Bigg Boss 10: శనివారం ఎపిసోడ్లో భాగంగా కంటెస్టెంట్స్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు నాగార్జున (Nagarjuna ). ఇకపోతే దాదాపు 8 వారాలు పూర్తయి.. ఈ ఎనిమిది వారాలలో ఏ ఒక్క రోజు కూడా నాగార్జున చేత నరేష్ (Naresh) తిట్లు తినలేదు. అలాంటిది తొలిసారి సంచాలక్ గా వ్యవహరించి, అందులో ఫెయిల్ అవ్వడమే కాకుండా నాగార్జున చేత తిట్లు తినడం అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తన అద్భుతమైన కామెడీ పర్ఫామెన్స్ తో తన వ్యక్తిత్వంతో ఖచ్చితమైన నామినేషన్ పాయింట్ పెడుతూ అందరిచేత శభాష్ అనిపించుకున్న నరేష్.. ఇక్కడ మానవత్వం చూపించడమే నరేష్ ను నాగార్జున చేత తిట్లు తినేలా చేసిందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఫ్యామిలీ వీక్ లో భాగంగా అమన్ – రామకృష్ణ ఒక బ్యాచ్, ముఖేష్ – వర్షిని ఒక బ్యాచ్ గా పజిల్ గేమ్ ఆడారు. ఇందులో ముఖేష్ పజిల్ ఐదు అనే లోపే కింద పడిపోయింది. కానీ తాను ఐదు చెప్పాక కింద పడిపోయిందని, సంచాలక్ గా తాను ఓడిపోతే.. ఓడిపోయిన వారి ఫ్యామిలీ హౌస్ లోకి వస్తుందని చెప్పాడు. అయితే ముఖేష్ ఎలాగైనా గెలవాలి అని, ముఖేష్ ఫ్యామిలీ హౌస్ లోకి రావాలని, తన ఫ్యామిలీని కూడా వదులుకోవడానికి సిద్ధమని మానవత్వం చూపించాడు నరేష్. ఇక ఈ విషయంపై నాగార్జున ప్రస్తావించారు. హోస్ట్ నాగార్జున మిగతా కంటెస్టెంట్స్ అందరికీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చి ఆ తర్వాత నరేష్ దగ్గరికి వచ్చారు.
సంచాలక్ గా చేసిన టాస్క్ గురించి మాట్లాడారు. అందులో అందరూ నరేష్ ను తప్పు అన్నారు. నరేష్ మాత్రం తనది తప్పు అయితే తన ఫ్యామిలీ బదులు ఓడిపోయిన వాళ్ళ ఫ్యామిలీ వస్తారని చాలెంజ్ కూడా చేశారు. దాంతో నాగార్జున ఆ వీడియో చూపించారు. టాస్క్ లో నరేష్ తప్పు అని నిరూపణ అవడంతో ..నరేష్ ఫ్యామిలీ.. ఫ్యామిలీ వీక్ లో హౌస్ లోకి రారు అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దాంతో టాస్క్ లో ఓడిపోయిన రామకృష్ణ అమన్ లలో ఎవరి ఫ్యామిలీ రావాలో అడగగా.. నరేష్ అమన్ ఫ్యామిలీ అని చెప్పాడు. ఇక అలా ఫ్యామిలీ రాదు అని తెలియడం, నరేష్ సంచాలక్ గా తప్పు చేసినందుకు నాగార్జున పాయింట్ అవుట్ చేయడంతో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు.
also read: పేల్చాల్సిన టైమ్ లో పేల్చకపోతే గన్ రివర్స్ అవుతుంది.. నీతూ వినమ్మా సరిగ్గా!
ఇక తర్వాత శ్వేతా , రామకృష్ణ గురించి కూడా నాగార్జున మాట్లాడారు . రామకృష్ణ గేమైతే ఏం లేదు.. నీరసం వస్తోంది అని తెలిపారు. అటు అమన్ ని ఇంకా బాగా ఆడాలి అంటూ ప్రోత్సహించారు. ఇకపోతే ఇన్ని రోజులు త్రిగుణ్ ను నాగార్జున సపోర్ట్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న వేళ.. నిన్నటి ఎపిసోడ్ లో ఆయనను కూడా తిట్టాడు. అందరిమీద పాటలు పాడడం ఎందుకు అంటూ ఫైర్ అయ్యాడు. నామినేషన్ లో వర్షిణి నీ చీప్ క్యారెక్టర్ అన్న వీడియోని కూడా చూపించారు. మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. కెప్టెన్ గా త్రిగుణ్ బాగా చేశాడు అనే వాళ్ళు చేయి ఎత్తమంటే.. వంశీ తప్ప ఎవరు ఎత్తలేదు. కానీ త్రిగుణ్ చేసిన అన్ని పనులు కెప్టెన్ గా గుడ్ అని చెప్పి త్రిగుణ్ పై ప్రశంసలు కురిపించారు. కానీ హార్ష్ గా ఎవరికి చెప్పొద్దు అందుకే వాళ్ళు చెయ్యి ఎత్తలేదు అని కూడా తెలిపారు. అందరితో కూల్ గా చెప్పి పనులు చేయించుకోవాలని కూరగాయలు పాడవడం , త్రిగుణ్ తప్పు కాదు అని నాగార్జున వర్షినికి కౌంటర్ కూడా ఇచ్చారు.. అలా మొత్తానికైతే నిన్నటి ఎపిసోడ్ కంటెస్టెంట్స్ కి వార్నింగ్ లతో ముగిసింది.
https://x.com/StarMaa/status/2119081198026981403?a=b3R2aAd5gMhN9eJvh68&s=20