BigTV English

OTT Movie : భార్య ఫోన్ లో సీక్రెట్ స్పై యాప్… మ్యారేజ్ యానివర్సరీకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే షాక్

OTT Movie : భార్య ఫోన్ లో సీక్రెట్ స్పై యాప్… మ్యారేజ్ యానివర్సరీకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే షాక్

OTT Movie : ఊహించని ట్విస్ట్‌లతో ఒక తమిళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీలో ఆడియన్స్ ఆదరిస్తున్నారు. భార్య ఫోన్‌లో స్పై యాప్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల జరిగే పరిణామాలతో ఈ స్టోరీ నడుస్తుంది. ఊటీ అందాలు కూడా ఈ సినిమాకి ప్లస్ గా మారాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే 

మార్టిన్ విన్సెంట్ ఒక టీ ఎస్టేట్ మేనేజర్. ఊటీలో తన బెస్ట్ ఫ్రెండ్ పాల్ కి చెందిన 3000 ఎకరాల ఎస్టేట్‌ని చూసుకుంటూ ఉంటాడు. అతను తన భార్య లీనా మహదేవన్ ని గాఢంగా ప్రేమిస్తాడు. వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఆమెను సర్‌ప్రైజ్ చేయాలని ఒక ప్లాన్ వేస్తాడు. తన కో-వర్కర్ సలహాతో, మార్టిన్ లీనా ఫోన్‌లో “హిడెన్ ఫేస్” అనే స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తాడు. దాని ద్వారా ఆమె రియల్ టైమ్ లో ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటాడు. అతని ఉద్దేశం కేవలం ఆమె “క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్” కలెక్ట్ చేసి వీడియోగా సర్‌ప్రైజ్ ఇవ్వడం. కానీ ఈ యాప్ ద్వారా అతను ఊహించని ఒక మిస్టీరియస్ క్యారెక్టర్‌ని చూస్తాడు. ఇది కథను ఊహించని దిశలో తీసుకెళ్తుంది.

స్పై యాప్ ద్వారా మార్టిన్ చూసిన మిస్టీరియస్ క్యారెక్టర్ కథను ఒక డార్క్ థ్రిల్లర్‌గా మారుస్తుంది. ఈ క్యారెక్టర్ లీనాతో కనెక్టెడ్, కానీ ఎలా అనేది సస్పెన్స్. ఈ ఘటన మార్టిన్, లీనా మధ్య ప్రేమ, ట్రస్ట్, ఫ్రెండ్‌షిప్‌ని ప్రశ్నిస్తూ, టెక్నాలజీ డార్క్ సైడ్‌ని బయటపెడుతుంది. మార్టిన్ తన స్కూల్ డేస్ నుంచి కొన్ని సీక్రెట్స్‌లో చిక్కుకుంటాడు. ఇంద్రజిత్ ఎంట్రీతో కథ మరింత ఇంటెన్స్ అవుతుంది. అతని గతంలోని ఒక ఘటన కథకు డెప్త్ యాడ్ చేస్తుంది. ప్రతి ట్విస్ట్ మార్టిన్‌ని మరింత ట్రాప్‌లోకి లాగుతుంది. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను షాక్ ఇస్తుంది. ఈ క్లైమాక్స్‌ ట్విస్ట్ ఏమిటి ? మార్టిన్ ఫోన్ యాప్ లో ఏం చూస్తాడు ? మార్టిన్, లీనా స్టోరీ ఎలాంటి మలుపు తీసుకుంటుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.


ఏ ఓటీటీలో ఉందంటే

‘అథోముగం’ (Athomugam) సునీల్ దేవ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. రీల్ పెట్టి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించబడింది. ఇందులో ఎస్.పి. సిద్ధార్థ్ (మార్టిన్), చైతన్య ప్రతాప్ (లీనా), అనంత్ నాగ్ (పాల్), సరితిరన్ (సూర్య), అరుణ్ పాండియన్ (ఇంద్రజిత్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2024 మార్చి 1న థియేటర్లలో విడుదలై, జనవరి 2025 10న Aha వీడియోలో రిలీజ్ అయింది. 2 గంటల 8 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 7.0/10 రేటింగ్ పొందింది.

Read Also : శవాలని తవ్వి తినే సైకో.. ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్ భయ్యా… రాత్రిపూట ఒంటరిగా చూడాల్సిన మూవీ

Related News

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో రాత్రి బర్త్ డే పార్టీ… కళ్ళు తెరిచి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… భయాన్నే భయపెట్టే హర్రర్ మూవీ

OTT Movie : ప్రేమ పేరుతో సీక్రెట్ వీడియోలు… లేడీ ఆఫీసర్ ను నిండా ముంచే కేటుగాడు… గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్

OTT Movie : మాట్లాడుకునే చెట్లు… ఆ అడవిలోకి అమ్మాయిలు వెళ్తే తిరిగిరారు… ఒక్కో ట్విస్టుకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపే సైకో… వీడికి ఇదేం మాయ రోగం సామీ… క్లైమాక్స్ లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్

OTT Movie: ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్లి ఏదో చేస్తారు.. నేపాల్ పోలీసుల అరాచకాన్ని చూపించే మూవీ ఇది

×