కాంగ్రెస్ కంటే.. అపొజిషన్‌లో బీఆర్ఎస్‌కే చాలా ఇంపార్టెంట్. అందువల్ల.. జూబ్లీహిల్స్‌లో మళ్లీ జెండా పాతేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కానీ.. గ్రౌండ్‌లో సీన్ అలా కనిపించట్లేదు. ఇది.. బీఆర్ఎస్ సర్వేల్లోనే తేలింది. ఇప్పుడు పార్టీకి ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉంది? ఇతర పార్టీల పరిస్థితేంటి? అనే వివరాలు సేకరిస్తే.. రిజల్ట్ నెగటివ్‌గా వచ్చినట్లు కనిపిస్తోంది.
కేడర్‌లో జోష్ భరోసా నింపినట్లు అవుతుందనే లెక్క
జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్‌కు సిట్టింగ్ సీటు. ఇక్కడ గెలిస్తే.. పార్టీ కేడర్‌లో జోష్‌తో పాటు భరోసా నింపినట్లు అవుతుందనే లెక్కల్లో బీఆర్ఎస్ ఉంది. కానీ.. క్షేత్రస్థాయిలో పార్టీ అనుకున్నంత యాక్టివ్‌గా లేదనేది మాత్రం ఇప్పుడు క్లియర్ అయింది. దాంతో.. జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు బీఆర్ఎస్‌కు అగ్నిపరీక్షగా మారింది. అందువల్ల.. బైపోల్ నోటిఫికేషన్ వచ్చే లోపే మొత్తం సెట్ చేసుకోవాలని బీఆర్ఎస్ అనుకుంటోంది. కానీ.. నియోజకవర్గంలో ఉన్న సవాళ్లను ఏ రకంగా అధిగమించాలనే విషయంలో.. ఆ పార్టీ నేతలు కిందామీదా పడుతున్నారు. ఇప్పటికైతే.. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణినే బరిలో దించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలవాలనే కేటీఆర్ మాటలు చూస్తుంటే.. ఇదే అనిపిస్తోంది. ఇప్పటికే.. అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మరోవైపు.. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. దాంతో.. రెండు పార్టీల వ్యూహాలను ఎదుర్కోవడంతో పాటు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు పార్టీని బలోపేతం చేయడం బీఆర్ఎస్‌కు పెను సవాల్‌గా మారింది.
అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించడం బీఆర్ఎస్‌కు అవసరం
ఇప్పటికే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొందరు కింది స్థాయి నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. అందువల్ల.. పార్టీ క్యాడర్‌ని తిరిగి యాక్టివ్ చేయడంతో పాటు అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించడం బీఆర్ఎస్‌కు ఎంతో అవసరం. అయితే.. ఈ విషయంలోనే బీఆర్ఎస్‌లో కొంత టెన్షన్ కనిపిస్తోంది. అందుకోసమే.. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. సర్వేలు కూడా చేయించి.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అంచనా వేస్తోంది అధిష్టానం. పార్టీ బలం, బలహీనతల్ని అంచనా వేసుకొని.. అందుకనుగుణంగా ముందుకెళ్లాలని చూస్తోంది ఆ పార్టీ నాయకత్వం. ఈ ఉపఎన్నిక.. సిట్టింగ్ సీటుని నిలబెట్టుకోవడమే కాదు.. బీఆర్ఎస్ భవిష్యత్తుని నిర్ణయించేది కూడా. అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ పోటీని ఎదుర్కొని.. సవాళ్లని అధిగమిస్తేనే.. బీఆర్ఎస్ పట్టు నిలుపుకోగలుగుతుంది. లేకపోతే.. ఆ పార్టీకి మున్ముందు మరిన్న కష్టాలు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
Story By Anup, Bigtv