BigTV English

Onion And Cloves For Hair: ఈ ఆయిల్ ఒక్క సారి వాడినా చాలు.. జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది !

Onion And Cloves For Hair: ఈ ఆయిల్ ఒక్క సారి వాడినా చాలు.. జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది !

Onion And Cloves For Hair: ప్రతి అమ్మాయి పొడవాటి, ఒత్తైన, అందమైన జుట్టు కలిగి ఉండాలని కలలు కంటుంది. కానీ చెడు జీవనశైలి, రసాయనాలతో తయారు చేసిన హెయిర్ ఆయిల్స్, షాంపూల వాడకం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. అంతే కాకుండా చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కుంటున్నారు. ఈ సీజన్‌లో జుట్టు రాలడం చాలా సాధారణం. కానీ కొన్నిసార్లు జుట్టు ఎక్కువగా రాలడం జరుగుతంది. ఇది క్రమంగా బట్టతలకు దారితీస్తుంది. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒక్కరు బట్టతలలో బాధపడుతున్నారు


మరి జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి మార్కెట్లో చాలా ఖరీదైన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మనం ఇంట్లోనే హెయిర్ ఆయిల్స్ తయారు చేసుకుని వాడవచ్చు. ప్రస్తుతం ఇంట్లో తయారుచేసిన ఓ హెయిర్ ఆయిల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది . దీన్ని తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్య తో పాటు  జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. మరి ఈ ఆయిల్ ఎలా తయారు చేస్తారు ? ఎలా వాడాలి ?  అనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ ఆయిల్ తయారీ:
కావాల్సినవి:


ఆవ నూనె- 3 టేబుల్ స్పూన్లు
బాదం నూనె- కప్పు
మెంతి గింజలు- 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ- 1
లవంగాలు- 10

రోజ్మేరీ ఆకులు- 3 రెమ్మలు

ఆయిల్ తయారీ :
జుట్టు రాలడం వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే.. ముందుగా మీరు ఒక ఉల్లిపాయ తీసుకొని దాని తొక్క తీయండి.. దానికి ముందుగా మనం తీసుకున్న లవంగాలను గుచ్చండి. ఇప్పుడు ఒక ఇనుప పాన్ తీసుకుని గ్యాస్ పై పెట్టి వేడి చేయండి. అందులో మీరు తీసుకున్న ఆవాల నూనె వేయండి.

నూనె వేడెక్కిన వెంటనే అందులో లవంగాలు గచ్చిన ఉల్లిపాయ వేయండి. తక్కువ మంట మీద మాత్రమే ఆయిల్ వేడి చేయాలని గుర్తుంచుకోండి. తర్వాత అందులోనే బాదం నూనె వేసి కలపండి.

ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత.. దానికి మెంతులు, రోజ్మేరీ ఆకులు వేయండి. తర్వాత అన్నీ 3-4 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. దీని తరువాత మీ నూనె పూర్తిగా సిద్ధంగా ఉంటుంది.

నూనె చల్లబడిన తర్వాత.. దానిని ఏదైనా శుభ్రమైన సీసాలో నింపండి. మీరు ఈ ఆయిల్ చాలా రోజులు నిల్వ చేసుకోవచ్చు.

మీరు తలస్నానం చేయడానికి 1-2 గంటల ముందు ఈ నూనెను అప్లై చేసి.. తర్వాత వాష్ చేయండి. ఈ ఆయిల్ తరచుగా వాడటం వల్ల మీరు గొప్ప ఫలితాలను చూస్తారు.

ఈ ఆయిల్ యొక్క అద్భుత ప్రయోజనాలు :
జుట్టుకు ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల మీ జుట్టు పెరుగుదల కూడా మెరుగుపడుతుంది.

ఈ నూనెను వారానికి రెండుసార్లు జుట్టుకు వాడటం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.

ఆవాల నూనె, ఉల్లిపాయలతో తయారు చేసిన ఈ నూనెను ఉపయోగించడం ద్వారా చలికాలంలో చుండ్రు సమస్యను కూడా పరిష్కరించవచ్చు.

మారుతున్న వాతావరణం కారణంగా మీ జుట్టు చాలా పొడిగా, నిర్జీవంగా మారితే ఈ స్థితిలో మీరు ఖచ్చితంగా ఈ నూనెను వాడాలి.

ఈ ఆయిల్ ఉపయోగించడం ద్వారా మీ జుట్టు కోల్పోయిన మెరుపును తిరిగి పొందవచ్చు.

Also Read: ఈ హెయిర్ జెల్ వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !

ఎన్ని సార్లు ఉపయోగించాలి ?

మీరు ఈ ఆయిల్‌ను వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు. మీరు తలస్నానం చేయడానికి 1-2 గంటల ముందు ఆయిల్ అప్లై చేయండి. మెరుగైన ఫలితాల కోసం కొన్ని నెలల పాటు ఈ ఆయిల్ వాడటం మంచిది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×