OTT Movie : ఇప్పుడు థియేటర్లకన్నా ఓటీటీ ప్లాట్ ఫామ్ లే ఎక్కువ గా పాపులర్ అవుతున్నాయి. ఇంట్లోనే హ్యాపీగా కూర్చుని, నచ్చిన సినిమాలను చూసుకుంటున్నారు. థియేటర్లకి, ఓటీటీ లకి మధ్య తేడా ఎక్కువ రోజులు కూడా ఉండటం లేదు. అందుకే ఎక్కువమంది ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఫ్యామిలీ డ్రామా తో తెరకెక్కింది. చివరి వరకు ఈ మూవీ కామెడీతో అదరగొడుతుంది. ఒక భర్త రెండు పెళ్లిళ్లు చేసుకుని ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడు పడే పాట్లు కడుపుబ్బ నవ్విస్తాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులోస్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ హాలీవుడ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘సో మచ్ లవ్ టు గివ్’ (So much love to give). ఈ మూవీ 19th March 2020లో థియేటర్లలో రిలీజ్ అయింది. దీనికి మార్కస్ కార్నివాల్ దర్శకత్వం వహించాడు. ఇద్దరు భార్యల మధ్య నలిగే ముద్దుల మొగుడు చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో రెండు పెళ్లిళ్లు చేసుకుని, ఒకరికి తెలియకుండా ఒకరితో గడుపుతుంటాడు. ఇద్దరిని బాగా ప్రేమిస్తూ మంచిగా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ పిల్లలు కూడా పుడతారు. అలా కొన్ని సంవత్సరాలు హ్యాపీగా గడిపేస్తాడు. డాక్టర్ డ్యూటీ చేస్తుండటంతో వారంలో ఇటు అటు తిరుగుతూ, భార్యలతో రొమాన్స్ చేసుకుంటూ జీవితం అలా గడిపేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా హీరోకి చిన్న ప్రమాదం జరుగుతుంది. అతడు హాస్పిటల్ లో జాయిన్ అవుతాడు. అతడి ఫోన్ నుంచి నర్స్ భార్య లకు ఫోన్ చేసి విషయం చెప్తుంది. హాస్పిటల్ కి ఇద్దరు భార్యలు వస్తారు. వాళ్ళను అక్కడ మైంటైన్ చేయలేక పై ప్రాణాలు పైకి పోతాయి హీరోకి. అయితే ఎలాగో అక్కడ తప్పించుకున్నా, మొదటి భార్యకు ఇతని మీద అనుమానం వస్తుంది. అతని మీద ఒక కన్ను వేస్తే అసలు విషయం బయట పడుతుంది.
హీరో చేసిన యాక్టింగ్ చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఇద్దరు భార్యలు కలిసి అతనికి బుద్ధి చెప్పాలనుకుంటారు. అతనికి మత్తు ఇచ్చి ఇంటికి తీసుకెళ్తారు. ఇతని రెండో భార్యకి కాస్త సైకో ఇజం ఉంటుంది. అతని ప్రైవేట్ పార్ట్ ను కోసేయాలని చూస్తుంది. అతడు అలా చెయ్యద్దని బతిమిలాడుకుంటాడు. ఒక గోడ ఎక్కి చచ్చిపోతానంటూ బెదిరిస్తాడు. అక్కడి నుంచి దూకడంతో కాళ్ళు, చేతులు విరుగుతాయి. చివరికి హీరో వీళ్ళ చేతిలో బలవుతాడా? ఒంటరిగా మిగిలిపోతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సో మచ్ లవ్ టు గివ్’ (So much love to give) అనే ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.